హెన్రీ లాంగ్లోయిస్

హెన్రీ లాంగ్లోయిస్
హెన్రీ లాంగ్లోయిస్
జననం(1914-11-13)1914 నవంబరు 13
ఈజ్మిర్, ఒట్టోమాన్ సామ్రాజ్యం
మరణం1977 జనవరి 13(1977-01-13) (వయసు 62)
వృత్తిసహ-వ్యవస్థాపకుడు, సినిమాటిక్ ఫ్రాంఛైజ్ డైరెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఫిల్మ్ పరిరక్షణ, ఫిల్మ్ ఆర్కైవింగ్, సినిమా చరిత్ర. సినీ ప్రేమికుడు.
భాగస్వామిమేరీ మీర్సన్

హెన్రీ లాంగ్లోయిస్ (1914 నవంబరు 13 – 1977 జనవరి 13) ఫ్రెంచి సినిమా యాక్టివిస్ట్, సినిమా ప్రేమికుడు. సినిమాల పరిరక్షణలో ఆయన  మార్గదర్శి, లాంగ్లోయిస్ సినిమా చరిత్రలో ప్రభావశీలమైన వ్యక్తి. సినిమా చరిత్రలో ప్రముఖమైన ఆటర్ సిద్ధాంతాన్ని వెనుకవున్న ఆలోచనలు అభివృద్ధి చేయడానికి ఆయన పారిస్ సినీ ప్రదర్శనలు ఉపకరించాయిని పేరొందారు.[1][2][3]

సినిమాథెక్ ఫ్రాన్సైజ్ ఏర్పాటులో జార్జెస్ ఫ్రాంజు, జేన్ మిట్రైలతో సహ వ్యవస్థాపకునిగా వ్యవహరించారు. 1938లో అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) కు సహ వ్యవస్థాపకుడు. నిమాథెక్ ప్రధాన కార్యకర్త అయిన లోట్టె ఐస్నెర్ తో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నా రెండో ప్రపంచ యుద్ధానంతరం హెన్రీ సినిమాల పరిరక్షణ, సినిమా చరిత్రలపై కృషి సాగించారు. బూజుపట్టి పోయి, పాడైపోతున్న సినిమా ఫిల్మ్ లను కాపాడారు. ఆయన విచిత్రమైన ప్రవర్తన కలవారే కాక తన పద్ధతుల వల్ల తరచు  వివాదాలకు కేంద్రంగాకేంద్రంగా నిలిచారు, [4] ఫ్రెంచ్ నవతరంగం (న్యూవేవ్) గా సినిమా చరిత్రను ప్రభావితం చేసిన యువ సినీ ప్రేమికులు, విమర్శకులకు ఆయన కీలకమైన ప్రభావంగా నిలిచారు. లాంగ్లోయిస్ "సినిమా కళ పట్ల ఆయన అంకితభావం, ఆ కళ గతానికి చేసిన గట్టి కృషి, దాని భవిష్యత్తు పట్ల దృఢమైన నమ్మకం" కారణంగా 1974లో  ఆస్కార్ అకాడమీ గౌరవ పురస్కారాన్ని అందించారు.[5]

మూలాలు