వారాహి

వారాహీ
వారాహి
పులిని వాహనంగా కలిగి వరాహ (పంది) ముఖం, పది చేతులతో వారాహి దేవి.
సంస్కృత అనువాదంVārāhī
అనుబంధంమాతృకలు
మంత్రంఓం హ్రీం వారాహీ హరి ఓం
ఆయుధములుత్రిశూలం, ఖడ్గం
వాహనంగేదె, సింహం, పులి, గుర్రం
అమెరికాలోని పొంటియాక్ లో గల పరాశక్తి ఆలయంలో దేవీ వారాహీ అంబిక

వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ (పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామినేపాల్లో ఈమెను బారాహి అంటారు.

వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది.

హిందూ dharmam నమ్మకాలు

మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ (పంది) రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి (కింది వరుసలో కుడివైపు) ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం (ములుగర్ర) ఆయుధాలుగా కలిగి ఉంది.

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.

మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.

దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.

వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.

మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.

దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.