గువహాటి

గువహాటి
గౌహతి
ప్రాగ్జ్యోతిషపురం
మెట్రో
నగర దృశ్యం
గువహాటి నగర దృశ్యం
Nickname(s): 
ఈశాన్య భారత ముఖద్వారం,[1] ఆలయాల నగరం, ప్రాగ్జ్యోతిషపురం[2]
Guwahati Metropolis Map
Guwahati Metropolis Map
Coordinates: 26°10′20″N 91°44′45″E / 26.17222°N 91.74583°E / 26.17222; 91.74583
దేశం India
రాష్ట్రంఅస్సాం
ప్రాంతందిగువ అస్సాం
జిల్లాకామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా
Government
 • Typeమేయరు
 • Bodyగువహాటి మునిసిపల్ కార్పొరేషను
 • మేయరుమృగేన్ సరానియా (భాజపా)
 • డిప్యూటీ కమిషనరుబిశ్వజిత్ పేగు, IAS[3]
 • పోలీసు కమిషనరుDeepak Kumar, IPS[4]
విస్తీర్ణం
 • మెట్రో328 కి.మీ2 (128 చ. మై)
Elevation
50−680 మీ (164−2,231 అ.)
జనాభా
 (2020 [6])[7]
 • మెట్రో23,81,056
 • Rank48th
 • జనసాంద్రత7,300/కి.మీ2 (19,000/చ. మై.)
 • Metro
22.9 లక్షలు
Demonymగువహాటియన్
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
781 0XX
టెలిఫోన్ కోడ్+91 - (0) 361 - XX XX XXX
ISO 3166 codeIN-AS
Vehicle registrationAS-01 (Kamrup Metro) / AS-25 (Kamrup Rural and Dispur)
మానవాభివృద్ధి సూచికIncrease 0.725 high[8]
లింగ నిషత్తి940 / 1000
నగర జంతువునదీ డాల్ఫిన్[9]
శీతోష్ణస్థితిCwa
అవపాతం2,054 మిల్లీమీటర్లు (80.9 అం.)
అధికార భాషఅస్సామీ, ఇంగ్లీషు
అక్షరాస్యతIncrease 91.47% high[10]

గువహాటి లేదా గౌహతి, అస్సాం రాష్ట్రం లోని ప్రధానమైన పట్టణం. గతంలో దీన్ని గౌహతి అనేవారు. ఈ పట్టణాన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. ఈ పట్టణం బ్రహ్మపుత్రా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర గువహాటి ప్రధాన నగరంలో భాగమౌతోంది. అస్సాం రాష్ట్ర రాజధాని ఐన దిస్పూర్ గువహాటి లోనే సర్క్యూట్ సిటీగా అభివృద్ధి చేసిన భాగంలో ఉంది.

చరిత్ర

చారిత్రికంగా గువహాటికి ప్రాగ్జ్యోతిషపురం అనే పేరు ఉండేది. బ్రహ్మపుత్రా నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర గువహాటికి దుర్జయ అనే పేరు ఉండేది. ప్రాగ్జ్యోతిషపురం, దుర్జయ - ఈ రెండూ ప్రాచీన కామరూప దేశానికి రాజధానులుగా ఉండేవి. గువహాటి అనే పేరు అస్సామీ భాషా పదమైన గువా నుండి వచ్చింది. గువా అంటే పోక చెట్టు అని అర్థం. హాటి అంటే వరుస అని అర్థం. పోకచెట్ల వరుస మీదుగా ఈ నగరానికి గువహాటి అనే పేరు వచ్చింది.

శీతోష్ణషితి

తేమతో కూడిన ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి గువహాటి లక్షణం.[11] జూలై ఆగస్టు నెలల్లో విపరీతమైన చెమటలు నగర ప్రత్యేకత. సగటు వార్షిక ఉష్ణోగ్రత 22.2 °C. త్యధికంగా 39.5°C, (2014 ఏప్రిల్ 24), అత్యల్పంగా 2.0°C (1964 జనవరి) ఉంటుంది.

