వరుపుల సత్యప్రభ

వరుపుల సత్యప్రభ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్
నియోజకవర్గం ప్రత్తిపాడు

వ్యక్తిగత వివరాలు

జననం 1980
పెద సంకర్లపూడి, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి వరుపుల రాజా
సంతానం 2

వరుపుల సత్యప్రభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

వరుపుల సత్యప్రభ భర్త వరుపుల రాజా మండలాధ్యక్షుడి నుంచి అప్కాబ్ వైస్ చైర్మన్ వరకూ ఎదిగిన ఆయన వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయి 2023 మార్చి 4న గుండెపోటుతో మరణించాడు. వరుపుల సత్యప్రభ తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి నియోజకర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితురాలై[2] పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ప్రత్తిపాడు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుపై 38,768 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3][4]

మూలాలు