హనుమాన్‌గఢ్

హనుమాన్‌గఢ్
Hanumangarh fort
హనుమాన్‌గఢ్ నగరంలో ఉన్న భట్నర్ కోట
హనుమాన్‌గఢ్ is located in Rajasthan
హనుమాన్‌గఢ్
హనుమాన్‌గఢ్
హనుమాన్‌గఢ్ is located in India
హనుమాన్‌గఢ్
హనుమాన్‌గఢ్
హనుమాన్‌గఢ్ is located in Asia
హనుమాన్‌గఢ్
హనుమాన్‌గఢ్
Coordinates: 29°35′N 74°19′E / 29.58°N 74.32°E / 29.58; 74.32
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాహనుమాన్‌గఢ్
Founded byరాజా భూపత్
Government
 • Bodyమునిసిపల్ కౌన్సిల్
Elevation
177 మీ (581 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,50,958
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
335512 , 335513
ప్రాంతీయ ఫోన్‌కోడ్01552
Vehicle registrationRJ-31

హనుమాన్‌గఢ్, భారత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఒక నగరం. ఇది ఘగ్గర్ నది ఒడ్డున ఉంది.ఇది పురాతన సరస్వతీ నది అని కూడా గుర్తించారు.హనుమాన్‌గఢ్, ఢిల్లీ నుండి సుమారు 400 కి.మీ.దూరంలో ఉంది. ఇది హనుమాన్‌గఢ్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం.ఈ నగరాన్ని ఒకప్పుడు భట్నర్ (ప్రత్యామ్నాయంగా భట్నైర్ అని పిలుస్తారు) అని పిలిచేవారు. దీనిని సా.శ. 255 లో రాజు భూపత్ స్థాపించాడు.ఇది భాతి వంశం రాజపుత్రుల నియంత్రణలో కొనసాగింది. తరువాత రావు జెట్సా బికనీర్ ను ఆక్రమించాడు.

చరిత్ర

సింధు లోయ నాగరికత

1951లో హనుమాన్‌గఢ్ ప్రాంతంలో కలిబంగన్, పిలిబంగా వద్ద లభించిన అవశేషాలు ప్రకారం ఈ ప్రాంతం దాదాపు 5000 సంవత్సరాల నాటి నాగరికతలో ఒక భాగమని తెలుస్తుంది. మానవ అస్థిపంజరాలు, తెలియని లిపి, స్టాంపులు, నాణేలు, పాత్రలు, నగలు, బొమ్మలు, విగ్రహాలు, బావులు, బాత్‌రూమ్‌లు, కోట, వీధులు, మార్కెట్లు మొదలైనవి కనుగొనబడ్డాయి.ఈ ప్రదేశాలలో లభించిన అవశేషాలను కాళిబంగన్‌లోని మ్యూజియంలో, న్యూ ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియంలో ఉంచారు.

మధ్యయుగం

ఇక్కడ కుషన్ సామ్రాజ్యం శైలిలో అనేక నాణేలతో పాటు అనేక టెర్రకోట అలంకరణ పలకలు లభించినవి. మట్టిదిబ్బలపై నుండి 15 అడుగుల లోతులో రెండు టెర్రకోట రాజధానులు, వాటి అంచుల వెంట మెట్ల పిరమిడ్లు కనుగొనబడ్డాయి.[3]

వలసరాజ్యాల యుగం

హనుమాన్‌గఢ్ భాటి రాజ్‌పుత్‌ల రాజ్యం, అందుకే దీని పూర్వపు పేరు భట్నర్ అని పిలుస్తారు. ఈ కోటను బికనీర్ రాష్ట్రానికి చెందిన మహారాజా సూరత్ సింగ్ రాథోడ్ (జ.1787-మ.1828) మంగళవారం రోజు గెలుచుకున్నారు. హిందూ దేవత హనుమంతుడికి మంగళవారం శుభ దినం కావున, సూరత్ సింగ్ భట్నర్ పేరును "హనుమన్‌గఢ్"గా మార్చాడు.1700 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన హిందూ-దేవత హనుమంతుని కోట (భట్నర్ కోట) హనుమాన్‌గఢ్ పట్టణం మధ్యలో ఉంది. దీని వివరణ ఐన్-ఇ-అక్బరిలో చూడవచ్చు.[4] పురాతన సరస్వతి నది (ఘగ్గర్ నది) ఒడ్డున పట్టణానికి సమీపంలో ఒక భద్రకాళి ఆలయం ఉంది.[3]

