వి. వి. గిరి
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/0/0c/V.v.giri.jpg/130px-V.v.giri.jpg)
వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 24, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య ,సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా, పట్టణం ఇప్పుడు ఒడిషా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళాడు.
1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.[1]
1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయనను రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ Narasingha P. Sil, Giri, Varahagiri Venkata (1894–1980), trade unionist and president of India in Oxford Dictionary of National Biography (2004)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
ఇంతకు ముందు ఉన్నవారు: జాకీర్ హుస్సేన్ |
భారత రాష్ట్రపతి 1969 మే 3 — 1969 జూలై 20 |
తరువాత వచ్చినవారు: ఎం.హిదయతుల్లా |
ఇంతకు ముందు ఉన్నవారు: ఎం.హిదయతుల్లా |
భారత రాష్ట్రపతి 1969 ఆగష్టు 24 — 1974 ఆగష్టు 24 |
తరువాత వచ్చినవారు: ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ |