సిబ్‌సాగర్
Sivasagar | |
---|---|
City | |
Coordinates: 26°59′N 94°38′E / 26.98°N 94.63°E | |
Country | India |
State | Assam |
District | Sivasagar |
Government | |
• Body | Sivasagar Municipal Board |
Elevation | 95 మీ (312 అ.) |
జనాభా (2011) | |
• Total | 50,781 |
Demonym | Sivsagarian |
Languages | |
• Official | Assamese |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 785640 |
Telephone code | 91-3772 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | AS 04 |
Nearest major city | Jorhat, Dibrugarh |
సిబ్‌సాగర్, అసోం రాష్ట్రం, సిబ్‌సాగర్ జిల్లా లోని పట్టణం.అదే జిల్లాకు ఇది ప్రధాన కార్యాలయం. సిబ్‌సాగర్ పట్టణం, గౌహతికి ఈశాన్యంలో దాదాపు 360 కిలోమీటర్ల (224మై) దూరంలో ఉంది. ఇది అహోం ప్యాలెస్‌లు, స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. శివసాగర్ ప్రాంతం నేడు తేయాకు, చమురు పరిశ్రమలకు ముఖ్యమైన కేంద్రం.[1] శివసాగర్ జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం.[2] ప్రస్తుత శాసనసభ్యుడుగా అఖిల్ గొగోయ్, సిబ్‌సాగర్ విధానసభ నియోజకవర్గం నుండి కొనసాగుచున్నాడు
శివసాగర్, దీనిని గతంలో రంగపూర్ అని పిలువబడేది.1699 నుండి 1788 వరకు అహోం రాజ్యానికి రాజధానిగా ఉంది. అహోమ్‌లు అస్సాంను ఆరు శతాబ్దాల పాటు పాలించారు. సా.శ.1819లో వారి రాజ్యం బర్మీస్ కొన్‌బాంగ్ రాజవంశం ఆధీనంలోకి వెళ్లింది. వారి పాలక వర్గం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.[3]
గౌరీనాథ్ సింఘా (సా.శ.1780 - సా.శ.1795) కాలంలో శివసాగర్ సరస్సు సమీపంలో మోమోరియా తిరుగుబాటుదారులపై యుద్ధం జరిగింది. ఈ రాజ్యం సా.శ. 1825లో బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది.సా.శ.1826లో పూర్తిగా విలీనమైంది. పరిపాలనా ప్రయోజనాల కోసం, ఇది మూడు ఉపవిభాగాలుగా విభజించబడింది.[4]
అసలు పేరు
శివసాగర్ అసలు పేరు, ప్రస్తుతం శివసాగర్ సరస్సు ఉన్న ప్రదేశంలో మొదట ఉనికిలో ఉన్న గ్రామంలో నివసించిన 'కలన్సు గోహైన్' పేరు మీదుగా 'కలన్సుపర్' అని చెప్పబడింది.[5] సా.శ. 1733 సంవత్సరంలో, అహోం రాణి అంబికా దేవి అహోం రాజధాని రంగ్‌పూర్‌లో 257 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువును తవ్వింది.ఈ చెరువు ఒడ్డున నిర్మించిన గొప్ప శివాలయం (శివా డోల్)తో అనుబంధం ఉన్నందున ఈ ప్రదేశం శివ్‌పూర్ (సివ్‌పూర్) అని పిలువబడింది. ఆ తర్వాత కాలక్రమేణా శిబ్‌సాగర్ అనే పేరు దీనికి ఏర్పడింది.[6]
భౌగోళికం
శివసాగర్ పట్టణం 27°09′N 95°15′E / 27.15°N 95.25°E. వద్ద సముద్రమట్టానికి 86.6 మీటర్లు ఎత్తున ఉంది.[7]
జనాభా శాస్త్రం
2011 భారత జనాభా అధికారక జనాభా లెక్కలు ప్రకారం శివసాగర్ పట్టణంలో మొత్తం 50,781మంది జనాభా ఉన్నారు. అందులో పురుషులు 26,925 మంది కాగా, స్త్రీలు వరుసగా 23,856 మంది ఉన్నారు. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, శివసాగర్ పట్టణంలో 53,854 మంది జనాభా ఉన్నారు.2001 భారత జనాభా లెక్కల ప్రకారం,శివసాగర్ జిల్లా జనాభా, అస్సాం రాష్ట్ర జనాభాలో 0.17%గా ఉంది.
