విప్ (రాజకీయాలు)

విప్, అనేది రాజకీయ పార్టీలలో అధికారికంగా నియమించిన వ్యక్తి సంబంధించిన పదం. ఆ హోదాలో ఉన్న వ్యక్తి లేదా అధికారి శాసనసభలో సంబందిత పార్టీ క్రమశిక్షణను పర్యవేక్షించడం

విప్ పదం వాడుక

వేట సమయంలో "విప్పర్-ఇన్" నుండి ఈ పదం తీసుకోబడింది. వేట గుంపు నుండి వేటగాళ్ళు దూరంగా తిరగకుండా నిరోధించడానికి ప్రయత్నించే దానినుండి వాడుకలోకి వచ్చింది. అదనంగా, "విప్" అనే పదానికి శాసనసభ్యులకు జారీ చేసిన ఓటింగ్ సూచనలు, లేదా వారి పార్టీ పార్లమెంటరీ సమూహంలో ఒక నిర్దిష్ట శాసనసభ్యుడి హోదా అని అర్ధం కావచ్చు.[1]

పూర్వాపరాలు

సాధారణంగా ఒక పార్టీ తరపున గెలిచిన రాజకీయ నాయకులు ఆ పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ అతనిని నమ్మి బీఫారం ఇస్తారు. అలాగే ఆ పార్టీపై అభిమానం ఉన్న ఓటర్లు నమ్మి అతనికి ఓట్లు వేస్తారు.అలా గెలిచిన కొందరు అభ్యర్థులు, కొన్ని సందర్భాలలో కొందరు రాజకీయనాయకులు వారి గెలుపుకు కారణమైన పార్టీకి కాక ప్రత్యర్థి పార్టీకి సహకరించేందుకు పూనుకుంటారు. తాను గెలిచిన పార్టీకి కాక ప్రత్యర్థి పార్టీకి సహకరించటం అన్యాయం, అక్రమం, అనైతికం. కావున ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడే వారిని నిరోధించేందుకు రాజకీయపార్టీలకు చట్టం విప్ అనే రాజకీయబ్రహ్మస్త్రానిచ్చింది.

కొన్ని సందర్భాలలో ఓట్లు పోలింగుకు అవసరమైన ఓట్లు కావల్సినప్పుడు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చూడటం విప్ పదవిలో ఉన్న రాజకీయనాయకుడు పాత్ర గణనీయంగా ఉంది. ఇటువంటి సందర్బాలలో రాజకీయ పార్టీల విప్‌లు కీలక పాత్ర పోషిస్తారు. శాసనసభలోని పార్టీల నిర్వాహకులుగా సరిగ్గా చెప్పగలిగే 'విప్'ల కార్యాలయంపై శాసన వ్యవస్థ సమర్థవంతమైన, సజావుగా పనితీరు గణనీయమైన స్థాయిలో ఆధారపడి ఉంటుంది.

హౌస్ ఆఫ్ లెజిస్లేచర్‌లో తమ పార్టీ సభ్యులను కలిగి ఉన్న ప్రతి రాజకీయ పార్టీ, దాని సభ్యులలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని విప్ లేదా విప్‌లుగా నియమిస్తుంది. విప్‌లు తమ సభ్యులకు అన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందజేస్తారు. ముఖ్యంగా ముఖ్యమైన చర్చలు, ఓటింగ్ సమయంలో సభలో వారి సంబంధిత పార్టీల సభ్యుల ఉనికిని, భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తారు. శాసనసభ విధానాలు, పద్ధతులు, సమావేశాల సంక్లిష్ట అవసరాలకు సంబంధించి సమర్థవంతమైన సమన్వయాన్ని నిర్ధారించడానికి వారు తమ పార్టీల సభ్యుల తరపున ప్రిసైడింగ్ అధికారులు, సంబంధిత సభ సెక్రటేరియట్‌తో సంభాషిస్తారు.

అసెంబ్లీ కార్యక్రమాల నిర్వహణలో వివిధ రాజకీయ పార్టీల విప్‌లు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ల పాత్ర కీలకం. విప్ అనే పదాన్ని లోక్‌సభ మాజీ స్పీకర్ శ్రీ శివరాజ్ వి. పాటిల్ "సభ్యుల మనస్సుల బెడద తెలుసుకోవాలని భావించే అధికారం" అని నిర్వచించారు.[2]

చరిత్ర

భారతదేశంలో, విప్ ప్రభావం భావన బ్రిటిష్ పాలన నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ వారి పార్టీ క్రమశిక్షణ, శాసనసభ హౌస్ లో సభ్యుల ప్రవర్తనకు బాధ్యత వహించే విప్‌ను నియమిస్తుంది. సాధారణంగా, వారు పార్టీ సభ్యులను కొన్ని సమస్యలపై పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని నిర్దేశిస్తారు. సీనియర్ పార్టీ సభ్యుల ఆదేశాల మేరకు ఓటు వేయమని వారిని నిర్దేశిస్తారు.[3][4] అయితే, భారత రాష్ట్రపతి ఎన్నికల వంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ విప్‌లు పార్లమెంటు సభ్యుడు, లేదా శాసనసభ సభ్యుడు ఎవరికి ఓటు వేయాలో సూచించలేరు.[5] విప్ ఆర్డర్‌ను అదే పార్టీకి చెందిన సభ్యుడు ఉల్లంఘిస్తే, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఆ సభ్యుడిని వెంటనే సభ నుండి తొలగించాలని విప్ సిఫారసు చేయవచ్చు. సంబంధిత హౌస్ స్పీకర్ ఈ అంశంపై (సమయ పరిమితి లేకుండా) నిర్ణయం తీసుకోవచ్చు.

అనర్హత వేటు

గెలిచిన తమ పార్టీ సభ్యులు ప్రత్యర్థి పార్టీలోకి చేరి అవతలి వర్గానికి సహకరించే అవకాశాలున్నాయని భావించినప్పుడు, అవతల పార్టీలోకి చేరకుండా ఉండేందుకు గెలిచిన తమ పార్టీ సభ్యులకు రాజకీయ పార్టీలు "విప్" ను జారీచేస్తాయి. ఈ విప్ ను ధిక్కరించి ఫిరాయించిన ఫిరాయింపుదారులపై ఆ పార్టీ అనర్హత వేటు వేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు

2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్ అమలయ్యేలా ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేసిన వారికి ఎవరైతే బి-ఫారం ఇస్తారో వారు విప్ జారీ చేసే అవకాశం కలిగి ఉంటారని, వీరు జారీ చేసే విప్ ఆధారంగానే ఎంపిటిసి సభ్యులు ఓటేయాలని, లేని పక్షంలో వీరు సభ్యత్వం కోల్పోతారని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Pandiyan, M. Veera (May 14, 2006). How the term 'Whip' came to be used in Parliament. The Star (Malaysia).
  2. "Whips - Legislative Assembly - Liferay DXP". aplegislature.org. Archived from the original on 2024-02-26. Retrieved 2024-02-28.
  3. "Derek O'Brien is TMC's Chief Whip in Rajya Sabha". Outlook India. Aug 2, 2012. Archived from the original on 14 October 2013. Retrieved 3 August 2012.
  4. "leaders and chief whips of recognised parties and groups in parliament (facilities) act, 1998" (PDF). Rajya Sabha Secretariat. Archived (PDF) from the original on 8 July 2014. Retrieved 3 August 2012.
  5. "Issuing whips to MPs, MLAs in Presidential poll is an offence: EC". The Times of India. Jul 10, 2012. Retrieved 3 August 2012.

వెలుపలి లంకెలు