బ్లూ బెర్రీ
బ్లూబెర్రీ చెట్టు అన్ని ఋతువులలో సంవత్సరం పొడవునా పుష్పిస్తూ ఉంటుంది. వీటి వృక్ష శాస్త్రీయ నామం వాక్కీనియం సియానోకోకస్. 10 సెంటీమీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల (13అడుగుల) ఎత్తు పెరిగే ఇవి ఉత్తర అమెరికాలో పెరుగుతాయి. వీటి కాయలు ముదురు నీలం రంగులో వుంటాయి. నేడు బ్లూబెర్రీ సాగు కెనడా, ఐరోపా, ఆసియా ఖండాల్లో కూడా సాగు చేయబడుతోంది. నీలి రంగు బెర్రీ పండ్లుగల Vaccinium ప్రజాతికి చెందిన ఇది Cyanococcus భాగం లోనిది. (క్రాన్ బెర్రీలు, బిల్ బెర్రీలు ఈ జాతికి చెందినవే.) Cyanococcus భాగానికి చెందిన జాతి రకాలు చాలా సాధారణ పండ్లు కలిగి అమ్మకం జరుగుతున్నది. బ్లూ బెర్రీ చెట్టు యొక్క మూలం ఉత్తర అమెరికాకు చెందినది. పొద వలె పెరుగే ఈ బ్లూ బెర్రీ చెట్లను వ్యాపార పరంగా సాగుచేస్తున్నారు. 1930వ సంవత్సరం వరకు యూరప్ లో బ్లూబెర్రీ పరిచయం లేదు.
సాగు
బ్లూ బెర్రీలు ఆమ్ల గుణం ఉన్న నేలల్లో పెరుగుతాయి. అనగా నేల పి.హెచ్ విలువ 4 నుండి 5.5, నేరుగా ఎండ లేదా కొద్దిగా నీడ ఉండాలి. విత్తనాలు నాటడానికి సంవత్సరం ముందే నేలను సిద్ధం చేసుకోవాలి. నేలలో ఆమ్ల గుణం లేకపోతే సల్ఫర్ గాని అల్యుమీనియం సల్ఫర్ గాని కలుపుకోవాలి. పీట్ మాస్ నేల యొక్క ఆమ్లగుణాన్ని పెంచుతుంది కనుక దాన్ని కూడా వాడవచ్చు. సీడ్ ట్రేలలో విత్తనాలు మొలకెత్తి నర్సరీ ప్యాకెట్లలో మొక్కలుగా 20 సెంటీమీటర్లు ఎదిగిన తర్వాత మొక్కకు మొక్కకు మధ్య 6 నుండి 8 ఎనిమిది అడుగుల దూరం ఉండేలా మొక్కలు నాటుకోవాలి. నాటిన వెంటనే తడి పెట్టాలి. మొదటి 1, 2 సంవత్సరాల వరకూ పుష్పించే పువ్వులను తెంచివేసి 3 వ సంవత్సరం నుండి దిగిబడి పొందాలి. భారతీయ మార్కెట్ లో 1 కేజి బ్లూబెర్రీ కాయలు ధర 1800 రూపాయల వరకూ పలుకుతోంది.