2001 జనాభాతో పోలిస్తే జనాభాలో 5.7% మార్పు వచ్చింది. భారతదేశ మునుపటి జనాభా 2001లో, శివసాగర్ 1991తో పోలిస్తే దాని జనాభాలో 44.2 % పెరుగుదలను నమోదు చేసింది.శివసాగర్ సగటు అక్షరాస్యత 2001లో 74.47%తో పోలిస్తే 2011లో 80.41%గా ఉంది. లింగాల వారీగా విషయాలను పరిశీలిస్తే, పురుషుల 85.84% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 74.71% ఉంది.
జనాభా చరిత్ర
సంత్సరం | 1951 | 1991 | 2001 | 2011 |
---|---|---|---|---|
జనాభా | 10,622 | 37,326 [8] | 53,854 [8] | 50,781 [8] |
జిల్లా న్యాయస్థానం
1984లో శివసాగర్ ప్రత్యేక సివిల్ జిల్లాగా ప్రకటించబడిన తర్వాత, 1985లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటైంది, గతంలో సమ్మిళితమయ్యే శివసాగర్ జిల్లా న్యాయమూర్తి దివంగత సి.హెచ్. పూర్ణ, జోర్హాట్‌లోని అప్పటి శివసాగర్ ప్రధానకేంద్ర జిల్లా జడ్జి సైకియా, జోర్హాట్ నుండి జిల్లా న్యాయవ్యవస్థను ప్రారంభించేందుకు అన్ని కార్యక్రమాలను చేపట్టారు. శివసాగర్‌లో దీనిని మొదటి జిల్లా సెషన్స్ జడ్జి జి.ఎస్. బసుమతారి, అప్పటి ప్రధాన న్యాయమూర్తి కె. లహరీ 1985 ఏప్రిల్ 16న సి.జె.ఎం. న్యాయస్థానం ప్రారంభించారు.1983లో శివసాగర్‌లో న్యాయస్థానం పనిచేయటం ప్రారంభించింది.శివసాగర్ పట్టణంలో సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి న్యాయస్థానాలు 1987లో ప్రారంభించబడ్డాయి. జిల్లా సెషన్స్ జడ్జి (ఎఫ్.టి.సి) 2001 సంవత్సరం నుండి పనిచేస్తుంది. 2021 ఫిబ్రవరి 27న, శివసాగర్ జిల్లా నుండి చారైడియో న్యాయస్థానాలు వేరు చేయబడ్డాయి. శివసాగర్ జిల్లాలో ప్రస్తుతం పన్నెండు జ్యుడీషియల్ కోర్టులు ఉన్నాయి.
రవాణా
వాయు మార్గం
జోర్హాట్ విమానాశ్రయం శివసాగర్ నుండి 75 కిమీ దూరంలో జోర్హాట్ వద్ద ఉంది. నగరం నుండి 95 కిమీ దూరంలో ఉన్న దిబ్రూగర్ విమానాశ్రయం ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి మరొక సదుపాయం ఉంది.[1]
రైలు మార్గం
సిబ్‌సాగర్ పట్టణ రైల్వే స్టేషన్ ద్వారా ఈ పట్టణానికి సేవలు అందుతున్నాయి. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌లోని లుమ్‌డింగ్-డిబ్రూఘర్ విభాగంలో సమీప రైల్వే కూడలి శివసాగర్ నుండి 16 కిలోమీటర్లు (9.9 మై) దూరంలో సిమలుగురి కూడలి ఉంది. సిమలుగూరి నుండి శివసాగర్ వైపు బస్సులు నిత్యం తిరుగుతాయి.ఇది సిమలుగురి పట్టణం నుండి సుమారు అరగంట సమయంలో బస్సు ప్రయాణం ద్వారా శివసాగర్ పట్టణానికి చేరుకోవచ్చు.[9]
త్రోవ మార్గం
శివసాగర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులు శివసాగర్‌లోని అస్సాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.ఎస్.టి.సి) బస్ స్టేషన్ నుండి గౌహతి, దిబ్రూగర్, జోర్హాట్ నగరాలకు కలుపుతాయి. వ్యక్తుల సంస్థల ద్వారా నడిపే బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అద్దెకు టాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆటో-రిక్షాలు, ఇతర రవాణా మార్గాలు పట్టణంలో, చుట్టుపక్కల ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. టాటా మ్యాజిక్, టెంపోస్ వంటి చౌకైన రవాణా మార్గాలు నజీరా, మెచఘర్, జోయ్‌సాగర్ నుండి శివసాగర్‌కు అందుబాటులో ఉన్నాయి..[1]
విద్య
విశ్వవిద్యాలయం
అస్సాం రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ [10]
పెట్రోలియం విద్యా సంస్థలు
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ [11]
కళాశాలలు
ఆరోగ్య సంరక్షణ
సియుకాఫా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్,, ఆదిత్య డయాగ్నోస్టిక్ అండ్ హాస్పిటల్,[15] సంప్రీతి హాస్పిటల్, ఈస్ట్ పాయింట్ అండ్ రీసెర్చ్ సెంటర్, శివసాగర్ సివిల్ హాస్పిటల్, శర్మ నర్సింగ్ హోమ్
రాజకీయాలు
సిబ్‌సాగర్ జోర్హాట్ (లోక్‌సభ నియోజకవర్గం)లో భాగం.ఆర్.డి.కి చెందిన ప్రస్తుత శాసనసభ సభ్యునిగా శివసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి అఖిల్ గొగోయ్ కొనసాగుచున్నాడు.
