సౌదామిని
సౌదామిని (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కడారు నాగభూషణం |
---|---|
నిర్మాణం | కడారు నాగభూషణం |
కథ | ఆరుద్ర |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ, జి.వరలక్ష్మి, రజిని, కనకం, ఏ.వి.సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, సూరిబాబు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సౌదామిని 1951 ఏప్రిల్ 11 న విడుదలైన తెలుగు చిత్రం.శ్రీరాజేశ్వరి ఫిలిం పతాకంపై కడారు నాగభూషణం, నిర్మాత, దర్శకుడు గా రూపొందించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి, చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ మొదలగు తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. వి. వెంకట్రామన్ సమకూర్చారు.
టెక్నీషియన్లు
అంశాలు | నిర్వహించేవారు. | |
---|---|---|
పాటలు మాటలు | సముద్రాల రాఘవాచార్య | |
సంగీత దర్శకుడు | ఎస్.వి.వెంకట్రామన్ | |
నాట్య దర్శకుడు | అనిల్ కుమార్, వెంపటి సత్యం | |
కళాదర్శకుడు | కె.ఆర్.శర్మ | |
సెట్టింగ్స్ | పి.కె.వేణు | |
మేకప్ | సహదేవరావు | |
ఫొటోగ్రఫీ | పి.ఎల్లప్ప | |
స్టిల్స్ | ఎల్.కె.రావు | |
సౌండ్ రికార్డింగ్ | పి.రంగారావు | |
రికార్డింగ్ యంత్రం | ఆర్.సి.ఎ | |
ఎడిటర్ | ఎన్.కె.గోపాల్ | |
ప్రాసెసింగ్ | వి.రామస్వామి | |
ప్రొడక్షన్ | పి.బుచ్చిబాబు, పి.సి.నంబియార్ | |
సహదర్శకులు | జి.రాధాకృష్ణన్, డబ్ల్యు.ఆర్.శ్రీనివాసన్ | |
స్టుడియో | జెమిని | |
నిర్మాత- దర్శకుడు | కె.బి.నాగభూషణం |
కథ
మాళవ దేశపు రాజు విక్రమసేనుడూ, రాణి సౌదామినీ దేవి సంతానము కొరకు బోధాయన మహర్షిని ఆశ్రయించి ప్రసాదం పొందుతారు. కొంతకాలానికి రాజు విలాసవతి అనే నాట్యకత్తెకు వశుడై రాణినే కాకుండా రాజ్యాంగమును గూడా మరచిపోతాడు. మంత్రి మహామతి విలాసవతిని దేశ నుంచి వెడలగొట్టడం మంచిదని రాణికి సలహా యిస్తాడు. ఈ సంగతి తెలిసిన విలాసవతి, బోథాయన మహర్షి వరప్రసాదము వలన గర్భవతి అయిన రాణికి, మంత్రికి సంబంధము కల్పించి, దానిని రాజుతో చెప్పి, మంత్రికి ఉరిశిక్ష, రాణికి అడవిలో చిత్రవథ విధించేట్టు చేస్తుంది. కాని విథి బలంవలన సౌదామిని గోపాలుడనే సత్పురుషుని అండన ఉదయ సేనుడను బాలుని ప్రసవిస్తుంది. మాళవ నగరంలో విలాసవతీ ఆమె ప్రియుడూ సైన్యాధ్యక్షుడూ అయిన కామపాలుడూ రాజును తమ చేతిలోని కీలుబొమ్మగా చేసుకుని దృష్టి పోవునట్లుగా చేసే అధికారం చలాయిస్తున్నారు. ఈ వార్త తెలిసిన సౌదామిని తండ్రిని రక్షించడానికిగాను కుమారుని నియోగించి ఆశీర్వచనముకొరకు బోధాయన మహర్షి వద్దకు పంపుతుంది. బోధాయనుడున్న కుంతల దేశపు రాజకుమార్తి హేమవతీని వివాహమాడదలచి కామపాలుడు కబురు చేస్తాడు. కాని రాకుమారి స్వప్నములో చూచిన తన ప్రియని వివాహమాడ నిశ్చయించకుంటుంది.
