అంబాలా జిల్లా

అంబాలా జిల్లా
అంబాలా
హర్యానా పటంలో అంబాలా జిల్లా స్థానం
హర్యానా పటంలో అంబాలా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనుఅంబాలా డివిజను
ముఖ్య పట్టణంఅంబాలా
మండలాలు1. అంబాలా, 2. బరారా, 3. నారాయణ్‌గఢ్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,574 కి.మీ2 (608 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం11,28,350
 • జనసాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
 • Urban
5,00,774
జనాభా వివరాలు
 • అక్షరాస్యత81.75%
 • లింగ నిష్పత్తి885
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో అంబాలా ఒకటి. అంబాలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా తూర్పు సరిహద్దులో యమునా నగర్, ఉత్తర సరిహద్దులో సిర్మౌర్, పంచకులా జిల్లాలు, పశ్చిమ సరిహద్దులో మొహాలీ, పటియాలా జిల్లాలు, దక్షిణ సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా ఉన్నాయి.

పేరు వెనుక చరిత్ర

అంబాలా జిల్లా హర్యానా రాష్ట్రంలో చారిత్రకప్రసిద్ధి పొందిన జిల్లాగా గుర్తుంచబడుతుంది. జిల్లా గురించిన పురాతనకాల ప్రస్తావన తైత్తరీయ ఆర్యంకాలో ఉంది. అందులో కురుక్షేత్రా సరిహద్దులో తురంగనా ఉందని ఉంది. పనిని (పురాతన భారతీయ సాహిత్యం) సాహిత్యంలో ఈ ప్రాంతప్రస్తావన ఉందని ష్రుగ్నా సుఘ్ కనుగొన్నాడు. 14వ శతాబ్దంలో అంబారాజపుత్రులు అంబాలా నగరాన్ని స్థాపించారని భావిస్తున్నారు. అంబావాలా అనే పేరు కాలక్రమంలో అంబాలాగా మారిందని కొందరు భావిస్తున్నారు. కొందరు మామిడి (ఆం) తోటలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతానికి ఈ పేరువచ్చిందని భావిస్తున్నారు. మరికొందరు భావానీ అంబా పేరు ఈ నగరానికి వచ్చిందని భావిస్తున్నారు. అంబా ఆలయం ఇప్పటికీ అంబాలా నగరంలో ఉంది.[1]

చరిత్ర

ఆరంభకాలంలో ఈ ప్రాంతంలో రాతి పనిముట్లను ఉపయోగించిన ఆరంభకాల పాతరాతియుగానికి చెందిన ఆదిమవాసులు నివసించారని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంలో హరప్పన్ ప్రజల సంబంధిత ఆధారాలు లభించాయి. ప్రత్యేకంగా పెయింటిగ్ చేయబడిన గ్రే వేర్ పాటరీ ఇక్కడ ఆర్యులు నివసించారని తెలియజేస్తున్నాయి. అంబాలా ప్రాంతం పాండవులు వారి వారసులు పాలనలో ఉండేది. అశోకుని కాలానికి చెందిన తొపరా శాసనాలు, స్థూపాలు (సింఘ్ వద్ద) కూడా ఈ ప్రాంతంలో లభించాయి. జిల్లాలోని చనేటి మౌర్యులకాలం నాటి ఆధారాలు లభించాయి. సుంగా టెర్రకోటా పరికరాలు లభించాయి. మెనందర్ నాణ్యాలు కూడా ఈ ప్రాంతంలో లభించాయి.