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హనుమాన్‌గఢ్ మొత్తం జనాభా 150,958,అందులో 79,709 మంది పురుషులు, 71,249 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న జనాభా 18,094. హనుమన్‌గఢ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 102,149, ఇది జనాభాలో 67.7%గా ఉంది. పురుషుల అక్షరాస్యత 73.6%, స్త్రీల అక్షరాస్యత 61.1%. హనుమన్‌గఢ్‌లోని జనాభా సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 76.9%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 83.8%, స్త్రీల అక్షరాస్యత రేటు 69.28%గా ఉంది షెడ్యూల్డ్ కులాలు, 25,486,షెడ్యూల్డ్ తెగల జనాభా 2,463 మంది ఉన్నారు. 2011లో హనుమన్‌గఢ్‌లో 30022 గృహాలు ఉన్నాయి.[1]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం హనుమాన్‌గఢ్ మొత్తం జనాభా 129,654.అందులో పురుషులు 69,583, స్త్రీలు 60,071మంది ఉన్నారు.లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు గాను 863 స్త్రీలను కలిగి ఉంది. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న జనాభా18,669 మంది ఉన్నారు.పట్టణ మొత్తం జనాభాలో83,923 మంది అక్షరాస్యులు (64.7%) మంది ఉన్నారు.7 సంవత్సరాల పైబడిన వయస్సు గల అక్షరాస్యత గల పిల్లలు మొత్తం జనాభాలో 75.6%.మంది ఉన్నారు.[5]

రైల్వే జంక్షన్

Bhagat singh chowk.
హనుమన్‌గఢ్ జంక్షన్ వద్ద భగత్ సింగ్ చౌక్ దృశ్యం.

హనుమన్‌గఢ్ జంక్షన్ రైల్వే స్టేషన్ జోధ్పూర్-బతిండా మార్గంలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఇంతకుముందు సాధుల్పూర్, రేవారి, జైపూర్, శ్రీగంగానగర్, అనుప్ ఘర్, (కెనలూప్) మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ లైన్లుగా ఉండేవి.ఈ రెండూ ఈ స్టేషన్ గుండా వెళ్లేవి.ఇప్పుడు అవి అన్ని లైన్లు బ్రాడ్ గేజ్ గా మార్చబడ్డాయి. డైమండ్ రైల్వే క్రాసింగ్ కూడా ఉంది. 1982 లో, బ్రాడ్ గేజ్ భటిండా నుండి సూరత్ ఘర్ వరకు హనుమన్‌గఢ్ ద్వారా ప్రారంభమైంది. 2012 అక్టోబరు 1 న, హనుమన్‌గఢ్-సాదుల్‌పూర్ మీటర్‌గేజ్ లైను -3 మూసివేయబడింది. దీనిని బ్రాడ్ గేజ్‌గా మార్చారు. హనుమన్‌గఢ్ నుండి శ్రీ గంగానగర్ ప్యాసింజర్ రైళ్లు బ్రాడ్ గేజ్ ట్రాక్‌లో నడుస్తున్నాయి. ఈ ట్రాక్ జైసల్మేర్ (రాజస్థాన్), ఉధంపూర్ (జె & కె) వద్ద హనుమన్‌గఢ్, శ్రీగంగానగర్, ఫిరోజ్‌పు ద్వారా రెండు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కంటోన్మెంట్ల మధ్య  ప్రయాణికుల రద్దీని తగ్గించింది.[6]

భాష

హిందీ అధికారిక భాష, ఇంగ్లీష్ అదనపు అధికారిక భాష. హనుమన్‌గఢ్‌లో బాగ్రి భాష ప్రధాన భాష.[7]

ఆసక్తి ఉన్న ప్రదేశాలు

  • భట్నర్ కోట
  • గురుద్వారా బాబా సుఖా సింగ్ మైహ్తాబ్ సింగ్ జి
  • షీలా పీర్ మందిర్ (షీలా మాతా)
  • అమర్పురా తేరి సమీపంలో ఘఘర్ నది బేసిన్ వద్ద భద్రకాళి ఆలయం, 8 హెచ్.ఎం.హెచ్.

మూలాలు

  1. 1.0 1.1 "Census of India: Hanumangarh". www.censusindia.gov.in. Retrieved 9 January 2020.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 20 June 2019.
  3. 3.0 3.1 "Archived copy". Archived from the original on 25 February 2014. Retrieved 8 January 2020.{cite web}: CS1 maint: archived copy as title (link)
  4. "Bhatner Fort". Archived from the original on 1 July 2012.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  6. "Hanumangarh to Shri Ganganagar: 9 Trains, Shortest Distance: 66 km - Railway Enquiry". indiarailinfo.com.
  7. Lakhan Gusain 2000. Bagri Grammar. Munich: Lincom Europa (Languages of the World/Materials, 384)

వెలుపలి లంకెలు