ప్రముఖ వ్యక్తులు
- భాస్కర్ జ్యోతి మహంత, అస్సాం పోలీసు డిజిపి
- భోగేశ్వర్ బారుహ్, మాజీ అథ్లెట్, కోచ్
- హితేశ్వర్ సైకియా, రాజకీయ నాయకుడు
- ప్రణబ్ కుమార్ గొగోయ్, రాజకీయ నాయకుడు[16]
- మానస్ రాబిన్, సంగీతకారుడు
- అఖిల్ గొగోయ్, ఎమ్మెల్యే శివసాగర్ నియోజకవర్గం[17]
- దేవోలీనా భట్టాచార్జీ, భారతీయ టీవీ నటి[18]
- అమృతా గొగోయ్, అస్సామీ నటి
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 "About Sivasagar | Assam Rajiv Gandhi University of Cooperative Management | Government of Assam, India".
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006.
- ↑ "Imperial Gazetteer2 of India, Volume 6, page 33 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. Retrieved 2014-01-28.
- ↑ [h://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V22_358.gif "Imperial Gazetteer2 of India, Volume 22, page 352 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library"]. dsal.uchicago.edu. Retrieved 2014-01-28.
- ↑ "Profile of Sibsagar, History of Sibsagar, Sibsagar Economy". sibsagar.assamonline.in. Archived from the original on 2014-05-30.
- ↑ Assam District Gazetteers: Sibsagar District. p. 1.
- ↑ "About Sivasagar District". Sivasagar.nic.in. Retrieved 2022-08-05.
- ↑ 8.0 8.1 8.2 "Assam (India): Districts, Cities and Towns - Population Statistics, Charts and Map".
- ↑ "About Sivasagar | Assam Rajiv Gandhi University of Cooperative Management | Government of Assam, India".
- ↑ "Home | Assam Rajiv Gandhi University of Cooperative Management | Government Of Assam, India". Argucom.assam.gov.in. 2022-07-05. Retrieved 2022-08-05.
- ↑ "Official Website of Rajiv Gandhi Institute of Petroleum Technology, Jais, Amethi, India. / Recruitment".
- ↑ "Sibsagar College". Sibsagarcollege.in. 2022-06-30. Retrieved 2022-08-05.
- ↑ "Sibsagar Girls College". Sibsagar Girls College. 1970-01-01. Retrieved 2022-08-05.
- ↑ colorlib. "SCC". Sibsagarcommercecollege.org.in. Retrieved 2022-08-05.
- ↑ "Sibsagar Branch – Aditya Hospital". Archived from the original on 2022-12-16. Retrieved 2023-08-02.
- ↑ "Pranab Gogoi(Indian National Congress(INC)):Constituency- SIBSAGAR(SIVSAGAR) - Affidavit Information of Candidate".
- ↑ "Assam elections: Jailed activist Akhil Gogoi wins Sibsagar constituency".
- ↑ "3 Lesser Known Facts about Assam Girl Devoleena Bhattacharjee aka Gopi Bahu". 20 June 2016.
వెలుపలి లంకెలు
- Sivasagar travel guide from Wikivoyage
- http://sivasagar.nic.in