జాన్ నాష్

జాన్ నాష్ (2011)

గేమ్ థియరీని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన అమెరికాకు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు జాన్ ఫోర్బెస్ నాష్ (John Forbes Nash). జూన్13 1928 న జన్మించిన జాన్ నాష్ కు 1958లో స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మతకు గురై, 1990లో నాష్ మళ్ళి పూర్వపు మేధాశక్తిని పొందినాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం నాష్ సమతాస్థితి గా ప్రసిద్ధి చెందింది. 1994లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కల్సి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినాడు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక మహా శాస్త్రవేత్త. తన జీవితం ఆధారంగా నిర్మించిన "A beautiful Mind" చిత్రం 2002 లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందింది.

బాల్యం, విద్యాభ్యాసం

జూన్ 13, 1928న అమెరికాలోని అపలేచియన్ పర్వతాలలోని బ్లూఫీల్డు, పశ్చిమ వర్జీనియా నగరంలో జన్మించిన జాన్ నాష్, కార్నెజీ మెలాన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించాడు. 22 ఏళ్ళ వయసులో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 12 సంవత్సరాల వయస్సులోనే తన గదిలో పరిశోధనలు ఆరంభించాడు. యుక్త వయస్సులో బయట ఎవరితోనూ కల్సి తిరిగేవాడు కాదు. ఏకాంతంగా తన పనిని తాను నిర్వర్తించేవాడు.

బాధాకరమైన జీవితం

పరిశోధనలతో పురోగమిస్తున్న నాష్ జీవితంలో 29 వ ఏటా స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మత సంక్రమించింది. అప్పటి నుంచి అతని మానసిక ప్రవృత్తి మారిపోయింది. ఏవేవో ఆలోచనలతో, సంభాషణలతో పిచ్చిపిచ్చిగా గడిపేవాడు. తర్వాత న్యూజెర్సీ లోని మానసిక చికిత్సాలయంలో బంధించారు. తీవ్రమైన చికిత్సా విధానాలకు గురైనాడు. వ్యాధి నయం కాకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. హఠాత్తుగా 1990లో నాష్ మళ్ళి పూర్వ వైభవాన్ని పొందినాడు.

నాష్ సమతాస్థితి

ప్రతి గేమ్ కు ఫలితాలుంటాయని, గేమ్ లో పాల్గొన్న వారందరికీ ఆ ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయని నాష్ భావన. అయితే ఈ సిద్ధాంతం న్యాయసమ్మతంగా ఉండకపోవచ్చు. కాని అర్థశాస్త్రపరంగా ప్రయోజనంకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదాహరణకు ఒక నిర్ణీత సొమ్ము ఒక ధనవంతుడు, మరో బీదవాడు పంచుకోవాల్సి వస్తే చెరో సగం పంచుకోవడం న్యాయసమ్మతం. కాని నాష్ ధనవంతుడికే అధిక మొత్తం చెల్లించడం ప్రయోజనకరమని వాదించాడు. ధనవంతుడికి ఎంత డబ్బు ఉంటే అంత మంచిది. బీదవానికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంతేకాకుండా బీదవాడు, ధనవంతుడి కంటే తక్కువ మొత్తం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. కాబట్టి నాష్ సమతాస్థితి ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన ఫలితం లభించనప్పటికీ, సముచితమైన ప్రయోజనం లభిస్తుంది.

అవార్డులు

అర్థశాస్త్రంలోనే ప్రముఖమైన గేమ్ థియరీని ప్రతిపాదించినందుకు జాన్ నాష్ కు 1994లో అత్యున్నతమైన అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. జాన్-సి-హర్సాన్యీ, రీన్‌హార్డ్ సెల్టెన్ లతో కల్సి ఉమ్మడిగా ఆ బహుమతిని పంచుకున్నాడు.

రచనలు

  • The Bargaining Problem
  • Non coperative Games
  • Autobioagraphy
  • Equilibraium Points in N-Person Games

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.