శామ్యూల్ గోల్డ్‌విన్
శామ్యూల్ గోల్డ్‌విన్ | |
---|---|
జననం | 1982, ఆగస్టు 27 వార్సా, పోలాండ్, రష్యా |
మరణం | 1974 జనవరి 31 | (వయసు 91)
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, గ్లెన్‌డేల్, కాలిఫోర్నియా |
ఇతర పేర్లు | శామ్యూల్ గోల్డ్‌ఫిష్ |
క్రియాశీల సంవత్సరాలు | 1917–1959 |
జీవిత భాగస్వామి | బ్లాంచె లాస్కీ
(m. 1910; div. 1915)ఫ్రాన్సెస్ హోవార్డ్ (m. 1925) |
పిల్లలు | 2 శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్ |
బంధువులు |
|
శామ్యూల్ గోల్డ్‌విన్ (1882, ఆగస్టు 27 – 1974, జనవరి 31)[1] పోలిష్ - అమెరికన్ సినిమా నిర్మాత. హాలీవుడ్‌లోని అనేక సినిమా స్టూడియోల వ్యవస్థాపక సహకారిగా, కార్యనిర్వాహకుడిగా ప్రసిద్ధి చెందాడు.[2] 1973లో గోల్డెన్ గ్లోబ్ సెసిల్ బి. డిమిల్లే అవార్డు, ఇర్వింగ్ జి. థాల్బర్గ్ మెమోరియల్ అవార్డు (1947), జీన్ హెర్షోల్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు (1958) లభించాయి.
జననం
గోల్డ్‌విన్ 1879 జూలైలో జన్మించి ఉండవచ్చు, కాని తన పుట్టినరోజును 1882 ఆగస్టు 27గా పేర్కొన్నాడు.[3] తండ్రిపేరు ఆరోన్ డేవిడ్ గెల్బ్ఫిస్జ్,[4] తల్లిపేరు హన్నా ఫ్రైమెట్.[5]
అవార్డులు
- మానవతా విలువలపై అత్యుత్తమ కృషికి 1957లో జీన్ హెర్షోల్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది.
- 1971 మార్చి 27 గోల్డ్‌విన్‌కి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందించారు.[6]
మరణం
గోల్డ్‌విన్ తన 91 ఏట 1974, జనవరి 31న లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంటిలో గుండె వైఫల్యంతో మరణించాడు. 1980లలో, శామ్యూల్ గోల్డ్‌విన్ స్టూడియో వార్నర్ బ్రదర్స్‌కి విక్రయించబడింది. బెవర్లీ హిల్స్‌లో ఇతని పేరు మీద ఒక థియేటర్ కూడా ఉంది. సినిమారంగానికి చేసిన కృషికి 1631 వైన్ స్ట్రీట్‌లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో 1960, ఫిబ్రవరి 8న స్టార్‌ని అందుకున్నాడు.[7][8]
మూలాలు
- ↑ "Samuel Goldwyn | American filmmaker and producer". Encyclopedia Britannica (in ఇంగ్లీష్).
- ↑ Obituary, Variety, February 6, 1974, pg. 63.
- ↑ Berg, A. Scott (1989). Goldwyn: A Biography (in English). New York: Alfred A. Knopf, Inc. ISBN 0-394-51059-3.
{cite book}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Grave in Warszawa". cemetery.jewish.org.pl.
- ↑ "Hannah Gelbfisz obituary". polona.pl. Retrieved 2023-06-03.
- ↑ Public Papers of the Presidents of the United States, Richard Nixon. 1971. p. 490. ISBN 0160588634. Retrieved 2023-06-03.
- ↑ "Samuel Goldwyn | Hollywood Walk of Fame". www.walkoffame.com. Retrieved 2023-06-03.
- ↑ "Samuel Goldwyn". Los Angeles Times. Retrieved 2023-06-03.