హోప్
హోప్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సతీష్ కాసెట్టి |
---|---|
నిర్మాణం | పోలిచెర్ల వెంటక సుబ్బయ్య |
కథ | సతీష్ కాసెట్టి |
తారాగణం | డి.రామానాయుడు, కళ్యాణి, పోలిచెర్ల హరనాధ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్ |
నిడివి | 106 నిముషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | 5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
హోప్ 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్ పతాకంపై పోలిచెర్ల వెంటక సుబ్బయ్య నిర్మాణ సారథ్యంలో సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డి.రామానాయుడు, కళ్యాణి, పోలిచెర్ల హరనాధ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] సతీష్ తొలిసారిగా దర్శరత్వం వహంచిన ఈ చిత్రం 2008లో జరిగిన భారతదేశం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3] 2006భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఈ చిత్రం ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[4] విద్యావ్యవస్థలోని ఒత్తిడి కారణంగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
- డి.రామానాయుడు
- కళ్యాణి
- పోలిచెర్ల హరనాధ్
- వేణు
- వైజాగ్ ప్రసాద్
- రఘునాథ రెడ్డి
- సుదర్శన్
- రాధాదేవి
- ప్రభావతి
- ఉమాశర్మ
- కుందన్
సాంకేతికవర్గం
- కథ, దర్శకత్వం: సతీష్ కాసెట్టి
- నిర్మాణం: పోలిచెర్ల వెంటక సుబ్బయ్య
- సంగీతం: ఇళయరాజా
- నిర్మాణ సంస్థ: పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్
పురస్కారాలు
- 2006: ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2007: సిఐఎస్ఏ ఉత్తమ చిత్రం జ్యూరీ అవార్డు
మూలాలు
- ↑ "Hope (2006)". Indiancine.ma. Retrieved 2020-08-25.
- ↑ "Hope Telugu movie images, stills, gallery". Indiaglitz.com. Retrieved 2020-08-25.
- ↑ "Archived copy". Archived from the original on 13 May 2012. Retrieved 25 August 2020.
{cite web}
: CS1 maint: archived copy as title (link) - ↑ "54th National Film Awards (PIB)" (PDF). Press Information Bureau (PIB), India. Retrieved 25 August 2020.