రాజేంద్ర గావిట్
రాజేంద్ర గావిట్ | |||
పదవీ కాలం 2018 మే 31 – 2024 జూన్ 4 | |||
ముందు | చింతామన్ వనగా | ||
---|---|---|---|
తరువాత | హేమంత్ సవారా | ||
నియోజకవర్గం | పాల్ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాల్ఘర్ , మహారాష్ట్ర , భారతదేశం | 24 జూలై 1967||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన భారత జాతీయ కాంగ్రెస్ (2000–2018) | ||
సంతానం | రోహిత్ గావిట్ | ||
మూలం | [1] |
రాజేంద్ర ధేద్య గవిత్ (జననం 24 జూలై 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2018 లోక్‌సభ ఉప ఎన్నిక,2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాల్ఘర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజేంద్ర గవిత్ కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[3] ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యాడు.
రాజకీయ జీవితం
రాజేంద్ర గవిట్ 2018లో పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2019లో శివసేనలో చేరి పాల్ఘర్ నుండి రెండోసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజేంద్ర గవిట్ 2022లో శివసేనలో చీలిక తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి మారాడు.
మూలాలు
- ↑ "Denied ticket, Palghar sitting MP Rajendra Gavit returns to BJP from Shinde Sena" (in ఇంగ్లీష్). The Indian Express. 7 May 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ "BJP MP Rajendra Gavit joins Sena, to contest from Palghar". The Economic Times.
- ↑ "As ministers, Cong and NCP leaders were on pvt firm boards: RoC records" (in ఇంగ్లీష్). The Indian Express. 23 March 2016. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ "Palghar bypoll: In prestige battle, BJP's Rajendra Gavit defeats Shiv Sena candidate" (in ఇంగ్లీష్). DNA India. 31 May 2018. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.