జనాభా వివరాలు

328 చ.కి.మీ. విస్తీర్ణమున్న గువహాటి మెట్రో ప్రాంతంలో 2020 నాటికి జనాభా 23.8 లక్షలుంది. భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నగరాల్లో గువహాటి ఒకటి.[12] 2025 నటికి గువహాటి మెట్రోలో 28 లక్షల ప్రజలు నివసిస్తారని అంచనా.[13] నగర జనాభాలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 933 స్త్రీలుగా ఉంది. అక్షరాస్యత 91.47%. పురుషుల అక్షరాస్యత 94.24% కాగా స్త్రీల అక్షరాస్యత 88.5%గా ఉంది. నగర జనాభాలో పిల్లల శాతం 9.4.పిల్లల్లో లింగ నిష్పత్తి 940/1000 గా ఉంది.[14]

విద్య

గువహాటి ఈశాన్య భారతానికి విద్యాకేంద్రం.[15] ఇక్కడున్న విద్యాసంస్థలకు తలమానికమైనది ఐఐటి గువహాటి. కాటన్ యూనివర్సిటీ (గతంలో కాటన్ కాలేజీ) వందేళ్ళ పైబడిన సంస్థ. నగరంలో ఉన్న ఇతర ప్రధాన విద్యా సంస్థలు: గౌహతి యూనివర్సిటీ, అస్సాం సైన్స్ అండ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, గౌహతి కామర్స్ కాలేజీ, ఐఐఐటి, దిస్పూర్ కాలేజీ, బి బారువా కాలేజీ, ఎన్ ఇ ఎఫ్ లా కాలేజీ, నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడిషియల్ అకాడమీ, లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలైనవి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డాన్ బాస్కో, సంస్కృతి ది గురుకుల్, కేంద్రీయ విద్యాలయ మాలిగావ్ వంటి పాఠశాలలు ఉన్నాయి.

ఆర్థికం

గువహాటి క్లబ్ ప్రాంతం - ఆర్థిక వ్యవస్థకు కేంద్రం

పెట్రోలియం ఉత్పత్తుల తయారీ గువహాటిలోని ప్రధాన ఆర్థిక కార్యకలాపాల్లో ఒకటి. గువహాటి రిఫైనరీను ఇండియన్ ఆయుల్ కార్పొరేషన్ 1962 లో స్థాపించింది. దీని ప్రస్తుత సామర్థ్యం, సంవత్సరానికి 10 లక్షల టన్నులు. నగరంలో ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంటు కూడా ఉంది.[16][17]

టీ తయారీ, టీ వేలం గూవహాటి లోని మరో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం. అస్సాం భారతదేశం లోని అతి పెద్ద టీ పెంపక కేంద్రం. భారత టీ ఎగుమతుల్లో 80%, భారతదేశ మొత్తం టీ ఉత్పత్తిలో 55% అస్సాం లోనే జరుగుతుంది. ఇది రాష్ట్రం లోని అతి పెద్ద పరిశ్రమ. గువహాటిలో ఉన్న సిటిసి టీ వేలం కేంద్రం ప్రపంచంలోనే పెద్దది. మొత్తం వేలం పరిమాణంలో రెండవ స్థానంలో ఉంది.

రవాణా

విమానాలు

నగర కేంద్రం నుండి 20 కి.మీ. దూరంలో గోపీనాథ్ బోర్దొలోయి విమానాశ్రయం ఉంది. జాతీయ అంతర్జాతీయ విమాన సేవలు దీనిద్వారా జరుగుతాయి.

రైలు రవాణా

నగరం ఈశాన్య సరిహద్దు రైల్వే కిందికి వస్తుంది. దీని ప్రధాన కార్యాలయం నగరంలోనే ఉంది. నగరంలోని పల్టన్ బజారులో గువహాటి రైల్వే స్టేషను ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్ళు నడుస్తాయి. నగరంలో మరో రెండు రైల్వే స్టేషన్లున్నాయి. కామాఖ్య జంక్షన్, న్యూ గువహాటి జంక్షన్. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగఢ్ నుండి కన్యాకుమారి) నగరం గుండా పోతుంది.[18]

రోడ్డు రవాణా

బ్రహ్మపుత్రపై ఉన్న సరాయిఘాట్ వంతెన

నగరంలో 218 కి.మీ. రోడ్లున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, తదితర రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 27 నగరం గుండా పోతుంది. ఈ రహదారి గువహాటిని ఇతర ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర లతో కలుపుతుంది. జాతీయ రహదారి 17 కూడా నగరం గుండా పోతుంది. జాతీయ రహదారి 15 గువహాటిని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లతో కలుపుతుంది.[19]

