యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
స్థాపితం1971
అనుబంధ సంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం
ప్రధానాధ్యాపకుడుDr.A.K.జైన్ [1]
స్థానందిల్షాద్ గార్డెన్, న్యూఢిల్లీ, భారతదేశం
కాంపస్పట్టణ
అథ్లెటిక్ మారుపేరుUCMS
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను 1971 లో స్థాపించారు. [2] అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి వైద్య విద్యను అందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఢిల్లీలో రెండు వైద్య కళాశాలలు MAMC, LHMC ఉన్నప్పటికీ, పలువురు విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం లభించలేదు. 1971 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణం ‌లోని తాత్కాలిక కెమిస్ట్రీ విభాగంలో కొత్త కళాశాల కోసం తరగతులు ప్రారంభమయ్యాయి. 125 మంది విద్యార్థులను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి లోను, మరో 50 మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని లాలా లాజ్‌పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ లోనూ ప్రాక్టికల్స్ కోసం పంపారు. కొంతకాలం తర్వాత, యుసిఎంఎస్ ను దక్షిణ ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. 1986 లో, యుసిఎంఎస్ దిల్షాద్ గార్డెన్ వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి వెళ్లి గురు తేగ్ బహదూర్ ఆసుపత్రితో అనుబంధం పెట్టుకుంది. [3]యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యుసిఎంఎస్) అనేది భారతదేశంలోని ఢిల్లీలోని ఒక వైద్య కళాశాల. ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది. ఇది గురు తేగ్ బహదూర్ ఆసుపత్రితో సంబంధం కలిగి ఉంది, ఇది బోధనా ఆసుపత్రిగా పనిచేస్తుంది.

చరిత్ర

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను 1971 లో స్థాపించారు. [4] అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి వైద్య విద్యను అందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఢిల్లీలో రెండు వైద్య కళాశాలలు MAMC, LHMC ఉన్నప్పటికీ, పలువురు విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం లభించలేదు. 1971 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణం ‌లోని తాత్కాలిక కెమిస్ట్రీ విభాగంలో కొత్త కళాశాల కోసం తరగతులు ప్రారంభమయ్యాయి. 125 మంది విద్యార్థులను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి లోను, మరో 50 మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని లాలా లాజ్‌పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ లోనూ ప్రాక్టికల్స్ కోసం పంపారు. కొంతకాలం తర్వాత, యుసిఎంఎస్ ను దక్షిణ ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. 1986 లో, యుసిఎంఎస్ దిల్షాద్ గార్డెన్ వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి వెళ్లి గురు తేగ్ బహదూర్ ఆసుపత్రితో అనుబంధం పెట్టుకుంది. [5]

2006 ఏప్రిల్ 5 న, భారత మానవ వనరుల శాఖ ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు, ఎయిమ్స్, యుసిఎంఎస్, జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజీతో సహా కేంద్ర సంస్థలలో ఇతర వెనుకబడిన వర్గాలకు 27% చొప్పున రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఉద్దేశించినట్లు ప్రకటించింది. రిజర్వేషన్ల విధానం గురించి ఆందోళన చెందుతున్న విద్యార్థులు (యుసిఎంఎస్ విద్యార్థులతో సహా) దీనిని రాజకీయ జిమ్మిక్కుగా భావించి యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే నిరసన వేదికను ప్రారంభించారు. [6]

ప్రాంగణం

యుసిఎంఎస్‌కు భారీ ప్రాంగణం ఉంది, ఇందులో గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ (జిటిబి) ఉంది. 1000 పడకలతో జిటిబి ఆసుపత్రి శిక్షణా ఆసుపత్రిగా పనిచేస్తుంది. [7] ఇందులో సెంట్రల్ వర్క్‌షాప్, యానిమల్ హౌస్, హాస్పిటల్ లాబొరేటరీ సర్వీసెస్ యూనిట్, హాస్టల్, మెడికల్ ఇలస్ట్రేషన్ అండ్ ఫోటోగ్రఫీ, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, స్కిల్ ల్యాబ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలున్నాయి. [8] కళాశాలలో ఆడియో-వీడియో, టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ వంటి సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. [9]

మూలాలజాబితా