మన్మదురై-విరుధునగర్ రైలు మార్గం
మన్మదురై-విరుధునగర్ రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
రకము (పద్ధతి) | Express train Passenger train | ||
స్థితి | నడుస్తోంది | ||
లొకేల్ | తమిళనాడు | ||
చివరిస్థానం | Manamadurai Junction (MNM) Virudhunagar Junction (VPT) | ||
స్టేషన్లు | 5 | ||
సేవలు | 3 | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 2 మే 1964 | ||
పునఃప్రారంభించింది | 21 June 2013 | ||
యజమాని | Indian Railways | ||
నిర్వాహకులు | Southern Railway zone | ||
డిపో (లు) | Golden Rock | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 67 కి.మీ. (42 మై.) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
ఆపరేటింగ్ వేగం | 80 km/h (50 mph) | ||
|
మన్మదురై-విరుదునగర్ రైలుమార్గం తమిళనాడులోని విరుదునగర్, మన్మదురై పట్టణాలను కలిపే రైలు మార్గం .
చరిత్ర
మన్మదురై, విరుదునగర్ ల మధ్య కొత్త రైలు మార్గాన్ని మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు. ఇది అప్పటికే ఉన్న మన్మదురై-మదురై, మదురై-విరుదునగర్ విభాగాలపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించారు. [1] 1963 సెప్టెంబరు 1 న, 22.66 కిలోమీటర్లు (14.08 మై.) విరుదునగర్ - అరుప్పుక్కొట్టై విభాగాన్ని [2] ప్రారంభించారు. [3] 1963 మే 2 న మిగిలిన 43.89 కిలోమీటర్లు (27.27 మై.) అరుప్పుక్కొట్టై మన్మదురై సెక్షన్ను మీటర్ గేజ్ ట్రాక్‌లతో తెరిచారు. [4] 67 కిలోమీటర్లు (42 మై.) ఈ విభాగంలో మూడు క్రాసింగ్ రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఇది టుటికోరిన్‌లోని ప్రయాణికులకు సరుకుల రాకపోకలకూ సేవలు అందిస్తోంది. [5]
గేజి మార్పిడి కోసం 2008 లో ఈ మార్గాన్ని మూసేసారు. ₹231.58 crore (US$29 million) ఖర్చుతో మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కి మార్చాక 2013 జూలై 14 న ఈ మార్గాన్ని మళ్ళీ తెరిచారు. ఈ మార్గంలో విరుదునగర్, శివగంగ జిల్లాల పరిధిలో ఐదు ప్రధాన వంతెనలు, 145 చిన్న వంతెనలు, ఐదు రైల్వే స్టేషన్‌లు (3 క్రాసింగ్ స్టేషన్‌లతో సహా) ఉన్నాయి. [6] [7]
ప్రస్తుత పరిస్థితి
ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన తర్వాత కేవలం 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి పుదుచ్చేరి కన్యాకుమారి వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఇది ఈ మార్గంలో మొదటి ఎక్స్‌ప్రెస్ రైలుగా నడిచింది. బ్రాడ్ గేజ్‌గా మార్చాక ఈ రైలుతోనే ఈ మార్గాన్ని ప్రారంభించారు. రెండవ రైలు సిలంబు ఎక్స్‌ప్రెస్. ఈ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు, చెన్నై ఎగ్మోర్ నుండి సెంగోట్టై వరకు నడుస్తుంది. మొదట్లో ఈ రైలు కారైకుడి నుండి నడిచింది, తరువాత మనమదురై వరకు పొడిగించబడింది. ప్రజల నుండి సుదీర్ఘ డిమాండ్ల తరువాత, ఈ రైలును సెంగోట్టై వరకు పొడిగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా తిరుచిరాపల్లి, విరుదునగర్ మధ్య ప్రతిరోజూ నడిచే DEMU ప్యాసింజర్ రైలు ఉంది.
మూలాలు
- ↑ "Chapter 28: Transport and Communications". Government of India. Planning Commission (India). Archived from the original on 17 జూలై 2014. Retrieved 5 February 2014.
- ↑ "Railway Budget 1964–65" (PDF). Indian Railways. Railway Board. p. 4 (208). Retrieved 4 February 2014.
- ↑ "Ministers flayed for inaction on railway station issue". The Hindu. 15 December 2007. Archived from the original on 17 December 2007. Retrieved 5 February 2014.
- ↑ R. P. Saxena. "Indian Railway History Time line". Irse.bravehost.com. Archived from the original on 14 July 2012. Retrieved 5 February 2014.
- ↑ "Trains to chug out soon on Virudhunagar - Manamadurai broad gauge section". The Times of India. 7 March 2013. Archived from the original on 6 October 2013. Retrieved 4 February 2014.
- ↑ "Virudhunagar-Manamadurai BG section thrown open for traffic". The Times of India. 15 July 2013. Archived from the original on 14 December 2013. Retrieved 5 February 2014.
- ↑ "After five years, regular train services back on Virudhunagar - Manamadurai section". The Times of India. 8 September 2013. Archived from the original on 5 February 2014. Retrieved 5 February 2014.