చారిత్రక ఆధారాలు

జిల్లాలోని అంబాలా నరియంఘర్ మద్య పరాథియన్ గొండోఫెర్నెస్, మహాక్షత్రపా రజువాలా నాణ్యాలు లభించాయి. కొన్ని ప్రాంతాలలో కుషాన్ కాలం నాటి ఇటుకలు లభించాయి. అందువలన ఈ ప్రాంతాన్ని కొంతకాలం కుషానులు పాలించారని భావిస్తున్నారు. రమేష్ చంద్ర మజుందార్ పరిశోధనలు అనుసరించి లాహోర్, కర్నా గుప్తసామ్రాజ్యంలో భాగంగా ఉండేది. జిల్లాలో పలుప్రాంతాలలో మెహ్రౌలి పిల్లర్ వ్రాతలు, వెండి నాణ్యాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని అత్యధికమైన భారతీయ చక్రవర్తులు పాలించారని భావిస్తున్నారు. హర్షుని పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సందర్శించాడు. ఈ ప్రాంతంలో బుద్ధిజం కూడా ప్రభావితం చూపిందని భావిస్తున్నారు. కన్నౌజ్‌కు చెందిన యశోవర్మన్, లాలాదిత్యా పాలితభూమిలో ఈ ప్రాంతం భాగంగా ఉందని భావిస్తున్నారు. ముహమ్మద్ ఘజ్నవి దండయాత్ర తరువాత చరుహాలు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. తొపారా స్తంభం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. చివరిగా 1192లో టెర్రియన్ యుద్ధం తరువాత పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించి ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. 9-12 శతాబ్ధాలలో ఈ ప్రాంతం మతపరమైన యాత్రాకేంద్రంగా ఉండేది. జిల్లాలో కనిపిస్తున్న పలు దేవతామూర్తుల విగ్రహాలు ముస్లిం దాడుల కాలంలో విధ్వంసం చేయబడిన అవశేషాలని భావిస్తున్నారు.

మధ్య యుగం

మధ్య యుగం జిల్లా ప్రాంతం కుతుబుద్దీన్ అయిబక్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం తైమూర్ దాడికి సాక్ష్యంగా నిలిచింది. 1450లో పంజాబ్ గవర్నర్ బహ్లాల్ లోడి ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. 1526లో బాబర్ ఈ ప్రాంతం మీద దండయాత్రచేసాడు. అక్బర్ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుభాహ్‌లో అంబాలా మహల్‌గా ఉంది. గురుగోవింద్ సింగ్ శిష్యుడు (1709-10) ఈ ఫ్రాంతం మీద దాడి చేసాడు. 1710 లో మొఘల్ పాలకులు ఈ దాడిని తిప్పికొట్టాడు. బందా, ఖిద్మత్ తరువాత ఈ ప్రాంతాన్ని 1739 నుండి మొఘల్ అధికారులు పాలించారు. విషాదకరమైన నాదిర్షా దండయాత్ర తరువాత మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1757 లో అంబాలా మీద అబ్దాలి ఆధిక్యత సాధించాడు. 1763లో సిక్కులు అబ్దాలీని వధించి అంబాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతం పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.

ఆధునిక యుగం

బ్రిటిష్ ప్రభుత్వం ఆగమనం తరువాత ఈ ప్రాంతం మీద సిక్కుల ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. బ్రిటిష్ వారు యమునా ప్రాంతంలోని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటూ అంబాలా ప్రాంతాన్ని కూడా తమ అధికారపరిధిలోకి చేర్చుకున్నారు. బ్రిటిష్ ఈ ప్రాంతంలోని రాజ్యాలను స్వాధీనం చేసుకుని అంబాలాను తమ రాజకీయ కేంద్రంగా చేసుకున్నారు. 1845లో సిక్కు రాజప్రతినిధులు బహిరంగంగా బ్రిటిష్ అధికారాన్ని ఎదిరించారు.

సిపాయీల తిరుగుబాటు

1857 సిపాయీల తిరుగుబాటులో అంబాలా జిల్లా ప్రత్యేకపాత్ర వహించింది. తిరుగుబాటు సమయంలో అంబాలా ఆయుధభండాగారంగా మారింది.

జాతీయ చైతన్యం

అంబాలా జిల్లా ప్రజలు జాతీయచైతన్యంతో రీ- ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో స్థాపించారు. 1885 భారతీయ జాతీయ కాంగ్రెస్‌ను బాంబేలో స్థాపించిన వారిలో లాలా మురళి ధార్ (అంబాలా 1820-1924) ఒకరు. తరువాత 29వ శతాబ్దం ఆరంభం నాటికి భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆంబాలా జిల్లా ప్రాంతం అంతటా వ్యాపించింది.

