1928
'1927 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1925 1926 1927 - 1928 - 1929 1930 1931 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 15: మిక్కి మౌస్, మిన్ని కలసి షార్టు ప్లేన్ క్రేజీ అనే కార్టున్ యొక్క అరంగేట్రం చెయ్యబడింది.
- జూలై 28: 9వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంస్టర్డాంలో ప్రారంభమయ్యాయి.
- చిలుకూరి నారాయణరావు సీడెడ్ ప్రాంతానికి రాయలసీమ అనే పేరుపెట్టారు.
- సూర్యాపేటలో జరిగిన ఆంధ్ర సభల్లో గ్రంథాలయ మహాసభ వామన నాయక్ నాయకత్వంలో నిర్వహించారు.[1]
జననాలు
- జనవరి 1: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
- జనవరి 1: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
- జనవరి 27: పోతుకూచి సాంబశివరావు, కవి, రచయిత, న్యాయవాది.
- జనవరి 28: లాలాలజపతి రాయ్,
- ఫిబ్రవరి 22: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (మ.2017)
- ఫిబ్రవరి 28: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు. (మ.2011)
- మార్చి 16: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990)
- మార్చి 20: జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022)
- మార్చి 31: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి.
- మే 11: సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (మ.2012)
- మే 26: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003)
- జూన్ 13: జాన్ నాష్, ఆర్థికవేత్త .
- జూన్ 14: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (మ.1967)
- జూన్ 14: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
- జూన్ 24: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (మ.2015)
- జూన్ 30: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
- జూలై 1: వై.బాలశౌరిరెడ్డి హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015)
- జూలై 3: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. (మ.1990)
- జూలై 10: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
- జూలై 15: వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ సభ్యురాలు.
- ఆగష్టు 20: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994)
- ఆగష్టు 24: దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
- ఆగష్టు 29: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
- సెప్టెంబర్ 2: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
- అక్టోబరు 2: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992)
- నవంబర్ 7: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (మ.2016)
- నవంబర్ 19: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)
- నవంబర్ 28: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
- డిసెంబరు 13: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2010)
- డిసెంబరు 21: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)
- డిసెంబరు 31: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)
- : ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. (మ.2013)
- : ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (మ.2013)
మరణాలు
- మార్చి 5: ఎస్.పి.సిన్హా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- మే 29: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
- జూన్ 10: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)
- జూన్ 20: ఆలూరు భుజంగ రావు, కవి అనువాదకుడు.
- నవంబర్ 17: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865)
- డిసెంబర్ 16: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866)
మూలాలు
- ↑ "దాసు త్రివిక్రమరావు". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.