పోషక విలువలు
100 గ్రాముల బ్లూబెర్రీ కాయల్లో కార్పోహైడ్రేట్లు 14.5 గ్రా, ఫైబర్ 2.4 గ్రా, ఫేట్ 0.3 గ్రా, ప్రొటీన్ 0.7 గ్రా, విటమిన్ ఎ 54 ఐ.యు, లుటిన్, క్సెన్థిన్ 80 మైక్రో గ్రా, బి1 0.04 మి.గ్రా, బి2 0.04 మి.గ్రా, నియాసిన్ 0.42 మి.గ్రా, బి5 0.1 మి.గ్రా, బి6 0.1 మి.గ్రా, ఫోలేట్ 6 మైక్రో గ్రా, విటమిన్ సి 10 మి.గ్రా, విటమిన్ ఇ 0.6 మి.గ్రా, విటమిన్ కె 19 మైక్రో గ్రా, కేల్షియం 6 మి.గ్రా, ఐరన్ 0.3 మి.గ్రా, మెగ్నిషియం 6 మి.గ్రా, మాంగనీస్ 0.3 మి.గ్రా, ఫాస్పరస్ 12 మి.గ్రా, పొటాషియం 77 మి.గ్రా, జింక్ 0.2 మి.గ్రా ఉంటాయి.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 239 కి.J (57 kcal) |
14.5 g | |
పీచు పదార్థం | 2.4 g |
0.3 g | |
0.7 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ lutein zeaxanthin | 80 μg |
విటమిన్ - ఎ | 54 IU |
థయామిన్ (B1) | 3% 0.04 mg |
రైబోఫ్లావిన్ (B2) | 3% 0.04 mg |
నియాసిన్ (B3) | 3% 0.42 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 2% 0.1 mg |
విటమిన్ బి6 | 8% 0.1 mg |
ఫోలేట్ (B9) | 2% 6 μg |
విటమిన్ సి | 12% 10 mg |
Vitamin E | 4% 0.6 mg |
విటమిన్ కె | 18% 19 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 1% 6 mg |
ఇనుము | 2% 0.3 mg |
మెగ్నీషియం | 2% 6 mg |
మాంగనీస్ | 14% 0.3 mg |
ఫాస్ఫరస్ | 2% 12 mg |
పొటాషియం | 2% 77 mg |
జింక్ | 2% 0.2 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ఉపయోగాలు
బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. బ్లూ బెర్రీస్, వయోజనులలో జ్ఞపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ 'ఆక్సిడేటివ్ ఫైటో కెమికల్స్', ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని, జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు. గతంలో, బ్లూ బెర్రీస్ మేసిన జంతువుల మీద జరిపిన పరిశోధనల ఆధారంగా, వయోజనులలో జ్ఞాపకశక్తి పెరగడానికి బ్లూ బెర్రీస్ తోడ్పడతాయని, ఇటీవల జరిపిన అధ్యయన కర్త, రాబర్ట్‌క్రికోరియన్ తెలియజేస్తున్నారు. ఆయన తమ సహాధ్యాయులతో సహా, ఎన్నో సంస్థల అండదండలతో, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో ఈ పరిశోధన నిర్వహించారు. 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల మీద బ్లూబెర్రీస్ జ్యూస్ ప్రభావం గురించి, క్రికోరియన్, ఆయన బృందం, అసంఖ్యాకమైన పరీక్షలు జరిపారు. అధ్యయన కాలంలో, ఈ స్టడీగ్రూప్‌లోని వృద్ధులు, 2 నుంచి 2 1/2 కప్పుల బ్లూ బెర్రీ రసం సేవించారు. 'కంట్రోల్ గ్రూప్'గా రూపొందిన మరో బృందం, రెండు నెలల పాటు, రోజూ, మరొక 'పానీయం' సేవించారు. కానీ, 'బ్లూ బెర్రీ జ్యూస్' తీసుకున్న వయో వృద్ధులలో, జ్ఞాపకశక్తి బాగా పెరిగింది. ఈ ప్రయోగాల ఫలితాలు ఎంతో, ఆశా జనకంగా వుండడంతో, 'న్యూరో డిజెనరేషన్' నిరోధించడానికి, బ్లూ బెర్రీస్ ఎంతగానో ఉపకరిస్తాయనే నిర్ణయానికి వచ్చాం అన్నారు. రాబర్ట్ క్రికోరియన్. బ్లూ బెర్రీస్ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు , అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థము ఉన్నాయి .
మూలాలు
ఇవి కూడా చూడండి
బ్లూ బెర్రీస్ - వాక్కీనియం సియానోకోకస్