షేక్ హసీనా

షేక్ హసీనా
শেখ হাসিনা
షేక్ హసీనా


బంగ్లాదేశ్ 10 వ ప్రధానమంత్రి
పదవీ కాలం
2009 జనవరి 6 – 2024 ఆగస్టు 5
రాష్ట్రపతి లాజుద్దీన్ అహ్మద్
జిల్లుర్ రెహమాన్
అబ్దుల్ హమీద్
ముందు ఫక్రుద్దీన్ అహ్మద్ (Acting)
పదవీ కాలం
1996 జూన్ 23 – 2001 జూలై 15
అధ్యక్షుడు అబ్దుర్ రెహమాన్ బిస్వాస్
షహాబుద్దీన్ అహమద్
ముందు మొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting)
తరువాత లతీఫుర్ రెహమాన్ (Acting)

ప్రతిపక్షనేత
పదవీ కాలం
2001 అక్టోబరు 10 – 2006 అక్టోబరు 29
ముందు ఖలేదా జియా
తరువాత ఖలేదా జియా
పదవీ కాలం
1991 మార్చి 20 – 1996 మార్చి 30
ముందు ఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్
తరువాత ఖలేదా జియా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-09-28) 1949 సెప్టెంబరు 28 (వయసు 75)
తుంగిపారా, తూర్పు బెంగాల్, పాకిస్తాన్
(ప్రస్తుత బంగ్లాదేశ్)
రాజకీయ పార్టీ అవామీ లీగ్
ఇతర రాజకీయ పార్టీలు మహాకూటమి (2008–present)
జీవిత భాగస్వామి వాజీద్ మియా (1968–2009)
సంతానం సాజీబ్ వాజీద్
సైమా వాజీద్
పూర్వ విద్యార్థి బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయం
ఢాకా విశ్వవిద్యాలయము

షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা జననం: 1947 సెప్టెంబరు 28) 2009 నుండి 2024 ఆగస్టు వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసింది. గతంలో 1996 నుండి 2001 వరకు ఈమె ఈ పదవిలో ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగత ఎం. ఎ. వాజిద్ మియా, పరమాణు శాస్త్రవేత్త.[1][2]

2024 లో హసీనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషను విధానంపై దేశంలో నిరసనలు, చెలరేగి, అవి హింసాత్మక అల్లర్లుగా మారి అనేకమంది ప్రజలు మరణించారు. చివరికి హసీనా ఆగస్టు 5 న రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశం వెళ్ళిపోయింది.[3] ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధానిగా, ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సూక్ష్మఋణాల సంస్థ స్థాపకుడూ అయిన మహమ్మద్ యూనస్ ప్రధానిగా ఎంపికయ్యాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు