యజుర్వేదం

యజుర్వేదంలోని ఒక పుట
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


వేదం అనగా ('విద్' అనే ధాతువు నుండి) 'జ్ఞానం' అని అర్ధం. యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు[పురోహితులు] చెప్పే మంత్రాలు [పద్యాలు] యజుర్వేదంలో ఉన్నాయి.

యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్ఠించేవారికి "అధ్వర్యులు" అని పేరు.

కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.

తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.

తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5, పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి,

అధ్యయినం, సమన్వయం, ప్రయోగం, కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి.

యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (తైత్తరీయ సంహిత), శుక్ల యజుర్వేదము (వాజసనేయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేద సంహిత యందు "ఉదాత్తము", "అనుదాత్తము", "స్వరితము", "ప్రచయము" అనే నాలుగు స్వరాలున్నాయి. బ్రాహ్మణము యందు "ఉదాత్తము", "అనుదాత్తము" అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము", "స్వరితము", "ప్రచయము" అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.

ప్రస్థవన

  • ఋక్‌ యజుస్సామ అథర్వణ వేదాలు నాలుగింటిలో రెండవది. ఋగ్వేదంలో మంత్రాలు ఋక్కులు, సామవేదంలో సామలు. ఇవి రెండూ కానివి యజుర్వేద మంత్రాలు. ‘‘శేషే యజుః’’ అని సూత్రం. ఇవి 109 వరకు ఉన్నాయంటారు. యజుర్వేద మంత్రాలు రెండు భాగాలు. ఒకటి శుక్ల యజుర్వేదం, రెండవది కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదానికి వాజ సనేయ సంహిత అనే పేరు కూడా ఉంది. వాజసని అంటే సూర్యుడు. సూర్యుడి నుంచి యాజ్ఞవల్క్య ముని గ్రహించినది గనుక వాజసనేయం అనే పేరు వచ్చింది. వేద విభజన చేసిన వ్యాసుడి నుంచి వైశం పాయనుడు యజుర్వేదం నేర్చుకొన్నాడు. వైశంపాయనుడి నుంచి యాజ్ఞవల్క్యుడు తెలుసుకొన్నాడు. కాని, వైశంపాయనుడికీ, యాజ్ఞవల్క్యుడికీ మధ్య ఏదో వివాదం రావడం వల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చిన వేదాన్ని వదలి వేయవలసి వచ్చింది. (మంత్రాలను కక్కవలసి వచ్చిందనీ, అలా కక్కిన మంత్రాలను దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి తినివేశారనీ ఒక కథ ఉంది. కక్కిన మంత్రాలు నల్లగా ఉండటం వల్ల వాటి సంహితకు కృష్ణ యజుర్వేదం అనే పేరు వచ్చిందంటారు. ఏదో ఒక గూఢార్థంతో ఈ కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. యాజ్ఞవల్క్యుడు వదలు కొన్నప్పటికీ ఆయన నుంచి అప్పటికే తెలుసుకొని ఉన్న కొందరు శిష్యులు వాటిని భద్రపరచి ఉంటారు.) నేర్చుకొన్నది పోయినందుకు బాధపడిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసించి తిరిగి యజుర్వేదాన్ని సంపాదించాడు. అదే శుక్ల యజుర్వేదం. (శుక్ల అంటే తెలుపు. కృష్ణ అంటే నలుపు.) యజుర్వేదం అలా రెండు శాఖలుగా వ్యాప్తిలోకి వచ్చింది. వైశంపాయనుడు నేర్పినది కృష్ణ యజుర్వేదమని, సూర్యుడు చెప్పినది శుక్ల యజుర్వేదమని రెండు శాఖలు వాడుకలోకి వచ్చాయి. యజుర్వేదం అనే శబ్దం యజుస్‌, వేదం అనే రెండు పదాల కలయిక. యజుస్‌ శబ్దం యజ్‌ అనే ధాతువు నుంచి ఏర్పడింది. యజ్ఞం అనే శబ్దమూ యజ్‌ నుంచి వచ్చినదే. యజ్‌ అంటే ఆరాధించడం, పూజించడం లాంటి అర్థాలు ఉన్నాయి. కర్మకాండను తెలియజేసే మంత్రాలు యజుస్సులు. యజ్ఞాలు ఎలా జరగాలో ఈ మంత్రాల వల్ల తెలుస్తుంది. యజుర్వేద మంత్రాలు సాధారణంగా గద్యరూపంలోనే ఉంటాయి. (ఋక్‌ పాదబద్ధా, గీతంతు సామ, గద్యం యజుర్మంత్రః) బ్రాహ్మణాలతో కలసిన యజుర్వేద మంత్రాలు యజుర్వేద సంహిత. శుక్ల యజుర్వేదంలో మాధ్యందిన సంహిత, కణ్వ సంహితలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణ భాగాల విభజన కనిపించదు. స్పష్టత లేకపోవడమే కృష్ణ శబ్దం (చీకటి) పొందడానికి కారణమై ఉండవచ్చునని ఒక అభిప్రాయం. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ, కఠ, మైత్రాయణీ శాఖలు ఉన్నాయి.

మూలాలు

  • వేదపండిత రచనలు www.vedapanditaha.blogspot.com
  • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)