రాజు దృష్టి నయముచేయటానికి బయలుదేరిన ఉదయసేనుడు బోధాయనుని చేరి కర్తవ్యము తెలుసుకుంటాడు. ఇంతలో హేమవతి ఉదయాసేనుని చూచి తన స్వప్నసుందరునిగా గుర్తించింది. వారి చర్యలు కనిపెట్టిన శూరసేనుడు వారిని ఖైదు చేస్తాడు. కానీ వారు తప్పించుకు పోయి అడవి చేరుతారు. ఐతే అక్కడ దైవఘటన వలన వారికి యెడబాటు కలుగుతుంది.
తప్పించుకుపోయిన ఉదయ సేన హేమవతుల కొరకు రాజు ప్రకటన గావించాడు. రాకుమారుని కొరకు వచ్చిన సౌదామిని విషయము తెలిసి మూర్చపోతుంది బంధించబడుతుంది. హేమవతీ కొరకు అక్కడికి వచ్చిన కామపాలుడు సౌదామినిని గుర్తించి ఆమెను చంపవలసినదని సలహా యిస్తాడు. కాని శూరసేనుడు ఉదయనుని రాబట్టడానికి గాను ఆమెను ఖైదు చేస్తాడు. అక్కడ అడవిలో హేమవతి ఒక దుష్టమాంత్రికుని చేతిలో పడుతుంది. హేమవతి నుండి విడిపోయిన ఉదయనుడు ఒక దేవకన్య ప్రభావంవలన తండ్రి దృష్టిని నయం చేయగల దేశమందాక పూలతో సహా ముందుగా హేయవతివద్దకువచ్చి ఆమెను తన తల్లి రక్షణకు పంపి తాను తండ్రి వద్దకు పోతాడు. ఆ ప్రయత్నంలో ఆతడికి ఉరిశిక్ష విధింపబడుతుంది.
పాటల జాబితా
1.ఎంతవరకైనా విధిని దాట తరమా అంత సీత, రచన: ఆరుద్ర, గానం.ఎస్.వి.వెంకట్రామన్
2.ఏలుకొనరా మా చెల్లిని నిన్నే కోరి చేరే, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎం.ఎల్.వసంతకుమారి
3.నాకై వెలసితివా ధవళాoగా నన్నాదరించు కరుణాంతరంగా, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.మాధవపెద్ది సత్యం
4.కుందరదనా వినవే రామకథ రాకేందు వదనా వినవే, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.జిక్కి
5.ఆనందమిదే సౌందర్యమిదే ఏకాంతంలో, గానం.సముద్రాల రాఘవాచార్య,
6 ఓ ఓ ఓ ఓ యాలా ఓలయ్యా వేషమేసి చూపెడతా, రచన:ఆరుద్ర
7.ఓహో హో హా లే జవరాలా రావేలా నా ప్రియురాలా, రచన:సముద్రాల రాఘవాచార్య
8.కో కో అని కవ్వించే కోయిలమ్మ పాట పల్కెను, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎస్.వరలక్ష్మిబృందం
9.చెప్పు చెప్పు తగ్గు తగ్గు టుర్ టురే తెలుపవే, రచన:సముద్రాల రాఘవాచార్య
10.దైవమే పగాయనే కాలమే ఎదురాయనే , రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎస్.వరలక్ష్మి
11.నినుచేరే దారిలేదా నిరాశతో బ్రతుకే అంతమౌనా, రచన: ఆరుద్ర, గానం ఎస్.వరలక్ష్మి
12.పతియే నాదు బానిసాయే నాదే రాజ్యము ఇక, రచన: సముద్రాల రాఘవాచార్య,
13.రామ రామ రామ రామ శ్రీరామ (బుర్రపాట), రచన: ఆరుద్ర, గానం.బృందం
14.వలచి చేరితిరా సుకుమార మారామేలరా , రచన:సముద్రాల రాఘవాచార్య
15.వలపే తెలవారెనా అపరంజి కల మారేనా, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.ఎస్.వరలక్ష్మి
16.వాసియు వంగడము కలవాని వరించు(పద్యం), రచన:సముద్రాల రాఘవాచార్య
17.శ్రీశైల సదనా మమ్మికనైన దయచూడవా దేవా మహాదేవా, రచన: సముద్రాల రాఘవాచార్య.
మూలాలు
1 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.