రోహిణీ గాడ్బోలే

రోహిణీ గాడ్బోలే
జాతీయతభారతీయులు
రోహిణీ గాడ్బోలే

రోహిణీ గాడ్బోలే (ఆంగ్లం: Rohini Godbole) ఒక ప్రముఖ భారత మహిళా శాస్త్రవేత్త. రోహిణీ గాడ్బోలే అచ్చమైన మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి పూనాలోని " హుజుర్పగ ఉన్నత పాఠశాల " ఉపాద్యాయురాలు. ఆమె బి.ఎ., ఎం.ఎ. పూర్తిచేసిన తరువాత ముగ్గురు కుమార్తెలకు జన్మ ఇచ్చిన తరువాత బి.ఇ.డి పూర్యిచేసి ఉపాఫ్యాయురాలిగా పనిచేసింది. ఆమె తాత తన కుమార్తెలు మెట్రిక్యులేషన్ చదువు పూర్తి చేసే వరకు వివాహం చేయకూడదని దృఢనిశ్చయించుకున్నాడు. ఆమె అమ్మమ్మ సహితం 9వ తరగతి వరకు చదువుకున్నది. అందువలన రోహిణీ గాడ్బోలే కుటుంబం విద్యకు అత్యంత ముఖ్యత్వం ఇవ్వడం విశేషం. ఆమె ముగ్గురు సోదరీమణులలో ఒకరు ఫిజీషియన్ మిగిలిన ఇద్దరు విజ్ఞాన శాస్త్రము టీచర్లు. వారి కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు లేరు. వాస్తవంగా రోహిణీ గాడ్బోలే ప్రారంభంలో శాస్త్రవేత్త కావాలని అనుకోలేదు.

స్కూలు

ఆమె ఏడవ తరగతి చదివే సమయంలో వారి స్కూలులో హోం విజ్ఞాన శాస్త్రము మాత్రమే బోధించబడేది. స్టేట్ మెరిట్ స్కాలర్ షిప్పు కొరకు ప్రయత్నించే సమయంలో ఆమె ఫిజిక్స్, బయాలజీ, కెమెస్ట్రీ చదవడం మొదలైది. అది కూడా ఆమె తనకు తానే నేర్చుకున్నది. ఆమె చదువుకున్న పాఠశాలలో స్కాలర్ షిప్పు పొందిన మొదటి విద్యార్థిరోహిణీ గాడ్బోలే' గుర్తించతగిన విషయం. వారి మాథమెటిక్స్ టీచర్ మిసెస్. సొహానీ ఆమెను మిస్టర్. సొహానీ వద్ద మాథమెటిక్స్, విజ్ఞాన శాస్త్రము చదువుకోవడానికి తన ఇంటికి ఆహ్వానించింది. మిస్టర్. సొహానీ తన ప్రత్యేక శైలిలో విద్యార్థులతో పలువిషయాల గురించి జరిపిన చర్చలు, సలహాలు ముచ్చట్లు సాగించాడు. తరువాత ఆమె విజ్ఞాన శాస్త్రము మాగజింస్ చదవడం, విజ్ఞాన శాస్త్రము వ్యాసాల పోటీలో పాల్గొనడం అలాగే పాఠ్యపుస్తకాలను దాటి అధ్యయనం చేయడం అలవాటు చేసుకుంది.

టాలెంట్ టెస్ట్

రోహిణీ గాడ్బోలే పూనాలో ఉన్న " శ్రీ పర్షురంభు కాలేజ్ "లో బి.ఎస్.సి ఫిజిక్స్ చదువుకునాఫి. ఒకరోజు ఆమె అక్క " నేషనల్ టాలెంట్ టెస్ట్ " (ఎన్.ఎస్.టి.ఎస్) స్కాలర్ షిప్ కార్యక్రమం గురించి ఒక కరపత్రం తీసుకువచ్చింది. ఆమె అప్పటికే ప్రొఫెషనల్ కోర్సెస్ అతీతంగా చదవాలని నిర్ణయించుకున్నది కనుక ఆ పరీక్షకు హాజరు కావాలని నిశ్చయించుకున్నది. ఈ పరీక్షల కొరకు ఆమెకు వేసవి శలవులను ప్రఖ్యాతి వహించిన " ఢిల్లీ ఐ.ఐ.టి , కాంపూర్ ఐ.ఐ.టి గడిపే అవకాశం లభించింది. అక్కడ ఆమెకు లభించిన స్నేహితులలో కొందరు ఆమె జీవితాంతం వెంటనడిచారు. ఆమెకు అప్పటికి రీసెర్చ్ గురించి అవగాహన కలగలేదు ఆమె యూనివర్శిటీలో ప్రధమశ్రేణిలో బి.ఎస్.సి పూర్తిచేసింది. తరువాత బ్యాంక్ ఆఫ్ మాహారాష్ట్రా నుండి ఉద్యోగానికి పిలుపు వచ్చింది. బ్యాంక్ ఆమెకు ఇస్తానని తెలియజేసిన జీతం అప్పుడామె తండ్రి జీతంతో సమానమన్నది విశేషం. అయినప్పటికీ ఆమె ఆ ఉద్యోగ అవకాశాన్ని అందుకొనక రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నది. ఆ ప్రయత్నంలో ఆమె ముంబయి ఐ.ఐ.టిలో ఎం.ఎస్.సి చదవడానికి నిశ్చయించుకున్నది. ప్రొఫెసర్ ఎస్.హెచ్ వంటి ప్రొఫెసర్లు ఆమెకు పుస్తకాలకు అతీతంగా ఆలోచించడం నేర్పించారు. ఆమె ఎం.ఎస్.సి రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు విదేశాలకు పి.హె.డి కొరకు అభ్యర్ధించింది. తరువాత ఆమెకు " స్టోనీ బ్రోక్ యూనివర్శిటీ నుండి అసిస్టెంస్ షిప్ అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని అందుకుని ఆమె ప్రాక్టికల్ రీసెర్చ్ చేయడానికి వెళ్ళింది.

