విక్రమ్ భట్

విక్రమ్ భట్
జననం (1969-01-27) 1969 జనవరి 27 (వయసు 55)
ముంబై, మహారాష్ట్ర, ఇండియా
వృత్తిఫిల్మ్ డైరెక్టర్

విక్రమ్ భట్, 1969 జనవరి 27 న ముంబైలో జన్మించాడు.భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, కథ రచయిత, నటుడు.[1] గతంలో అతను ఎ.యస్.ఎ. ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో క్రియేటివ్ హెడ్ గా పనిచేసాడు. అయితే అతను 2014 లో కంపెనీకి రాజీనామా చేశాడు[2] విక్రమ్ భట్ భారత చిత్ర పరిశ్రమకు మార్గదర్శకులలో ఒకరైన గుజరాత్ రాష్ట్రం, "భావ్‌నగర్ జిల్లా" పాలిటానా నగరానికి చెందిన విజయ్ భట్ మనవడు, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ భట్ కుమారుడు.

జీవిత గమనం

విక్రమ్ భట్ కు 14 సంవత్సరాల వయస్సులో (1982) దర్శకుడు ముకుల్ ఆనంద్ తో కలిసి ఆనంద్ మొదటి చిత్రం "కనూన్ క్యా కరేగా" చిత్తంతో తన వృత్తిని ప్రారంభించాడు. అగ్నిపాథ్ చిత్రం సెట్స్‌లో చీఫ్ అసిస్టెంట్‌గా ముకుల్ ఆనంద్‌కు భట్ సహాయం చేశాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాకపోయినా కల్ట్ క్లాసిక్ చిత్రంగా పేరుగడించింది. తదనంతరం భట్ దర్శకుడు శేఖర్ కపూర్‌తో కలిసి రెండున్నర సంవత్సరాలు, తరువాత దర్శకుడు మహేష్ భట్‌తో కలిసి రెండేళ్లు పనిచేశాడు. హమ్ హైన్ రాహి ప్యార్ కే, జునూన్ చిత్రాలతో సహా పలు విజయవంతమైన చిత్రాల సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

దర్శకుడిగా అతని కెరీర్ ముఖేష్ భట్ నిర్మించిన జానం చిత్రంతో ప్రారంభమైంది.అతని మొదటి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేదు. అతని మొదటి విజయవంతమైన దర్శకత్వం ఫరేబ్ చిత్రం.దీని తరువాత, అతని దర్శకత్వంలో గులాం, కసూర్, రాజ్, అవారా పాగల్ దీవానా, వంటి చిత్రాలు వరసగా విజయవంతమైయ్యాయి ఆ తరువాత అవరా పాగల్ దీవానా చిత్రం తరువాత, అతను ఆప్ ముజే అచే లగ్నే లాగే, దీవానే హుయ్ పాగల్, అంకహీ వంటి చిత్రాలు అపజయం (ప్లాప్) అయ్యాయి.2008 లో భట్ భయానక శైలితో తిరిగి రంగంలో అడుగు పెట్టి, 1920, షాపిట్, హంటెడ్ - 3 D అనే మూడు చిత్రాలు 2010లో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన మూడు చిత్రాలను అందించాడు. 2010 లో భట్ అతని హంటెడ్ - 3 డి చిత్రంతో భారతదేశంలో మొదటిసారి స్టీరియోస్కోపిక్ - 3 డిని పరిచయం చేశాడు.[3] ఈ చిత్రం 2011 మేలో విడుదలై బాక్సాఫీస్ వద్ద 270 మిలియన్లు రూపాయలు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ భయానక చిత్రంగా పేరు పొందింది.

