మత్స్యావతారం
మత్స్యావతారము | |
---|---|
దేవనాగరి | मत्स्य |
అనుబంధం | విష్ణు అవతారం |
ఆయుధములు | చక్రం, గద |
హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ. ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడం.
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
- ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!
సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.
మత్స్యావతారంలో శ్రీమహావిష్ణువు వెలసిన ప్రముఖ ఆలయం
చిత్రమాలిక
-
మత్స్యావతారము
-
మత్స్యావతారము
-
మత్స్య అవతారం - మరొక చిత్రం.
-
ప్రళయాకాలములో అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను కాపాడుతున్న మత్స్యావతారమూర్తి
-
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనుక నున్న ద్వారం పైనున్న మత్స్యావతార మూర్తి రూపం