లెవీ స్ట్రాస్

లెవీ స్ట్రాస్ (ఫిబ్రవరి 26, 1829 – సెప్టెంబరు 26, 1902) అమెరికా కి వలస వచ్చి బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో. ని 1853లో క్యాలిఫోర్నియా కి చెందిన సాన్ ఫ్రాన్సిస్కో లో నెలకొల్పిన ఒక జర్మన్ యూదు.

లెవీ స్ట్రాస్
జననం
Löb Strauß (లోయ్బ్ ష్ట్రౌస్స్)

ఫిబ్రవరి 26, 1829
బుట్టెన్ హైం, బవేరియా రాజధాని, జర్మన్ కాన్ఫెడరేషన్
మరణంసెప్టెంబరు 26 1902
సాన్ ఫ్రాన్సిస్కో, క్యాలిఫోర్నియా, అమెరికా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్లూ జీన్స్ ని రూపొందించిన మొదటి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో. ని నెలకొల్పాడు.

జీవితం

లెవీ స్ట్రాస్ లోయ్బ్ ష్ట్రౌస్స్ గా జర్మనీలోని బవేరియా కి చెందిన ఫ్రాంకోనియన్ ప్రాంతం బుట్టెన్ హైం లో హిర్ష్ఖ్ ష్ట్రౌస్స్(Hirsch Strauss), రెబెక్కా హాస్ ష్ట్రౌస్స్ (Rebecca Haass Strauss) కి జన్మించాడు. తన 18వ ఏట ష్ట్రౌస్స్, తల్లి, ఇద్దరు సోదరీమణులతో అమెరికా లోని న్యూ యార్క్ నగరంలో తన సోదరులు జోనాస్, లూయిస్ నడుపుతున్న జె. ష్ట్రౌస్స్ బ్రదర్ అండ్ కో. అను దుకాణంలో చేరాడు. 1850 నాటికి ష్ట్రౌస్స్ తనని తాను లెవీ అని వ్యవహరించుకోవటం మొదలు పెట్టాడు.

వ్యాపారం ప్రారంభం

శాన్ ప్రాన్సిస్కో లో కూడా ఒక దుకాణం తెరవాలనుకొన్న ష్ట్రౌస్స్ కుటుంబం లెవీని అందుకు ఎన్నుకొన్నారు. అప్పటికే అమెరికన్ పౌరత్వాన్ని పొందిన లెవీ మార్చి 1853 నాటికి శాన్ ప్రాన్సిస్కో చేరాడు.

లెవీ స్ట్రాస్ అండ్ కో. ని స్థాపించిన లెవీ అందులో సోదరుని వద్ద నుండి తెప్పించుకొన్న వస్త్రాలు, పరుపులు, దువ్వెనలు, పర్సులు, చేతిరుమాళ్ళను అమ్మటం మొదలుపెట్టాడు. పశ్చిమాన చిన్నపాటి జనరల్ స్టోర్లకు, పురుషుల సామాగ్రి అమ్మే దుకాణాలకు అమ్మేవాడు. 1856 లో లెవీ సోదరి ఫ్యాన్నీ, తన భర్త డేవిడ్ స్టర్న్ తమ అబ్బాయి జాకబ్ తో కలసి న్యూ యార్క్ నుండి శాన్ ప్రాన్సిస్కో చేరారు.

లెవీ జీన్స్

1870 లో జాకబ్ డెవిస్ అనే నెవాడా కు చెందిన దర్జీ మగవారు పని చేసే వేళల్లో వేసుకొనే ప్యాంట్లలో వత్తిడికి గురి అయ్యే ప్రదేశాలను గుర్తించాడు. ఈ ప్రక్రియకి పేటెంటు పొందాలనుకొన్నాడు కానీ తన వ్యాపారానికి ఒక భాగస్వామి కావాలనుకొన్నాడు. లెవీ వద్ద వస్త్రాలను కొంటూ ఉండటం వలన అతని సహాయం కోరాడు. మే 20, 1873 న ష్ట్రౌస్స్, డేవిస్ డెనిం వర్క్ ప్యాంట్ ల జేబులను రాగి బొత్తా(రివెట్)ల తో బలపరచే ప్రక్రియకి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ #139121 ని అందుకొన్నారు. న్యూ హ్యాంప్ షైర్ లోని మ్యాంచెస్టర్ కి చెందిన అమోస్కియగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేసే వస్త్రంతో లెవీ స్ట్రాస్ అండ్ కో. ప్రఖ్యాత లెవీస్ బ్రాండు జీన్స్ ని రూపొందించటం మొదలుపెట్టినది.

మరణం

సెప్టెంబరు 26, 1902 న లెవీ తన 70వ ఏట కన్ను మూశాడు. అవివాహాతుడిగానే మిగిలిపోయిన లెవీ తన వ్యాపారాన్ని తన మేనల్లుళ్ళు జాకబ్, సిగ్మండ్, లూయిస్, అబ్రహం స్టర్న్ (ఫ్యాన్నీ, డేవిడ్ స్టర్న్ ల పుత్రులు)లకు రాసిచ్చాడు.

మూలాలు

ఇవి కూడా చూడండి