నగరంలో బస్సుల ద్వారా జరిగే ప్రజారవాణా వ్యవస్థ ఉంది. అస్సాం పట్టణ రవాణా సంస్థ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా నగరంలో తిరుతూంటాయి. నగరం నుండి ఇతర నగరాలకు అనేక ప్రైవేటు ప్రభుత్వ బస్సు సర్వీసులు నడుస్తాయి. ఇతర ప్రాంతాలు, నగరాలకు నడిచే బస్సు సర్వీసులు అడబారి, పల్టన్ బజార్ల నుండి బయలుదేరుతాయి.[18][20]

నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును తలపెట్టారు.[21][22]

జలరవాణా

గువహాటి లోని పండూ రేవు వద్ద అంతర్దేశీయ జలరవాణా శాఖ ముఖ్య స్థావరం ఉంది. బ్రహ్మపుత్ర నది ద్వారా వస్తువుల రవాణ జరుగుతోంది. బ్రహ్మపుత్ర నది ఉన్న వివిధ రేవుల నుండి పండూ రేవుకు మనుషుల రవాణా ఉంది.[18]

మూలాలు

  1. "An insider's guide to Guwahati: more than just a gateway to India's northeast". The Guardian. Archived from the original on 4 October 2015. Retrieved 5 October 2015.
  2. "Kamrup Metro District". Kamrup(M) District Administration. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 జూన్ 2020.
  3. "Chief Minister of Assam - Deputy Commissioners". Archived from the original on 10 May 2018. Retrieved 10 May 2018.
  4. "Police Commissionerate Guwahati". Guwahati City Police. Archived from the original on 6 September 2015. Retrieved 15 September 2015.
  5. "Magisterial powers for Guwahati top cop". The Telegraph. Archived from the original on 30 September 2015. Retrieved 15 September 2015.
  6. "Population of Guwahati 2020 (Demographic, Facts, Etc) – India Population 2020". Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.
  7. "Guwahati City Census". censusindia.gov.in. Archived from the original on 23 September 2015. Retrieved 15 September 2015.
  8. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 22 March 2017. Retrieved 26 January 2018.{cite web}: CS1 maint: archived copy as title (link)
  9. "Gangetic river dolphin to be city animal of Guwahati". The Times of India. 6 June 2017. Archived from the original on 24 September 2017. Retrieved 14 June 2017.
  10. "Guwahati City Census 2011 data". Census2011.co.in. Archived from the original on 2015-09-23. Retrieved 2014-09-22.
  11. Peel, M. C.; Finlayson, B. L.; McMahon, T. A. (2007). "Updated world map of the Köppen–Geiger climate classification" (PDF). Hydrol. Earth Syst. Sci. 11 (5): 1633–1644. doi:10.5194/hess-11-1633-2007. ISSN 1027-5606. Archived (PDF) from the original on 3 February 2012. Retrieved 16 September 2016.{cite journal}: CS1 maint: unflagged free DOI (link)
  12. "Capital of Assam". Assam Online Portal. Archived from the original on 7 August 2015. Retrieved 31 August 2015.
  13. "Masterplan for Guwahati" (PDF). GMDA. Archived from the original (PDF) on 30 June 2016. Retrieved 15 September 2016.
  14. "Guwahati city population census 2011". census 2011. Archived from the original on 23 September 2015. Retrieved 24 October 2015.
  15. "Education". assam.gov.in. Archived from the original on 29 July 2017. Retrieved 28 July 2017.
  16. "Guwahati Refinery". guwahationline.in. 6 November 2015. Archived from the original on 8 December 2015. Retrieved 6 November 2015.
  17. "Indian Oil". www.iocl.com. Archived from the original on 2019-09-21. Retrieved 2019-09-21.
  18. 18.0 18.1 18.2 "Public Transport in Guwahati". guwahationline.in. 17 October 2015. Archived from the original on 17 October 2015. Retrieved 17 October 2015.
  19. "How To Reach Guwahati". guwahatitimes.com. 9 November 2015. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 13 జూన్ 2020.
  20. "Guwahati to have AC city buses". Assam Times. 17 October 2015. Archived from the original on 8 December 2015. Retrieved 17 October 2015.
  21. "Guwahati to get metro rail and feeder Bus Rapid Transit System - The Economic Times". Economictimes.indiatimes.com. 11 January 2013. Archived from the original on 10 May 2013. Retrieved 12 February 2013.
  22. Johnson, Marc (22 January 2013). "Assam Government discusses Guwahati metro proposal - Rail News from". rail.co. Archived from the original on 19 February 2013. Retrieved 12 February 2013.

వెలుపలి లింకులు