హాలీ బెర్రీ

హాలీ బెర్రీ
2017లో శాన్ డియాగో కామిక్-కాన్‌లో బెర్రీ
జననం
మరియా హాలీ బెర్రీ

(1966-08-14) 1966 ఆగస్టు 14 (వయసు 58)
క్లెవ్‌లాండ్, ఓహియో, అమెరికా
విద్యాసంస్థకయెహోగా కమ్యూనిటీ కాలేజ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • డేవిడ్ జస్టిస్
    (m. 1993; విడాకులు 1997)
  • ఎరిక్ బెనేట్
    (m. 2001; విడాకులు 2005)
  • ఓలివియర్ మార్టినెజ్
    (m. 2013; విడాకులు 2016)
భాగస్వామిగాబ్రియెల్ ఆబ్రీ
(2005–2010)
పిల్లలు2

హాలీ మరియా బెర్రీ (1966 ఆగస్టు 14న మరియా హాలీ బెర్రీగా జననం)[1] అమెరికన్ నటి. మాన్‌స్టర్స్‌ బాల్ (2001)లో ఆమె నటనకు గాను ఉత్తమ నటి విభాగంలో అకాడమీ పురస్కారం అందుకుంది. అకాడమీ పురస్కారం అందుకున్న ఏకైక ఆఫ్రికన్ అమెరికన్ సంతతి మహిళగా నిలిచింది.[2][3]

అకాడమీ అవార్డుతో పాటుగా 2000 దశకంలో ఎక్స్-మ్యాన్‌(2000)లో స్టార్మ్ పాత్ర, స్వార్డ్‌ఫిష్ (2001), గోతికా (2003) లాంటి థ్రిల్లర్లలో పాత్రలు, గూఢచారి తరహా సినిమా డై అనదర్ డే (2002)లో బాండ్ గర్ల్ జింక్స్ పాత్ర వంటి మంచి అవకాశాలు పొందింది. ఎక్స్-మ్యాన్ సీక్వెళ్ళు అయిన ఎక్స్-2 (2003), ఎక్స్-మెన్: ద లాస్ట్ స్టాండ్ (2006) సినిమాల్లో కనిపించింది. 2010 దశకంలో సైన్స్ ఫిక్షన్ సినిమా క్లౌడ్ అట్లాస్ (2012), క్రైమ్ థ్రిల్లర్ ద కాల్ (2013), ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ (2014), యాక్షన్ సినిమాలు కింగ్స్‌మేన్: ద గోల్డెన్ సర్కిల్ (2017), జాన్ విక్: చాప్టర్ 3 - పారాబెలమ్ (2019) వంటి సినిమాల్లో చేసింది.

2000 దశకంలో హాలీవుడ్‌లో బెర్రీ అత్యధిక పారితోషకం అందుకున్న నటీమణుల్లో ఒకామె. అంతేకాక తాను నటించిన పలు సినిమాల నిర్మాణంలో భాగమైంది. రెవలాన్ కంపెనీకి స్పోక్స్ మోడల్‌గా పనిచేసింది.[4] మొదట డేవిడ్ జస్టిస్ అన్న బేస్‌బాల్ ఆటగాణ్ణి,[5] తర్వాత గాయకుడు-గేయ రచయిత ఎరిక్ బెనేట్‌ని,[6] ఆపైన నటుడు ఓలివియర్ మార్టినెజ్‌ని పెళ్ళిచేసుకుంది.[7] ఆమె బాయ్‌ఫ్రెండ్ మోడల్ గాబ్రియెల్ ఆబ్రేతో ఒక అమ్మాయిని,[8] మూడవ భర్త మార్టినెజ్‌తో ఒక కొడుకుని కన్నది.[9]

2019 వరకు ఒక అకాడమీ అవార్డు (మాన్‌స్టర్స్ బాల్), ఎమ్మీ అవార్డు- ప్రైమ్‌టైమ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు (ఇంట్రొడ్యూసింగ్ డొరోతీ డాన్‌డ్రిడ్జ్), రెండు సిల్వర్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారాలు (ఇంట్రొడ్యూసింగ్ డొరోతీ డాన్‌డ్రిడ్జ్, మాన్‌స్టర్స్ బాల్) అందుకుంది. ఈ పురస్కారాలన్నీ 2001లో చేసిన మాన్‌స్టర్స్ బాల్ సినిమాలోనూ, 1999లో చేసిన ఇంట్రొడ్యూసింగ్ డొరోతీ డాన్‌డ్రిడ్జ్ టెలివిజన్ ఫిల్మ్‌లోనూ నటనకీ లభించాయి.

మూలాలు

  1. Although Britannica Kids gives a 1968 birthdate, ( from the original on August 17, 2012), she stated in interviews prior to August 2006 that she would turn 40 then. See: FemaleFirst, DarkHorizons, FilmMonthly, and see also Profile Archived 2010-07-03 at the Wayback Machine, cbsnews.com; accessed May 5, 2007.
  2. Yang Jie. "Halle Berry, "Black Pearl" to win Oscar's Best Actress". CCTV.com. Retrieved February 4, 2015.
  3. Paula Bernstein (February 25, 2014). "The Diversity Gap in the Academy Awards in Infographic Form". IndieWire.com. Retrieved February 20, 2015.
  4. Bayot, Jennifer (December 1, 2002). "Private Sector; A Shaker, Not a Stirrer, at Revlon". New York Times. Retrieved December 23, 2007.
  5. "Divorce between Halle Berry, David Justice final", The Albany Herald, June 25, 1997; accessed October 29, 2015.
  6. "Halle's big year" (November 2002), Ebony.
  7. "The Carousel of Hope Ball". Marie Claire. October 25, 2010. Archived from the original on October 15, 2013. Retrieved April 18, 2013.{cite magazine}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Halle Berry Has a Baby Girl". People. March 16, 2008. Retrieved February 28, 2019.
  9. Duke, Alan. "Halle Berry gives birth to a son". CNN.