గెలీలియో గెలీలి
గెలీలియో గెలీలి | |
---|---|
జననం | [1] పిసా, టుస్కానీ - ఇటలీ[1] | 1564 ఫిబ్రవరి 15
మరణం | 1642 జనవరి 8[1] అర్సెట్రీ, టుస్కానీ - ఇటలీ[1] | (వయసు 77)
నివాసం | Grand Duchy of Tuscany |
రంగములు | ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము |
వృత్తిసంస్థలు | పాడువా యూనివర్శిటీ |
చదువుకున్న సంస్థలు | పిసా యూనివర్శిటీ |
ప్రసిద్ధి | Kinematics టెలీస్కోపు సౌరమండలము |
గెలీలియో గెలీల ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.
గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.
అరిస్టాటిల్ తో విభేదం
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.
గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం మనం వాడుతున్న లోలక గడియారానికి కూడా మూలసూత్రం యిదే.
పాడువా విశ్వవిద్యాలయం
ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.
పాడువా లోనే గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలోనే వాయు థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు, వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.
టెలిస్కోప్
గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.
విశ్వ రహస్యాలు
ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధ్రువీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. సా.శ. 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు. Jai hind
మతాధికారుల ఆగ్రహం
అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో సా.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సా.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.
మరణం
గెలీలియో 1642 జనవరి 8 న 77 సంవత్సరాల వయస్సులో జ్వరం, గుండె దడతో మరణించాడు. మరణించే వరకు అతను సందర్శకులను కలుస్తూనే ఉన్నాడు.[2][3] టుస్కానీ గ్రాండ్ డ్యూక్, ఫెర్డినాండో II, అతని తండ్రి మరియు ఇతర పూర్వీకుల సమాధుల పక్కన, శాంటా క్రోస్ యొక్క బాసిలికా యొక్క ప్రధాన భాగంలో అతనిని పాతిపెట్టాలనీ అతని గౌరవార్థం ఒక పాలరాతి సమాధిని నిర్మించాలనీ అనుకున్నాడు.[4][5]
అయితే, పోప్ అర్బన్ VIII, అతని మేనల్లుడు కార్డినల్ ఫ్రాన్సిస్కో బార్బెరిని దీనిపై నిరసన వ్యక్తం చేయడంతో ఈ ప్రణాళికలను విరమించుకున్నారు.[4][5][6] బాసిలికాలో దక్షిణ ట్రాన్‌సెప్ట్ నుండి సాక్రిస్టీ వరకు ఉన్న కారిడార్ చివరలో ఉన్న ప్రార్థనా మందిరం పక్కన ఉన్న ఒక చిన్న గదిలో అతన్ని ఖననం చేశారు. అతని గౌరవార్థం అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1737 లో బాసిలికా ప్రధాన భాగంలో అతని దేహాన్ని తిరిగి పూడ్చారు;[4][7] ఈ తరలింపు సమయంలో, అతని అవశేషాల నుండి మూడు వేళ్లను, ఒక దంతాన్నీ తొలగించారు.[8] ఈ వేళ్లలో మధ్య వేలును ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో గెలీలియోలో ప్రదర్శనలో ఉంది.[9]
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 J J O'Connor and E F Robertson. "Galileo Galilei". The MacTutor History of Mathematics archive. University of St Andrews, స్కాట్లాండ్. Retrieved 2007-07-24.
- ↑ Carney, J. E. (2000). Renaissance and Reformation, 1500–1620.[page needed]
- ↑ Gerard, J. (1913). . In Herbermann, Charles (ed.). Catholic Encyclopedia. New York: Robert Appleton Company.
- ↑ 4.0 4.1 4.2 Shea & Artigas 2003, p. 199.
- ↑ 5.0 5.1 Sobel 2000, p. 378.
- ↑ Sharratt 1994, p. 207.
- ↑ Sobel 2000, p. 380.
- ↑ Section of Room VII Galilean iconography and relics, Museo Galileo. Accessed on line 27 May 2011.
- ↑ Middle finger of Galileo's right hand, Museo Galileo. Accessed on line 27 May 2011.
బయటి లింకులు
- Portraits of Galileo
- Original documents on the trial of Galileo Galilei in the Vatican Secret Archives
- Galileo Affair catholic.net
- The Galileo Project at Rice University
- CCD Images through a Galilean Telescope Modern recreation of what Galileo might have seen;.
- Electronic representation of Galilei's notes on motion (MS. 72)
- PBS Nova Online: Galileo's Battle for the Heavens
- Stanford Encyclopedia of Philosophy entry on Galileo
- The Galilean Library, educational site.
- Galileo and the Catholic Church article at Catholic League
- LIFE top 100 events of the millennium: Galileo Galilei (nr 5 in this list)
- Works by Galileo Galilei: text with concordances and frequencies.
- Galilei, Galileo. Le Operazioni del Compasso Geometrico et Militare 1610 Rome. From Rare Book Room. Scanned first edition.
- Galilei, Galileo. Istoria e Dimostrazioni Intorno Alle Macchie Solar 1613 Rome. From Rare Book Room. Scanned first edition.