సామ్రాట్ ముఖర్జీ

సామ్రాట్ ముఖర్జీ
జననం (1970-05-29) 29 మే 1970 (age 54)
భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
ఎత్తు6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ.)
బంధువులుశషధర్ ముఖర్జీ (తాత)

సామ్రాట్ ముఖర్జీ (జననం 29 మే 1970) భారతదేశానికి చెందిన హిందీ, బెంగాలీ సినిమా నటుడు.[1][2]

కుటుంబ నేపథ్యం

సామ్రాట్ ముఖర్జీ బాలీవుడ్ ముఖర్జీ-సమర్త్ కుటుంబ వంశంలో భాగం. అతని తండ్రి తరపు తాత, సషాధర్ ముఖర్జీ, ముంబైలోని అంబోలిలో ఫిల్మ్‌మేకర్ & ఫిల్మాలయ స్టూడియోస్ సహ వ్యవస్థాపకుడు. అతని సోదరి షర్బానీ ముఖర్జీ, ఆయనకు బంధువులు నటీమణులు కాజోల్, రాణి ముఖర్జీ, తనీషా & దర్శకుడు అయాన్ ముఖర్జీ.

సినిన్ జీవితం

సామ్రాట్ ముఖర్జీ 1996లో మానెక్ బేడీతో రామ్ ఔర్ శ్యామ్ సినిమాతో అరంగేట్రం చేసి 1997లో సికిందర్ భారతి దర్శకత్వం వహించిన భాయ్ భాయ్ అక్బర్ పాత్రను పోషించాడు. ఆయన 1998లో హిందీ సినిమా జంజీర్ లో ఆదిత్య పంచోలీతో కలిసి కవిత పాత్రలో, 1999లో సికందర్ సడక్ కా సినిమాలో మోనికా బేడీతో, 2005లో విశాల్ భరద్వాజ్ సినిమా 'ది బ్లూ అంబ్రెల్లా'లో బిజ్జు పాత్రను, 2010లో అశుతోష్ గోవారికర్ సినిమా 'ఖేలీన్ హమ్ జీ జాన్ సే'లో దీపికా పదుకొనే , అభిషేక్ బచ్చన్ , సికిందర్ ఖేర్ & విశాఖ సింగ్‌లతో కలిసి నటించాడు.

ఫిల్మోగ్రఫీ

హిందీ

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1996 రామ్ ఔర్ శ్యామ్ రామ్ తొలిచిత్రం
1997 భాయ్ భాయ్ అక్బర్
1998 జంజీర్ సుధాకర్
1999 సికందర్ సడక్ కా బలరాం
1999 సార్ అంఖోన్ పర్
2002 సబ్సే బద్కర్ హమ్ దేవా
2005 ఆంఖోన్ మే సప్నే లియే
2007 ది బ్లూ అంబ్రెల్లా బిజ్జు
2010 ఖేలీన్ హమ్ జీ జాన్ సే గణేష్ ఘోష్
2013 హమ్ హై రాహి కార్ కే జాన్

బెంగాలీ

సంవత్సరం సినిమా/ టీవీ షో పాత్ర ఛానెల్
1999 తోమాకే సోలం
2006 తాపేశ్య
2010 ప్రయోషి
2010 కాకా నం 1
2013 స్వభూమి
2020-2022 గంగారాం సామ్రాట్ (సమీ) కుమార్ నక్షత్రం జల్షా
2024- ప్రస్తుతం ఆకాష్ కుసుమ్ రక్తిమ్ సన్ బంగ్లా

మూలాలు

  1. "Samrat Mukherjee movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 23 August 2019. Retrieved 2019-08-23.
  2. Mazumder, Jayeeta (10 December 2010). "My life has changed: Samrat Mukerji". Hindustan Times. Mumbai. Hindustan Times. Retrieved 25 March 2016.

బయటి లింకులు