జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్, జూనియర్
జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్
జననం(1852-08-30)1852 ఆగస్టు 30
రొట్టెడాం, నెదర్లాండ్స్
మరణం1 మార్చి 1911(1911-03-01) (aged 58)
స్టెగ్లిజ్, బెర్లిన్ వద్ద, జర్మన్ సామ్రాజ్యము
నివాసంనెదర్లాండ్స్
జర్ననీ సామ్రాజ్యము
జాతీయతడచ్
రంగములుభౌతిక రసాయన శాస్త్రం
కర్బన రసాయన శాస్త్రం
వృత్తిసంస్థలువెటెరినరీ కాలేజ్ ఇన్ ఉట్రెచ్
యూనివర్శిటీ ఆఫ్ ఆమ్స్‌టెర్డం
బెర్లిన్ విశ్వవిద్యాలయం.
చదువుకున్న సంస్థలుDelft University of Technology
University of Leiden
University of Bonn
University of Paris
University of Utrecht
పరిశోధనా సలహాదారుడు(లు)Eduard Mulder
డాక్టొరల్ విద్యార్థులుErnst Cohen
ఇతర ప్రసిద్ధ విద్యార్థులుFrederick G. Donnan
ప్రసిద్ధిChemical kinetics, Stereochemistry
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize for Chemistry (1901)

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్‌హాఫ్ సీనియర్, కాఫ్‌ వాంట్‌హాఫ్. చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. రసాయన సాంకేతిక నిపుణుడిగా పట్టా పొందాడు. 1874లో యుట్రెక్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు. 1874లో వాంట్‌హాఫ్ స్టియిరో కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలను ప్రచురించాడు. 1884లో రసాయన గతిశాస్త్రంపై చేసిన పరిశోధనా వివరాలను ప్రచురించాడు. వీటిలో రసాయన చర్యల క్రమాంకాన్ని (Order) నిర్ణయించడానికి కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఈ పద్ధతిలో గ్రాఫిక్స్, ఉష్ణగతి శాస్త్ర నియమాలను రసాయన చర్యల సమతాస్థితికి ఉపయోగించాడు. 1889లో అర్హీనియస్ సమీకరణానికి భౌతిక న్యాయాన్ని సమకూర్చాడు. 1896లో వాంట్‌హాఫ్‌ను బెర్లిన్‌లోని ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో రసాయన శాస్త్ర ఆచార్యుడిగా నియమించారు. వాంట్‌హాఫ్ 1893లో రాయల్ సొసైటీ నుంచి డేవి పతకాన్ని స్వీకరించాడు. ద్రావణాల మీద చేసిన ప్రయోగాలు, పరిశోధనలకు 1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. జర్మనీలోని బెర్లిన్‌లో 58వ ఏట 1911 మార్చి 1న మరణించారు.

మూలాలు

యితర లింకులు