సుధా చంద్రన్

సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964)
రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాలలో సుధా చంద్రన్
జననం (1964-09-21) 1964 సెప్టెంబరు 21 (వయసు 60)
India
వృత్తినటి, నృత్యకళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిరవి దంగ్
తల్లిదండ్రులుకేడీ చంద్ర‌న్ [1]

సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964) ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.

జీవిత విశేషాలు

సుధా చంద్రన్ సెప్టెంబర్ 21 1964కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[2] ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. జూన్ 5 1981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు 'జైపూర్ కాలు' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.[3] ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె భారతదేశంతోపాటు ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారు.[4]

కెరీర్

ఆమె 1984 లో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు. 1986 లో ఆమె హిందీలో "నాచే మయూరి"లో నటించారు.

కుటుంబం

ఆమె 1986 లో రవి డాంగ్ ను వివాహమాడారు. ఆమెకు పిల్లలు లేరు.[4]

టెలివిజన్

కార్యక్రమం పాత్ర ఛానెల్
కైసా యహ్ ఇష్క్ హై...అజాబ్ స రిస్క్ హై లోహరి లైఫ్ ఒ.కె
సౌంద్రవల్లి - జయ టి.వి
అంతరాల్ - దూరదర్శన్ నేషనల్
ఆరసి మధురై తిలకవతి సన్ టి.వి.
బహురైయన్ - డి.డి.మెట్రో
చంద్రకాంత (సీరియల్) - డి.డి.నేషనల్
ఛష్మే బాదూర్ (సీరియల్) - జీ.టీ.వి.
హమారీ బహు తులసి తులసి డి.డి.నేషనల్
హం పాంచ్ (సీజన్ 2) ఆనంద్ యొక్క మొదటి భార్య జీ.టీ.వి.
జానె భీ దో పారో - డి.డి.మెట్రో
కె.స్ట్రీట్ పాలి హిల్ గాయత్రి కౌల్ స్టార్ ప్లస్
కహిన్ కిసీ రోజ్ రమోలా సికంద్ స్టార్ ప్లస్
కైసే కహూఁ - జీ.టీ.వి
కలశం చంద్రమతి సన్ టీ.వి
కస్తూరి (సీరియల్) మాసి స్టార్ ప్లస్
కుఛ్ ఇస్ తార మల్లికా నందా సోనీ టీ వి
క్యా దిల్ మె హై రాజేశ్వరి దేవి 9 ఎక్స్‌
క్యుంకి సాస్ భి కభీ బహు థీ ఎ.సి.పి స్టార్ ప్లస్
సాథ్ సాథ్ (సీరియల్) - డి.డి.మెట్రో
సోల్‌హాహ్ సింగార్ రాజేశ్వరి దేవి సహారా వన్
తుంహై దిష దిషా యొక్క తల్లి జీ.టి.వి
కష్మకష్ జిందగీకీ రాజ్ లక్ష్మీ డి.డి.నేషనల్
కథాపరయుం కవ్యాంజలి రాజ్ లక్ష్మీ సూర్యా టి.వి
సౌందరవల్లి అఖిలాండేశ్వరి జయ టి.వి
జయం పద్మ జయ టి.వి
పొండట్తి తెవై రాజలక్ష్మి సన్ టి.వి
సూపర్ డాన్సర్ జూనియర్ 4 ఆమె అమృతా టి.వి
తకప్పు కలై తీరథ అప్పా సన్ టి.వి
తంకా తిమి థా ఆమె జయ టి.వి
తెండ్రాల్ భువన సన్ టి.వి
జిల్మిల్ సితారో కా అంగాన్ హోగా కళ్యాణి దేవీ రాయిచంద్ సహారా ఒన్
అదాలత్ ఇంద్రాణి సోనీ ఎంటర్‌టైన్ మెంటు టెలివిజన్ ఇండియా
దిల్ సె ది దూఆ... సౌభాగ్యవతి భవా? మిసెస్ వ్యాస్ లైఫ్ ఒకె
జల్లోష్ సువర్ణయుగచ జడ్జి ఈ.టి.వి. మరాఠీ
ఏక్ థీ నాయ్కా ఉమా బిశ్వాస్ లైఫ్ ఓ.కె
ఆర్ధ్రం రిటైర్డ్ జడ్జ్ ఆసియా నెట్
దైవం తందా వీడు చిత్రా దేవి స్టార్ విజయ్
నాగిని టి.వి సిరియల్ జెమినీ టి‌‌వి

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2013 అమేరిన్ ఆధీ భగవాన్ ఇంద్ర సుందరమూర్తి తమిళం
2013 క్లియోపాత్రా (2013 ఫిల్మ్) మలయాళం
2011 వెంగై తమన్న తల్లి తమిళం
2009 అలెగ్జాండర్ ది గ్రేట్ మలయాళం
2008 సత్యం (2008 చిత్రం) సత్యం తల్లి తమిళం
2006 షాదీ కర్కే ఫాస్ గయా యార్ డాక్టర్ హిందీ
2006 మలమాల్ వీక్లీ ఠాకురైన్ హిందీ
2000 ట్యూన్ మేరా దిల్ లే లియా రాణి (వీరు స్నేహితురాలు) హిందీ
1999 హమ్ ఆప్కే దిల్ మెయి రెహ్తే హై మంజు హిందీ
1995 మిలన్ జయ
1995 రఘువీర్ (1995 చిత్రం) ఆర్తి వర్మ
1994 అంజమ్ అంజమ్ హిందీ
1994 దాల్డు చోరాయు ధైర్ ధైర్
1994 బాలి ఉమర్ కో సలాం
1993 ఫూలన్ హసీనా రామ్‌కలి
1992 నిష్చాయ్ జూలీ హిందీ
1992 అకా నిష్చే భారతదేశం: హిందీ శీర్షిక: వీడియో బాక్స్ శీర్షిక
1992 ఇంటెహా ప్యార్ కి తానియా పెళ్లిలో డాన్సర్ హిందీ
1992 ఖైద్ మెయి హై బుల్బుల్ జూలీ హిందీ
1992 షోలా ఔర్ షబ్నం (1992 చిత్రం) కరణ్ సోదరి హిందీ
1992 ఇన్సాఫ్ కి దేవి సీతా ఎస్ ప్రకాష్ హిందీ
1991 కుర్బాన్ (1991 చిత్రం) పృథ్వీ సోదరి హిందీ
1991 జాన్ పెచాన్ హేమ
1991 జీన్ కి సాజా షీటల్
1990 థానేదార్ శ్రీమతి జగదీష్ చంద్ర హిందీ
1990 పాటి పర్మేశ్వర్ హిందీ
1988 ఒలావినా ఆసారే కన్నడ
1987 కలాం మారి కథా మారి ఆరిఫా మలయాళం
1986 మలరం కిలియం మలయాళం
1984 మయూరి మయూరి తెలుగు
1986 సర్వం శక్తిమయం శివకామి తమిళం
1986 నాచే మయూరి మయూరి హిందీ
1987 చిన్న పువే మెల్లా పెసు శాంతి తెలుగు
1987 చిన్న తంబి పెరియా తంబి తమిళం


అవార్డులు

  • Special Jury Award : Mayuri - 1986
  • The Great Indian Television Academy Awards Best Actress in a negative role : Tumhari Disha - 2005 And more... On going..

మూలాలు

బయటి లంకెలు