బ్రియాన్ లారా

బ్రియాన్ లారా

TC, OCC
2012 లో లారా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రియాన్ చార్లెస్ లారా
పుట్టిన తేదీ (1969-05-02) 1969 మే 2 (వయసు 55)
శాంటా క్రజ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుRight-arm leg break
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 196)1990 డిసెంబరు 6 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2006 నవంబరు 27 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 59)1990 నవంబరు 9 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2007 ఏప్రిల్ 21 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987–2008Trinidad and Tobago
1992–1993Transvaal
1994–1998Warwickshire
2010Southern Rocks
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 131 299 261 429
చేసిన పరుగులు 11,953 10,405 22,156 14,602
బ్యాటింగు సగటు 52.88 40.48 51.88 39.67
100లు/50లు 34/48 19/63 65/88 27/86
అత్యుత్తమ స్కోరు 400* 169 501* 169
వేసిన బంతులు 60 49 514 130
వికెట్లు 4 4 5
బౌలింగు సగటు 15.25 104.00 29.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/5 1/1 2/5
క్యాచ్‌లు/స్టంపింగులు 164/– 120/– 320/– 177/–
మూలం: CricInfo, 2012 ఫిబ్రవరి 4

1969, మే 2 న జన్మించిన బ్రియాన్ లారా (Brian Charles Lara) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుపొందాడు. లారా పలుసార్లు టెస్ట్ క్రికెట్‌లో టాప్‌ర్యాంక్ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించడమే కాకుండా టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ 501* పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోరులో ప్రపంచరికార్డు సృష్టించాడు.

ప్రారంభ జీవితం

ఆరేళ్ళ ప్రాయంలోనే క్రికెట్ శిక్షణకై లారా తండ్రి స్థానిక హార్వార్డ్ కోచింగ్ క్లినిక్ లో చేర్పించాడు. ఫాతిమా కళాశలలో ఉన్నప్పుడు లారా క్రికెట్ జీవితం ప్రారంభమైంది. 14 సంవత్సరాల వయస్సులో పాఠశాల లీగ్ పోటీలలో పాల్గొని 126.16 సగటుతో 745 పరుగులు చేశాడు. దోంతో ట్రినిడాడ్ తరఫున అండర్-16 టీమ్ లో స్థానం పొందినాడు. 15 సంవత్సరాల వయస్సులోనే వెస్ట్‌ఇండీస్ తరఫున అండర్-19 టీమ్‌లో స్థానం పొందినాడు.

అంతర్జాతీయ క్రికెట్

అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రియాన్ లారా స్థానం అత్యున్నతమైంది. టెస్ట్ క్రికెట్‌లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఒక ఇన్నింగ్సులో అత్యధిక స్కోరు సాధించిన రికార్డులు అతని పేరిటే ఊన్నాయి. 1994లో ఇంగ్లాండుపై 375 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించగా, 2003లో దాన్ని మాథ్యూ హెడెన్ 380 పరుగులు చేసి అధికమించాడు. లారా మళ్ళీ 400 పరుగుల ఇన్నింగ్సుతో మరో పర్యాయం ప్రపంచ రికార్డు చేజిక్కించుకున్నాడు. అంతేకాదు డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత టెస్టులలో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గాను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బిల్స్ పాన్స్‌ఫోర్డ్ తర్వాత 2 క్వాడ్రుపుల్ సెంచరీలు (400 కంటే అధికంగా పరుగులు సాధించడం) చేసిన రెండో బ్యాట్స్‌మెన్ గాను అవతరించాడు. టెస్ట్ క్రికెట్ మొత్తంలో 9 డబుల్ సెంచరీలు సాధించి వీటిలో కూడా 12 డబుల్ సెంచరీలు సాధించిన డాన్ బ్రాడ్‌మెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. 1995లో ఇంగ్లాడుతో జరిగిన టెస్ట్ సీరీస్ లో వరుసగా 3 టెస్టులలో 3 శతకాలు సాధించాడు. 2005 నవంబర్లో ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా అధికమించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇతడు మూడు పర్యాయాలు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. మొదటి పర్యాయం 1998లో, రెండో సారి 2003లో, చివరగా 2006 ఏప్రిల్లో శివనారాయణ్ చందర్‌పాల్ రాజీనామాతో నాయకత్వం చేపట్టాడు. 2006 డిసెంబర్ 16న టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి వెస్ట్‌ఇండీస్ బ్యాట్స్‌మెన్ గా రికార్డు స్థాపించాడు[1]. 2007, ఏప్రిల్ 10న లారా వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు [2].

