బ్రహ్మనాయుడు

బ్రహ్మనాయుడు
బ్రహ్మనాయుడు
బ్రహ్మనాయుడు
బ్రహ్మనాయుడు

"నా పలనాడు వెలలేని మాగాణిరా!" ఇది బ్రహ్మనాయుడి మాట. చెన్నకేశవస్వామి భక్తుడైన బ్రహ్మనాయుడు పల్నాటిని అభివృద్ధి చేయాలని కలలు కని దానికి పాటుపడిన మహనీయుడు. అందరూ సమానమేనని, కులమతాలు మానవులు సృష్టించుకొన్నవేనని చెప్పిన ఆదర్శవాది. ఆ కాలంలోనే అన్ని కుల మతముల వారితో సహపంక్తి (అందరూ కలసి భోజనం చేయడం) నిర్వహించినవాడు. ఇలా కులమత భేదాలు లేకుండా అంతా కలిసి ఒకే పంక్తిలో చేసే భోజనాలనే చాపకూడు అంటారు. ఇదే చాపకూటి సిద్ధాంతం.

బ్రహ్మనాయని తల్లి శీలమ్మ, తండ్రి దొడ్డనాయడు, భార్య ఐతాంబ, కుమారుడు బాలచంద్రుడు. వైష్ణవ ఆచార్యులైన పన్నిద్దరాళ్వారులు ముఖ్యంగా రామానుజాచార్యులు మొదలైనవారు ఈతన్ని ప్రభావితం చేశారు. తల్లిదండ్రుల శిక్షణ సత్యవర్తనకు దోహదం చేస్తే రామానుజాచార్యుల సిద్ధాంతం బ్రహ్మనాయణ్ణి ఒక సంస్కర్తగా తయారుచేసింది. మాచర్లలో సుప్రసిద్ధ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం కట్టించాడు.

బ్రహ్మనాయని ప్రధాన ఆయుధం కుంతం. బ్రహ్మనాయుడి కాలములో జరిగిన యుద్దమైన ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. పలనాటియుద్ధం ముగిసిన తరువాత గుత్తికొండబిలంలోకి వెళ్లినాడని నేటికీ సజీవంగా అందులోనే తపస్సు చేసుకుంటున్నాడని ఆ ప్రాంతపెద్దలు చెపుతారు.

ఇవికూడా చూడండి

వనరులు

బయటి లింకులు