రీసెర్చ్

రోహిణీ గాడ్బోలే తల్లితండ్రులు మగపిల్లలకు ఆడపిల్లలకు భేదం లేకుండా పెంచారు. అందువలన పి.హెచ్.డి చేయడానికి అమెరికా పోవడం ఆమెకు ప్రత్యేకంగా అనిపించలేదు. బంధువులు మాత్రం వివాహం విషయంలో సమస్యలు ఎదురౌతాయని భయపెట్టారు. అయినప్పటికీ ఆమె తల్లితండ్రులు వాటిని లక్ష్యపెట్టక ఆమె రీసెర్చ్ చెయ్యడానికి మద్దతుగా ఉన్నారు. ఆడపిల్లలు రీసెర్చ్ స్థాయికి ఎదగాలంటే తల్లితండ్రుల మద్దతు తప్పనిసరి అని ఆమె అభిప్రాయం.

రీసెర్చ్ తరువాత

రోహిణీ గాడ్బోలే రీసెర్చ్ పూర్తిచేసిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆమెకు పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ కొరకు ఐరోపా నుండి ఉద్యోగావకాశం వచ్చింది. అయినప్పటికీ ఇంటికి దూరమై 5 సంవత్సరాలు అయినందున ఆమె ఉద్యోగావకాశం వదులుకుని భారదేశానికి తిరిగి వచ్చింది. పి.హెచ్.డి తరువాత ఆమె " టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ "లో మూడు సంవత్సరాలు పనిచేసింది. తరువాత అమే " ముంబయి యూనివర్శిటీ "లో లెక్చరర్‌గా పనిచేసింది. టి.ఐ.ఎఫ్.ఆర్‌లో ఉన్న స్నేహితులు ఆమె రీసెర్చ్ ముగింపుకు వచ్చిందని భావించారు. భారతదేశంలో రీసెర్చ్ ఇంస్టిట్యూట్, యూనివర్శిటీలకు మద్య అత్యధికంగా భేదం ఉన్నట్లు ఆమెకు మొదటిసారిగా తెలిసింది. టి.ఐ.ఎఫ్.ఆర్‌లో సులభంగా లభించిన నివాస వసతి ముంబయిలో లభించడానికి మూడు సంవత్సరాలు అయింది.

రీసెర్చ్ కొనసాగింపు

రోహిణీ గాడ్బోలే పార్టికల్ ఫిజిక్స్ రీసెర్చ్ కొనసాగించింది. సహోద్యోగులకు సహకరిస్తూనే టి.ఐ.ఎఫ్.ఆర్ రీసెర్చ్ విద్యార్థులతో రీసెర్చ్ కూడా కొనసాగింది. ఆమె రీసెర్చ్ ఆసక్తి గమనించి డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ రంగ్‌వాలా ఆమెకు సహకారం అందించాడు. ఇలా కేరీరులో ముందుకు సాగుతూ 12 సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత రోహిణీ గాడ్బోలే జెనీవాలోని " లార్జ్ హాడ్రాన్ కోలిడర్ "లో థియొరేటికల్ ఆస్పెక్ట్స్ స్టడీస్‌లో పనిచేస్తుంది. ఆమె " ఐ.ఐ.టి డిస్టింగష్ అల్యూమిన్ " అవార్డ్ అందుకున్నది.

వివాహం

రోహిణీ గాడ్బోలే జర్మన్ సహోద్యోగిని వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఇద్దరికీ మద్య ఉన్న దూరం దృష్టిలో ఉంచుకుని పిల్లలను మాత్రం వద్దని భావించారు. వారిరద్దరూ ఒకే ప్రదేశంలో నివసించే అవకాశమే రాలేదు.

వెలుపలి లింకులు

మూలాలు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.