మైసూరు స్టేట్ రైల్వే
మైసూరు స్టేట్ రైల్వే | |
---|---|
Indian Railway Heritage Logo-30 – Mysore State Railway (SR).jpg | |
తరహా | |
స్థాపన | {foundation} |
ప్రధానకేంద్రము | |
కార్య క్షేత్రం | మైసూరు సామ్రాజ్యం |
పరిశ్రమ | రైల్వేలు |
మైసూర్ స్టేట్ రైల్వే (MSR) మైసూర్ రాష్ట్రంలో పనిచేసే ఒక రైల్వే. [1] MSR 1951 ఏప్రిల్ 14 న దక్షిణ రైల్వేలో భాగమైంది.
చరిత్ర
1879లో మద్రాసు రైల్వే కంపెనీ మద్రాసు రాయపురం నుండి బెంగళూరు నగరానికి రైలు మార్గాన్ని నిర్మించింది. ఆ మార్గాన్ని బెంగళూరు నుండి మైసూర్ వరకు పొడిగింపు కోసం మైసూర్ మహారాజా ప్రత్యేకంగా ఒక రైల్వే సంస్థను స్థాపించాడు. [2] ఈ సంస్థనే మైసూర్ స్టేట్ రైల్వేగా పిలిచారు. 1891లో మైసూర్-నంజన్‌గూడు సెక్షన్ను (25.51 కి.మీ.) ట్రాఫిక్ కోసం తెరిచారు. బీరూర్-షిమోగా సెక్షన్ను (60.74 కి.మీ.) 1899లోను, మరొక ముఖ్యమైన లైన్ యశ్వంత్పూర్-హిందూపూర్‌ను 1892-93 లోనూ తెరిచారు. 1911-12లో మైసూర్ ప్రభుత్వం రాష్ట్ర రైల్వే నిర్మాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన Mr. EAS బెల్ నియంత్రణలో ఉంచబడింది. షిమోగా - తాళగుప్ప సెక్షనుకు 1930లో శంకుస్థాపన చేసారు. 1951లో, ఇది మద్రాసు అండ్ సదరన్ మహారాఠా రైల్వేతో కలిసి దక్షిణ రైల్వేగా ఏర్పడింది.
రోలింగ్ స్టాక్
1936లో కంపెనీకి 39 లోకోమోటివ్‌లు, 216 కోచ్‌లు, 754 గూడ్స్ వ్యాగన్‌లు ఉండేవి. [3]
మూలాలు
- ↑ "A rail link to Mysores history". Times of India. 19 February 2012. Retrieved 14 February 2015.
- ↑ "Origin and development of Southern Railway" (PDF). Retrieved 14 February 2015.
- ↑ World Survey of Foreign Railways.