2012 లో భట్ దర్శకత్వంలో తీసిన రాజ్ 3 డి చిత్రం మూడవ వారాంతం తరువాత దేశీయ బాక్సాఫీస్ వసూళ్లను 729 మిలియన్లుగా వసూలు చేయగా, విదేశీ సేకరణ 46 మిలియన్లుగా నమోదైంది.[4] వరుస చిత్రాల విజయంతో అధికంగా నడుస్తున్న భట్, బిపాషా ముఖ్య పాత్రకోసం మరో హర్రర్ థ్రిల్లర్ రాజ్ 3 రాసాడు.[5] రాజ్ 3 విజయవంతం అయిన తరువాత, విక్రమ్ భట్ రాసిన హిందీ హర్రర్ చిత్రం 1920 ఈవిల్ రిటర్న్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తొలి వారాంతపు కలెక్షన్ చార్టులో బాక్స్ ఆఫీసు వద్ద అగ్రస్థానంలో ఉన్న భూషణ్ పటేల్ అగ్రస్థానంలో నిలిచాడు. సుమారు వసూలు రూ . 124.3 మిలియన్ నిఖర వసూళ్లు తెచ్చింది. ఈ చిత్రం రెండవ వీకెండ్‌లో సుమారు రూ .53.5 మిలియన్ల నెట్ వసూలు చేసి, మొత్తం రూ . 228.6 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని 'హిట్' గా ప్రకటించారు. వెంటనే, భట్, భూషణ్ కుమార్ టి-సిరీస్‌తో సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, హర్రర్ కళా ప్రక్రియల 5 చిత్రాలను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు చిత్రాలకు భట్ స్వయంగా దర్శకత్వం వహించారు.2014 ఫిబ్రవరి 16 నుండి, అతను స్టార్ ప్లస్‌లో రియల్ లైఫ్ రొమాన్స్ ఆధారంగా టీవీ షో ఇష్క్ కిల్స్‌ను హోస్ట్ చేస్తున్నాడు.[6]

గుర్తించదగిన విజయాలు

ఇతని చిత్రం 1920 ఈవిల్ రిటర్న్స్ పై సోషల్ మీడియాలో ప్రమోషన్ ప్రచారాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు సంస్థ అధ్యయనం చేసింది.[7] నిర్వహణ సంస్థ ఇంటర్నెట్ కార్యకలాపాలు, ప్రచారాలను అంచనా వేసింది. ఈ బృందం చివరకు సోషల్ మీడియాలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, ప్రమోషన్ల మధ్య సంబంధాన్ని గుర్తించింది.ఈ కేస్ స్టడీని హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ ప్రచురించింది. దీనిని యుఎస్, కెనడా, నార్వే, స్లోవేనియా, శ్రీలంక దేశాలలోని విద్యార్థులు ఉపయోగిస్తున్నారు.ఖమోషియాన్, 1920 ఈవిల్ రిటర్న్స్ చిత్రాల కోసం భట్ రాసిన స్క్రిప్ట్స్ నవలలుగా మారి 2015 జనవరిలో విడుదల అయ్యావి.

పురస్కారాలు, ఎంపికలు

ఫిలిం ఫేర్ అవార్డులు: 1999లో గులాం, 2003 లో రాజ్ చిత్రాలకు ఉత్తమ దర్శకుడు అవార్డు పొందాడు

వ్యక్తిగత జీవితం

భట్ తన చిన్ననాటి ప్రియురాలు అదితి భట్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి కృష్ణ భట్ అనే కుమార్తె ఉంది.[8] తరువాత భట్ అమీషా పటేల్‌తో ఐదేళ్లపాటు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.[9] భట్ తన కుమార్తెతో గొప్ప బంధాన్ని పంచుకుంటుంటాడు. కుమార్తె కృష్ణ భట్ అతని సెట్లలో సహాయం చేస్తోంది.

మూలలు

  1. "Vikram Bhatt". IMDb (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  2. "Reliance upset with ASA Entertainment over 1920 London". Bollywood Hungama. 27 May 2014. Retrieved 2020-04-15.
  3. "Haunted 3D: 10 Things You Didn't Know About The Movie". KoiMoi.com. 5 May 2011. Retrieved 2020-04-15.
  4. Team, Koimoi com (2012-09-30). "Raaz 3 3rd Week Box Office Collections". Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  5. "Vikram Bhatt, Bipasha Basu team up again for next film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  6. info@biharprabha.com, Bihar Reporter : (2014-02-05). "Vikram Bhatt to host TV Show Ishq Kills on Star Plus". Biharprabha News (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.{cite web}: CS1 maint: extra punctuation (link)
  7. "1920 Evil Returns - Bollywood and Social Media Marketing ^ IMB437". HBR Store (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.[permanent dead link]
  8. "Vikram Bhatt's holiday with wife and daughter - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  9. "Ameesha and I never loved each other: Vikram Bhatt - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.

వెలుపలి లంకెలు