శ్రవణ నక్షత్రము

శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు

శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

నక్షత్ర వివరములు

నక్షత్రములలో ఇది 22వది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
శ్రవణ చంద్రుడు దేవ స్త్రీ వానరము జిల్లేడు అంత్య మహావిష్ణువు మకరము

శ్రవణా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార రోహిణి, హస్త, శ్రవణం శరీరశ్రమ
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ ధన లాభం
విపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్యహాని
క్షేమతార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర క్షేమం
ప్రత్యక్ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర స్నేహం
సాధన తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్య సిద్ధి, శుభం
నైధన తార అశ్విని, మఖ, మూల బంధనం
మిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం
అతిమిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం, లాభం

చిత్ర మాలిక

ఇతర వనరులు