హఫీజుల్ హసన్

హఫీజుల్ హసన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 ఫిబ్రవరి 2021
గవర్నరు ద్రౌపది ముర్ము
రమేష్ బైస్
సీ.పీ. రాధాకృష్ణన్
ముందు హాజీ హుస్సేన్ అన్సారీ

జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 మే 2021
ముందు హాజీ హుస్సేన్ అన్సారీ
నియోజకవర్గం మధుపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
తల్లిదండ్రులు హాజీ హుస్సేన్ అన్సారీ
నివాసం మధుపూర్ & రాంచీ
పూర్వ విద్యార్థి బిర్సా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సింద్రీ

హఫీజుల్ హసన్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధుపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, హేమంత్ సొరేన్ మంత్రివర్గంలో పర్యాటక, మైనారిటీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

హఫీజుల్ హసన్ జార్ఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత హాజీ హుస్సేన్ అన్సారీ కుమారుడు. ఆయన మరణాంతరం ఆయన రాజకీయాలలోకి వచ్చి 5 ఫిబ్రవరి 2021న హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో పర్యాటక, మైనారిటీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. ఆయన 2021లో మధుపూర్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏజేఎస్‌యూ పార్టీ అభ్యర్థి గంగా నారాయణ్ సింగ్ పై 5,247 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత చంపై సోరెన్ మంత్రివర్గంలో కూడా పర్యాటక, మైనారిటీ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[3]

మూలాలు

  1. The Avenue Mail (5 February 2021). "Hemant Soren expands cabinet, inducts Hafizul Hassan". Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  2. India Today (3 May 2021). "JMM wins bypoll in Jharkhand" (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2023. Retrieved 15 April 2023.
  3. Financialexpress (18 February 2024). "Jharkhand Ministers List 2024: Full list of ministers and portfolios in Champai Soren-led Cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2024. Retrieved 10 July 2024.