శృంగార రాముడు

శృంగార రాముడు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
నిర్మాణం రామ్మూర్తి
కథ పి.డి.షెనాయ్
చిత్రానువాదం పి.డి.షెనాయ్
తారాగణం ఎన్.టి. రామారావు
లత
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం డి.వి,.రాజారామ్
కూర్పు కె.శంకర్, ఆర్ కృష్ణన్
విడుదల తేదీ 1979 నవంబరు 22
భాష తెలుగు

శృంగార రాముడు 1979 లో విడుదలైన యాక్షన్ డ్రామా సినిమా. దీనిని సత్యతాయ్ ప్రొడక్షన్స్ పతాకంపై [1] రామమూర్తి నిర్మించాడు. కె. శంకర్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో ఎన్‌టి రామారావు, లత ప్రధాన పాత్రల్లో నటించారు.[3] కెవి మహదేవన్ సంగీతం అందించాడు.[4] ఇది హిందీ సినిమా కాశ్మీర్ కి కలీకి రీమేక్.[5]

కథ

ఈ చిత్రం కాశ్మీర్‌లో మొదలవుతుంది. ఇక్కడ రామనారాయణ (ప్రభాకర్ రెడ్డి), లక్ష్మీనారాయణ (త్యాగరాజు), గోవింద నారాయణ (సిహెచ్. కృష్ణ మూర్తి), సత్యనారాయణ (రామ్ మోహన్) అనే నలుగురు స్నేహితులు నారాయణ & కో అనే బ్యాంకును స్థాపించారు. అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటారు., పిల్లలు కూడా సన్నిహితులు. లక్ష్మీనారాయణకు ఒక కుమారుడు రాజారాం, గోవింద నారాయణకు ఒక కుమారుడు జైపాల్, ఒక కుమార్తె రీటా ఉన్నారు. సత్యనారాయణకు శాంతి అనే కుమార్తె ఉంది. సమయం గడిచిపోతుంది. బ్యాంకు భారీగా పేరూ లాభాలూ సంపాదిస్తుంది. ఇక్కడ రామనారాయణ, లక్ష్మీనారాయణ మనసుల్లో చెడు ఉద్దేశం తలెత్తుతుంది. ఇద్దరూ గోవింద నారాయణను చంపి, సత్యనారాయణపై ఆ నింద వేసి డబ్బు కాజేస్తారు. గోవింద నారాయణ, చనిపోయే ముందు తన పిల్లలకు అంతా వివరిస్తాడు. వారు ద్రోహులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో, అవమానాల కారణంగా సత్యనారాయణ తన భార్య సీత (డబ్బింగ్ జానకి) తో కలిసి ఆత్మహత్య చేసుకుంటాడు. తన భర్త దుర్మార్గం గురించి తెలుసుకున్న లక్ష్మీనారాయణ భార్య జయ (పండరి బాయి) అతన్ని వదిలి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతుంది.

కాలం గడిచి, లక్ష్మీనారాయణ కన్నుమూస్తాడు. అతని కుమారుడు రాజారామ్ (ఎన్.టి.రామారావు) లక్షాధికారి అవుతాడు. జైపాల్ (శరత్ బాబు), రీటా (జయమాలిని) ఇంకా ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. దాని ప్రకారం రీటా ముసలివాడైన రామనారాయణను పెళ్ళి చేసుకుంటుంది. వ్యాపార ఒప్పందంపై రాజారామ్‌ను కాశ్మీర్‌కు ఆహ్వానించి వలలో వేయడానికి జైపాల్‌ ప్రయత్నిస్తాడు. రాజారామ్ తన తల్లి ఆశీర్వాదం తీసుకొని కాశ్మీర్కు బయలుదేరాడు. ఆమె కూడా అతన్ని సంతోషంగా పంపుతుంది. అతను నిజం తెలుసుకోవాలి, తన తండ్రి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి అని ఆమె భావిస్తుంది. కాశ్మీర్‌లో రాజారాం ఒక అందమైన అమ్మాయి శాంతి (లత) తో పరిచయమై, ఆమెతో ప్రేమలో పడతాడు. కొంత సమయం తరువాత, ఆమె తన చిన్ననాటి స్నేహితురాలే నని గుర్తిస్తాడు. చివరికి, ఆమె లక్ష్మీనారాయణ, రామనారాయణ చేసిన దారుణాన్ని, అన్యాయాన్నీ వెల్లడిస్తుంది. డబ్బును పోగొట్టుకుని బాధపడుతున్న ప్రజలను కూడా అతను చూస్తాడు. అతను వెంటనే తన తల్లి వద్దకు వెళతాడు. ఆమె అతనికి మొత్తం విషయం నిజమేనని చెబుతుంది. అందరికీ న్యాయం చేయాలని రాజారాం నిర్ణయించుకుంటాడు. అతను తన వేషధారణను మార్చుకుంటాడు. వివిధ రకాల మారువేషాలలో మొత్తం డబ్బును సేకరిస్తాడు. తన ఆస్తిని కూడా కలిపి ప్రజల పెట్టుబడి కంటే 10 రెట్లు ఎక్కువ వెనక్కి ఇస్తాడు. అందరూ అతనిని ప్రశంసిస్తారు. చివరగా, రాజారామ్, శాంతిల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

నటవర్గం

సాంకేతిక వర్గం

  • కళ: ఎ. బాలు
  • నృత్యాలు: సలీం
  • స్టిల్స్: పి.కె.నటరాజన్
  • పోరాటాలు: కె.ఎస్.మాధవన్
  • సంభాషణలు: డి.వి.నరసరాజు
  • సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య్ గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, వాణి జయరామ్
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • కథ, చిత్రానువాదం: పిడి షెనాయ్
  • కూర్పు: కె. శంకర్, ఆర్. కృష్ణన్
  • ఛాయాగ్రహణం: డివి రాజారాం
  • నిర్మాత: రామమూర్తి
  • దర్శకుడు: కె. శంకర్
  • బ్యానరు: సత్యతై ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: 1979 నవంబరు 22

పాటలు

ఆచార్య ఆత్రేయ రాసిన పాటలకు కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు. AVM ఆడియో కంపెనీ సంగీతం విడుదల చేసింది.

సం పాట గాయకులు నిడివి
1 "ఈ రోజు ఈ రోజే" ఎస్పీ బాలు 3:50
2 "మీరు ఎలా ఉన్నారు" ఎస్పీ బాలు 4:06
3 "నందమూరి అందగాడా" ఎస్పీ బాలు, వాణీ జయరాం 4:46
4 "చీటీకి ప్రాణం" వాణీ జయరామ్ 4:09
5 "ఆడేదే ఆడధి" పి. సుశీల 3:56
6 "వస్తానన్నావు" ఎస్పీ బాల, వాణీ జయరాం 5:47

మూలాలు