యుద్ధకాలం

అంబాలా ప్రజలు ప్రభుత్వయుద్ధాలకు సహకరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేర్చుకొనబడిన గ్రామాలలో నివసిస్తున్న రైతులు తరువాత ఉద్యోగం లేకుండా వీధిలో తిరిగసాగారు. అందువలన వారిలో మానసికమైన అసంతృప్తి అధికం అయింది. 1919లో మహాత్మా గాంధీ ఆరంభించిన ఇండియా అజిటేషన్‌లో అసంతృప్తి చెందిన సైనికులు భాగస్వామ్యం వహించారు. యుద్ధానంతర పరిస్థితి అంబాలాలో రాజకీయ చైతన్యం అధికంగా తీసుకువచ్చింది, ప్రజలు రోలత్ బిల్లును వ్యతిరేకించండం వాటిలో ఒకటి. క్రమంగా ప్రజలు ప్రభుత్వ విధానాలను, చట్టాలను వ్యతిరేకించడం అధికం అయింది. జలియంవాలాబాగ్ విషాదం తరువాత మాహాత్మాగాంధీని ఖైదు చేసిన తరువాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొన్నది. అల్లర్లలో అంబాలా లోని సిక్కు పయనీర్ మిలటరీ రెజిమెంట్ 1/34 (అంబాలా కంటోన్మెంట్) తీవ్రంగా ధ్వంసం చేయబడింది. చౌరి- చౌరా సంఘటన తరువాత ఉద్యమం నిలిపివేయబడింది.

సహాయ నిరాకరణోద్యమం

1930లో మాహాత్మాగాంధి నాయకత్వంలో సహాయనిరాకరణోద్యమం జాతీయ స్థాయిలో ప్రారంభించబడింది. అంబాలా కూడా దీనిలో క్రియాశీలకంగా పాల్గొన్నది. 1930 ఏప్రిల్ 6 న అంబాలా ప్రధాన వీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించబడింది. నాయకులు ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసారు. ఈ సమయంలోనే నౌజవాన్ భారత్ సభ (లెఫ్ట్ వింగ్ ఉద్యమం) స్థాపించబడింది. దీనికి అంబాలా గ్రామప్రజల, శ్రామికుల మద్దతు లభించింది. స్వదేశీ ఉద్యమం ఈ సమయంలో వేగవంతం అయింది. అంబాలా వ్యాపారులు విదేశీవస్త్రాల విక్రయించం అని ప్రమాణం చేసారు. బార్ అసోసియేషన్ ఖదర్ వస్త్రాలను ధరించాలని నిర్ణయించారు. 1920 ఏప్రిల్ 26న స్త్రీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంబాలా అంజిమండిలో స్త్రీ కార్యకర్తలు ఉప్పు తయారీ ఉద్యమం చేపట్టారు.

క్విట్ ఇండియా ఉద్యమం

1942 నాటికి పరిస్థితిలో మార్పులు సంభవించాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభించబడింది. కాంగ్రెస్ చట్టవిరుద్ధమైనదని ఒరకటించబడింది. అంబాలా ప్రజలు అధైర్యపడక బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ తీవ్రమైన పోరాటం చేసారు. తీవ్రవాదులు కూడా పోరాటంలో పాల్గొన్నారు. పలుమార్లు లాఠీచార్జి జరిగింది 298 మంది ఖైదుచేయబడ్డారు. 1944 ఉద్యమం నాయకుల ఖైదుకు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కారణం అయింది. సుభాష్ చంద్రభోస్ నాయకత్వంలో అంబాలా ప్రజలు నేషనల్ ఆర్మీలో చేరి యుద్ధం చేసారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగానే దేశవిభజన కారణంగా అంబాలా జిల్లా ప్రజలు వలస సమస్యలు ఎదుర్కొన్నారు.