క్రీడాజీవితంలో ముఖ్యసంఘటనలు

  • తొలి సెంచరీలోనే ఆస్ట్రేలియాపై 277 పరుగులు చేసి తొలి టెస్ట్ సెంచరీ ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వారిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు [3]
  • 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్సులలో 7 సెంచరీలు సాధించిన వారిలో ఇతడే ప్రథముడు.
  • టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 క్వాడ్రుపుల్ సెంచరీలను సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్.
  • 2005, నవంబర్ 26న టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు.[4]
  • 5 వేర్వేరు సంవత్సరాలలో టెస్టులలో 1000 పరుగులు చొప్పున సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు.
  • అతివేగంగా 11,000 టెస్టు పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు..[5]
  • వెస్ట్‌ఇండీస్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.[6]
  • అతను సాధించిన సెంచరీలలో 9 డబుల్ సెంచరీలు. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నాడు.
  • టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై సెంచరీలు సాధించాడు.
  • వెస్ట్‌ఇండీస్ టీం స్కోరులో 20% పరుగులు సాధించాడు. ఈ విషయంలో డాన్ బ్రాడ్‌మెన్ (23%), జార్జ్ హీడ్లీ (21%) మాత్రమే ఇతనికంటే ముందున్నారు.
  • 2001-02 లో శ్రీలంకపై 3 టెస్టుల సీరీస్ లో 688 పరుగులు సాధించాడు. 3 టెస్టుల సీరీస్ లో ఇది రెండో అత్యధిక సీరీస్ స్కోరు. అంతేకాకుండా ఈ సీరీస్ లో వెస్టీండీస్ చేసిన పరుగులలో ఇది 42%.[7]
  • 2001-02 శ్రీలంక సీరీస్‌లో ఒకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన 6 గురు బ్యాట్స్‌మెన్లలో చోటు సంపాదించాడు.[8]
  • 164 క్యాచ్‌లు పట్టి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లలో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.[9]

అవార్డులు

  • 1994లో బి.బి.సి.స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు సాధించాడు.
  • 1995లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికయ్యాడు.

టెస్ట్ సెంచరీలు

బ్రియాన్ లారా సాధించిన టెస్ట్ సెంచరీల జాబితా
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి వేదిక సంవత్సరం
[1] 277 5 ఆస్ట్రేలియా సిడ్నీ, ఆస్ట్రేలియా 1993
[2] 167 13 ఇంగ్లాండు జార్జ్‌టౌన్, గుయానా 1993
[3] 375 16 ఇంగ్లాండు ఆంటిగ్వా 1994
[4] 147 21 న్యూజీలాండ్ వెల్లింగ్టన్, న్యూజీలాండ్ 1995
[5] 145 29 ఇంగ్లాండు మాంచెస్టర్, ఇంగ్లాండ్ 1995
[6] 152 30 ఇంగ్లాండు నాటింఘామ్, ఇంగ్లాండు 1995
[7] 179 31 ఇంగ్లాండు లండన్, ఇంగ్లాండు 1995
[8] 132 38 ఆస్ట్రేలియా పెర్త్, ఆస్ట్రేలియా 1997
[9] 103 42 ఇండియా ఆంటిగ్వా 1997
[10] 115 45 శ్రీలంక కింగ్స్‌టౌన్, సెయింట్ విన్సెంట్ 1997
[11] 213 61 ఆస్ట్రేలియా కింగ్‌స్టన్, జమైకా 1999
[12] 153* 62 ఆస్ట్రేలియా బ్రిడ్జిటౌన్, బార్బడస్ 1999
[13] 100 63 ఆస్ట్రేలియా ఆంటిగ్వా 1999
[14] 112 68 ఇంగ్లాండు మాచెస్టర్, ఇంగ్లాండు 2000
[15] 182 73 ఆస్ట్రేలియా అడిలైడ్, ఆస్ట్రేలియా 2000
[16] 178 81 శ్రీలంక గాలె, శ్రీలంక 2001
[17] 221 83 శ్రీలంక కొలంబో, శ్రీలంక 2001
[18] 130 83 శ్రీలంక కొలంబో, శ్రీలంక 2001
[19] 110 91 ఆస్ట్రేలియా జార్జ్‌టౌన్, గుయానా 2003
[20] 122 92 ఆస్ట్రేలియా పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ 2003
[21] 209 95 శ్రీలంక సెయింట్ లూసియా 2003
[22] 191 98 జింబాబ్వే బులావాయో, జింబాబ్వే 2003
[23] 202 99 దక్షిణాఫ్రికా జొహన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా 2003
[24] 115 101 దక్షిణాఫ్రికా కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా 2004
[25] 400* 106 ఇంగ్లాండు ఆంటిగ్వా 2004
[26] 120 108 బంగ్లాదేశ్ కింగ్‌స్టన్, జమైకా 2004
[27] 196 113 దక్షిణాఫ్రికా పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ 2005
[28] 176 114 దక్షిణాఫ్రికా బ్రిడ్జ్‌టౌన్, బార్బడస్ 2005
[29] 130 116 పాకిస్తాన్ బ్రిడ్జ్‌టౌన్, బార్బడస్ 2005
[30] 153 117 పాకిస్తాన్ కింగ్‌స్టన్, జమైకా 2005
[31] 226 121 ఆస్ట్రేలియా అడిలైడ్, ఆస్ట్రేలియా 2005
[32] 120 126 ఇండియా సెయింత్ లూసియా 2006
[33] 122 129 పాకిస్తాన్ లాహోర్, పాకిస్తాన్ 2006
[34] 216 130 పాకిస్తాన్ ముల్తాన్, పాకిస్తాన్ 2006

