1898
1898 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1895 1896 1897 - 1898 - 1899 1900 1901 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
ఏప్రిల్ 18: చాపేకర్ సోదరులలో ఒకరైన దామోదర్ చాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
జననాలు
- ఫిబ్రవరి 14: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
- ఏప్రిల్ 10: దశిక సూర్యప్రకాశరావు,స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.
- జూన్ 22: చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, కర్ణాటక సంగీత విద్యాంసులు, వాగ్గేయకారులు. (మ.1975)
- జూలై 3: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (మ.1976)
- జూలై 4: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)
- సెప్టెంబరు 9: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972)
- సెప్టెంబరు 21: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, సంగీత విశారదులు. (మ.1968)
- సెప్టెంబరు 27: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
- నవంబర్ 15: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992)
- డిసెంబర్ 4: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)
- డిసెంబర్ 6: గున్నార్ మిర్థాల్, ఆర్థికవేత్త.
- : సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (మ.1967)