హిజాజ్

మ్యాపులో సౌదీ ప్రాంతం ఎర్రని రేఖతో చూపబడింది. 1923 లోన్ హిజాజ్ రాజ్యం పచ్చని రంగులో

అల్-హిజాజ్ (హిజాజ్ Hijaz, Hedjaz; అరబ్బీالحجاز) అల్-హిజాజ్ సాహితీపరంగా అర్థం 'జలసంధి'. హిజాజ్ ప్రాంతం సౌదీ అరేబియా లోని పశ్చిమ ప్రాంతమంతా వ్యాపించియున్నది. ఈ ప్రాంతం ఎర్రసముద్రము తీరమంతా వ్యాపించియున్నది. ఇది అఖబా అఖాతములోని హఖ్ల్ నుండి 'జీజాన్" వరకూ వ్యాపించియున్నది. దీని ప్రధాన నగరం జెద్దా. కానీ హిజాజ్ ప్రాంతం ఇస్లామీయ పవిత్రనగరాలైన మక్కా మదీనా నగరాల ద్వారా ప్రసిధ్ధియైనది. అరబ్బీ భాషలో హిజాజ్ అనగా "జలసంధి", ఇది తూర్పున నజ్ద్, పశ్చిమాన తిహామా భూభాగాలను వేరుచేస్తూంది.

చరిత్ర

వివిధ ఆధారాల ప్రకారం హిజాజ్ రోమన్ సామ్రాజ్యపు "అరేబియా-పెట్రియా" లోని భూభాగం.[1]. ఉస్మానియా సామ్రాజ్యం, ఈజిప్టు ల ప్రాంతీయకేంద్రంగా వుండేది. 20వ శతాబ్దంలో స్వల్పకాల స్వతంత్ర రాజ్యంగా, స్వతంత్ర రాజకీయ శక్తితో వుండినది. మొదటి ప్రపంచయుద్ధకాలంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన టి.ఇ.లారెన్స్ (ఆఫ్ అరేబియా) ప్రేరణతో ఉస్మానియా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదళాలు ఏకమయ్యాయి. 1916లో షరీఫ్ హుసేన్ ఇబ్న్ అలీ ఆధ్వర్యంలో స్వతంత్రరాజ్యంగా ప్రకటింపబడింది. 1924లో (నజ్ద్ కు చెందిన) ఇబ్న్ సాద్ ఇబ్న్ అలీని పదవీభ్రష్టుడినిచేసి హిజాజ్, నజ్ద్ రాజ్యాలుగా ప్రకటించాడు. తరువాత ఇవ సౌదీ అరేబియాగా అవతరించింది.

నజ్ద్ లో వహాబీ ఉద్యమం ఉద్భవించినా, ప్రస్తుతం హిజాజ్ వాసులు ఇస్లాంగురించి నవీన దృక్పదాలు కలిగి ఉన్నారు.[2]

భౌగోళికం

భౌగోళికంగా రిఫ్ట్ లోయ ప్రాంతానికి సమాంతరంగా వ్యాపించియున్న భూభాగం. ఈ భూభాగం "గాఢ రంగుగల అగ్నిపర్వత ఇసుక" ప్రాంతానికి ప్రసిధ్ధి. హిజాజ్ లోని సరవత్ పర్వతాలు 'నజ్ద్', 'తహామా' లను వేరుచేస్తున్నాయి.

చరిత్ర

అనేక సామ్రాజ్యాల కాలంలో వాటి ప్రాంతంగా ఉంది.

నగరాలు

సౌదీ అరేబియా అంతరంగిక మ్యాపు

ఇవీ చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • హిజాజీ అమామా
  • హిజాజ్ రాజ్యం
  • హిజాజ్ అరబ్బీ సంగీతంలోని ఒక 'శృతి' పేరు.

మూలాలు

  1. Kesting, Piney (May 2001). "Well of Good Fortune". Saudi Aramco. Archived from the original on 2014-10-23. Retrieved 2007-03-20.
  2. James Minahan (2002), Encyclopedia of the Stateless Nations: Ethnic and National Groups Around the World (Westport, Conn.: Greenwood Press).