కున్వర్ సింగ్

కున్వర్ సింగ్
కున్వర్ సింగ్ సుమారు 1858[1]
Maharaja of Jagdispur
PredecessorShabzada Singh
SuccessorBabu Amar Singh
జననం1777
జగ్దీస్‌పూర్, బీహార్
మరణంఏప్రిల్ 26, 1858(1858-04-26) (aged 80–81)
జగ్దీస్‌పూర్, బీహార్
తండ్రిరాజా షాబ్జాడ సింగ్
తల్లిరాణి పంచ్రాతన్ కున్వారీ దేవి సింగ్

కున్వర్ సింగ్ (1777 - ఏప్రిల్ 26, 1858) 1857 తిరుగుబాటు ఉద్యమ నాయకుడు. బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా జగ్దీశ్పూర్ లోని రాజ కుటుంబానికి చెందినవాడు. 80 సంవత్సరాల వయసులో బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఈయన బీహార్ రాష్ట్రంలో బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమ పోరాటానికి ప్రధాన నిర్వాహకుడు అవడంతో ఈయన్ను వీర్ కున్వర్ సింగ్ అని పిలుస్తారు.

జననం

కున్వర్ సింగ్ 1777లో రాజా షాబ్జాడ సింగ్, రాణి పంచ్రాతన్ కున్వారీ దేవి సింగ్ దంపతులకు బీహార్ రాష్ట్రంలోని జగ్దీస్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఇతను ఉజ్జయిని రాజపుత్ర వంశానికి చెందినవాడు.[2][3][4]

వివాహం

మేవాడ్ రాజు యొక్క మహారాణా ప్రతాప్ వారసుడు బీహార్ లోని గయా జిల్లాకు చెందిన ధనవంతుడైన జమిందార్ రాజా ఫతే నారాయణ్ సింగ్ కుమార్తెతో కున్వర్ సింగ్ వివాహం జరిగింది.

ఉద్యమంలో

1857 నాటి భారతీయ తిరుగుబాటులో భాగంగా బీహార్ జరిగిన ఉద్యమానికి సింగ్ నాయకత్వం వహించాడు. ఆ సమయంలో అతని వయసు 80 సంవత్సరాలు. అంతుచిక్కని వ్యూహాలతో బ్రిటీష్ దళాలను దాదాపు ఒక సంవత్సరంపాటు ఎదుర్కొన్నాడు.[5]

పడవలో గంగా నదిని దాటుతున్న సమయంలో షూట్ చేయటంవల్ల సింగ్ ఎడమ మణికట్టుకు బుల్లెట్ తగిలి, చేయిపనిచేయలేదు. వెంటనే తన కత్తితో ఎడమచేయిని మోచేతి దగ్గర కత్తిరించి, గంగలో వేశాడు. 1857 డిసెంబరులో తన పూర్వీకుల గ్రామం వదిలి లక్నోకు చేరుకున్న సింగ్ 1858, మార్చిలో అజమ్గఢ్ ను ఆక్రమించాడు. ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి, తన ఇంటికి వెళ్ళాడు. ఏప్రిల్ 23న జగదీశ్పూర్ సమీపంలో జరిగిన యుద్ధంలో విజయం సాధించాడు.

ఇత్తడపై వాటర్ కలర్ లో కున్వర్ సింగ్ వర్ణచిత్రం సుమారు 1857.[6]
కున్వర్ సింగ్, అతని సహాయకులు

గుర్తింపులు

  1. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ 1966, ఏప్రిల్ 23న స్మారక తపాలాబిళ్ళ విడుదలచేయబడింది.[7]
  2. బీహార్ ప్రభుత్వం అర్రాలో 1992లో వీర్ కున్వర్ సింగ్ విశ్వవిద్యాలయంను స్థాపించింది.[8]

మరణం

1858, ఏప్రిల్ 23న జగదీశ్పూర్ సమీపంలో జరిగిన తన చివరి యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోవున్న దళాలపై తిరుగుబాటుచేసి, బ్రిటీష్ సైన్యాన్ని ఎదురించి, జగదీష్పూర్ కోటలో జెండాను ఎగురవేశాడు. అదేరోజు రాజభవనానికి వచ్చిన కున్వర్ సింగ్ 1858, ఏప్రిల్ 26న మరణించాడు.[5]

మూలాలు