వన్డే సెంచరీలు

బ్రియాన్ లారా సాధించిన వన్డే సెంచరీల జాబితా
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి వేదిక సంవత్సరం
[1] 128 41 పాకిస్తాన్ డర్బాన్, దక్షిణాఫ్రికా 1993
[2] 111* 42 దక్షిణాఫ్రికా బ్లూయెంఫోటీన్, దక్షిణాఫ్రికా 1993
[3] 114 45 పాకిస్తాన్ కింగ్‌స్టన్, జమైకా 1993
[4] 153 54 పాకిస్తాన్ షార్జా, UAE 1993
[5] 139 83 ఆస్ట్రేలియా పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ 1995
[6] 169 90 శ్రీలంక షార్జా, UAE 1995
[7] 111 96 దక్షిణాఫ్రికా కరాచి, పాకిస్తాన్ 1996
[8] 146* 100 న్యూజీలాండ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ 1996
[9] 104 102 న్యూజీలాండ్ కింగ్‌స్టన్, సెయింట్ విన్సెంట్ 1996
[10] 102 108 ఆస్ట్రేలియా బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 1997
[11] 103* 109 పాకిస్తాన్ పెర్త్, ఆస్ట్రేలియా 1997
[12] 110 125 ఇంగ్లాండు బ్రిడ్జిటౌన్, బార్బడస్ 1998
[13] 117 157 బంగ్లాదేశ్ ఢాకా, బంగ్లాదేశ్ 1999
[14] 116* 176 ఆస్ట్రేలియా సిడ్నీ, ఆస్ట్రేలియా 2001
[15] 111 202 కెన్యా కొలంబో, Sri Lanka 2002
[16] 116 203 దక్షిణాఫ్రికా కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా 2011
[17] 116 217 శ్రీలంక బ్రిడ్జిటౌన్, బార్బడస్ 2003
[18] 113 219 జింబాబ్వే బులావాయో, జింబాబ్వే 2003
[19] 156 250 పాకిస్తాన్ అడిలైడ్, ఆస్ట్రేలియా 2005

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. http://www.howstat.com/cricket/Statistics/Batting/BattingCareerRuns_ODI.asp?Stat=5000 |title= ODI Batting Statistics
  2. Lara confirms one-day retirement BBC News retrieved July 30 2007
  3. Highest Maiden Tons Stats from CricInfo, retrieved July 30 2007
  4. Most Test Runs Stats from CricInfo retrieved July 30 2007
  5. Fastest Test Runs Stats from CricInfo retrieved July 30 2007
  6. http://www.cricinfo.com/db/STATS/TESTS/BATTING/LEADING_BATSMEN_TEST_100S.html Leading Test Batsmen] Stats from CricInfo retrieved July 30 2007
  7. Highest Aggregate runs in series Stats from CricInfo retrieved July 30 2007
  8. 100s in each innings Stats from Cric Info retrieved July 30 2007
  9. Test Career catces Stats from CricInfo retrieved July 30 2007