విభాగాలు

జిల్లా రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది. అంబాలా ఉపవిభాగంలో (అంబాలా, బరన) రెండు తాలూకాలు ఉన్నాయి. నరైన్‌ఘర్ ఉపవిభాగంలో ఒకేఒక తాలూకా ఉంది. జిల్లాలో 4 విధానసభ నియోజకవర్గాలు (నరైన్‌గర్, అంబాలా నగరం, అంబాలా కంటోన్మెంటు, మౌలానా) ఉన్నాయి. ఇవి అన్నీ అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,128,350,[2]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 410వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 720 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.23%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 885:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 81.75%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో పంజాబీ హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇవి అధికార భాషలుగా ప్రభుత్వకార్యాలయాలలో వాడుకలో ఉన్నాయి. పంజాబీ భాష అధికమైన ప్రజలకు వాడుకలో ఉంది. [5] గ్రామీణ ప్రాంతాలలో పౌధి (పొవాధి) భాష వాడుకలో ఉంది. ఇది పంజాబ్ తూర్పు ప్రాంతాలలో వాడుకలో ఉన్న భాష.

విద్య

అంబాలా నగరంలో ప్రాథమిక, హైయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. అవి నగర, సమీప గ్రామప్రజలకు విద్యాసౌకర్యం అందిస్తున్నాయి. ఎస్.ఏ. జైన్ సీనియర్ సెకండరీ స్కూల్, తుల్సీ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్, ఎస్.ఏ జైన్ సీనియర్ మోడెల్ స్కూల్, పి.కె.ఆర్. జైన్ గరల్స్ సీనియర్ సెకండరీ స్కూల్, డిఎ.వి పబ్లిక్ స్కూల్ మొదలైన గుర్తించతగిన స్కూల్స్ ఉన్నాయి. అంబాలా కంటోన్మెంటులో ఫరూఖా ఖల్సా ఎస్.ఆర్. స్కూల్ డి.ఎ.వి. ఎస్.ఆర్ సెకండరీ స్కూల్, రివర్ సైడ్ డి.ఎ.వి. ఎస్.ఆర్. సెకండరీ స్కూల్ ఉన్నాయి.

ఆర్ధికం

ఇండో గంగా మైదానంలో ఉన్నందున భూమి అధిక సారవంతమై, వ్యవసాయ యోగ్యంగా ఉంది. జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సైంటిఫిక్, సర్జికల్ ఉపకరణాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. జిల్లా సౌంటిఫిక్ ఉపకరణాల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉంది. .[6] జిల్లాలో తయారుచేయబడుతున్న మైక్రోస్కోప్స్, ఇతర ఉపకరణాలు దేశంలోని పలు పరిశోధనశాలలలో ఉపయోగించబడుతున్నాయి. జిల్లాలో సబ్మెర్సిబుల్ పైపులు, మిక్సర్లు, గ్రైండర్లు పరిశ్రమ అభివృద్ధి చెందింది. అంబాలా వస్త్రాల తాయారీకి కూడా కేంద్రంగా ఉంది.

పెళ్ళి కుమార్తె ధరించే దుస్తులు, రగ్గులు (దుర్రీలు), సైనిక దుస్తులు తయారు చేయబడుతున్నాయి.

నగరాలు, పట్టణాలు, గ్రామాలు

  • అంబాలా కంటోన్మెంట్ (నగరం)
  • అంబాలా సిటీ (నగరం)
  • థంబర్ (గ్రామం)
  • నరైన్‌గర్హ్ (పట్టణం)
  • ముల్లానా (పట్టణం)
  • బరారా (పట్టణం)
  • నాంహెరా (గ్రామం)
  • కురలి (గ్రామం)
  • సాహా (పట్టణం)
  • జంసుయి (గ్రామం)
  • సమ్లెహ్రి (గ్రామం)
  • బబ్యాల్ (గ్రామం)
  • సాహా (గ్రామం)
  • దొసర్క (గ్రామం)

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-27. Retrieved 2014-08-25.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2013. Retrieved 2013-09-24.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  5. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 18. Archived from the original (PDF) on 13 మే 2012. Retrieved 7 October 2013.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-01-29. Retrieved 2014-08-25.

వెలుపలి లింకులు