జునాగఢ్
జునాగఢ్ జిల్లా | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
జనాభా (2001) | |
• Total | 24,48,173 |
భాషలు | |
• అధికార | గుజరాతీ, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో జునాగడ్ జిల్లా ఒకటి. జునాగడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జునాగఢ్ గుజరాత్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం , జిల్లా ముఖ్య పట్టణం. జునాగఢ్ భారతదేశంలోని ఒక సంస్థానం. జునాగఢ్ అనగా గుజరాతీ భాషలో 'పాత కోట' అని అర్ధం. ఇది గిర్నార్ పర్వతాలు సానువులలో ఉంది. ఈ జిల్లాలోనే ఆసియా సింహాలకు ప్రసిద్ధిచెందిన గిర్ అభయారణ్యం ప్రసిద్ధిచెందినది.
భౌగోళికం
జిల్లా పశ్చిమ గుజరాత్ లోని కతియార్ ద్వీపకల్పంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో రాజకోట్ జిల్లా, వాయవ్య సరిహద్దులో పోర్‌బందర్ జిల్లా, తూర్పుసరిహద్దులో అమ్రేలి జిల్లా, దక్షిణ , పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జునాగఢ్ నుండి కొంత భూభాగం వేరుచేసి పోర్‌బందర్ జిల్లాను ఏర్పాటు చేసేవరకు ఇది మహాత్మాగాంధీ జన్మస్థలంగా ఉండేది. జునాగఢ్ గిర్నర్ పర్వతావళి హిందువులకు , జైనులకు యాత్రాస్థలంగా ఉంది.
విభాగాలు
జునాగడ్ లోణి తాలూకాలు :
జునాగఢ్ ఉపవిభాగం
- మనవదార్ (માણાવદર)
- వంథ్లి (વંથલિ)
- జునాగఢ్
- భెసన్ (ભેંસાણ) అధికారిక వెబ్సైట్
- మెందర్ద (મેંદરડા)
- విషవదర్
మంగ్రొల్ ఉప విభాగం
- మాలియా (భారతదేశం) - హతిన (માળિયા હાટીના)
- మంగ్రొల్ (માંગરોળ)
- కెషొద్ (કેશોદ)
సొమంథ్ ఉపవిభాగం
- ఉన (గుజరాత్) (ઉના)
- కొదినర్ (કોડીનાર)
- సుత్రపద
- వేరవాల్ (વેરાવળ)
- తలల -గిర్ (તાલાળા-ગીર)
- గిర్-గదద
ప్రయాణ వసతులు
జునాగడ్ రహదారి , రైలు మార్గాలతో దేశంలోని ఇతర నగరాలతో చక్కగా అనుసంధనించబడింది. ఇది రాజకోట్ నుండి 100 కి.మీ దూరంలో , అహమ్మదాబాదు నుండి 350 కి.మీ దూరంలోనూ ఉంది.
రహదారి
జాతీయ రహదారి-8 జునాగడ్‌ను జెత్‌పూర్ మీదుగా రాజకోత్‌తో కలుపుతుంది.
రైల్వే
జునాగడ్ రైల్వే స్టేషను జునాగడ్‌ను రాజకోట్, అహమ్మదాబాదులతో అనుసంధానిస్తుంది. ఇది నగరంలోపలే ఉంది.
వాయు మార్గం
జునాగడ్ సమీప విమానాశ్రయం కెషొడ్ వద్ద ఉంది. ఇక్కడ నుండి ముంబయికి మితమైన అనుసంధానం ఉంది.
జలమార్గం
జిల్లాకు పొడవైన సముద్రతీరం ఉంది. జిల్లాలో వెరవల్, మంగ్రోల్, చొర్వద్ మొదలైన నౌకాశ్రయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇవి మత్స్యపరిశ్రమకు తప్ప మిగిలిన ఉపయోగాలకు మితంగానే ఉపయోగపడుతున్నాయి.
2011 కేంద్రప్రభుత్వం గిర్నర్ వద్ద రోప్ వే నిర్మించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ అది రూపు దిద్దుకోవడానికి అధికకాలం ఔతుంది. గతంలో ఇక్కడ హెలికాఫ్టర్ సర్వీసు ఉన్నప్పటికీ ఇప్పుడిది ఆపివేయబడింది.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,742,291,[1] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఉటాహ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 310వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 142 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.01%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 952:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 76.88% in 2011.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
2001 గణాంకాలను అనుసరించి అక్షరాస్యత 67.7%.
సంస్కృతి
జునాగడ్ జిల్లాలో సోమనాథ్ ఆలయం, వేరవల్ వద్ద ప్రభాస్‌పటన్ ఉన్నాయి. జ్యోతిర్లింగాలయాలలో సోమనాథ్ ఆలయం ఒకటి.
సుప్రసిద్ధ వ్యక్తులు
- నరసింహ మెహతా (1414? -1481?), కవి సాధువు,భావ్నగర్ జిల్లా తలజాలో జన్మించాడు
- త్రిభొవందస్ మొతిచంద్ షా (1850-1904), చీఫ్ మెడికల్ ఆఫీసర్.జునాగఢ్ ఆసుపత్రి. (నాసల్ రీకంస్ట్రక్షన్ యూసింగ్ పారా మీడియన్ ఒఫోర్‌హెడ్ ఫ్లాప్) ప్రదర్శన చేసాడు.
[4] గ్రాంట్ మెడికల్ కాలేజ్ వద్ద ఫారమల్ మేడ్రెన్ మెడికల్ ట్రనింగ్ పూర్తి చేసాడు.
- వజీర్ మొహమ్మద్ (1929-), క్రికెటర్, జునాగడ్ లో జన్మించాడు, తరువాత పాకిస్తాన్ లో స్థిరపడ్డాడు.
- ధీరుబాయి (1932-2002), వ్యాపారవేత్త , వ్యవస్థాపకుడు, జునాగడ్ లోని చోర్వద్‌లో జన్మించాడు
- హనీఫ్ మొహమ్మద్ (1934-), క్రికెటర్, జునాగడ్ లో జన్మించాడు, 1947 తర్వాత పాకిస్తాన్ లో స్థిరపడ్డాడు.
- రాజేంద్ర శుక్లా (1942-), కవి, జునాగడ్ లోని బంత్వాలో జన్మించాడు
- ముస్తాక్ మొహమ్మద్ (1943-), క్రికెటర్, జునాగడ్ లో జన్మించాడు, తరువాత పాకిస్తాన్ లో స్థిరపడ్డాడు.
- సాదిక్ మహమ్మద్ (1945-), క్రికెటర్, జునాగడ్ లో జన్మించాడు, తరువాత పాకిస్తాన్ లో స్థిరపడ్డాడు.
- పర్వీన్ బాబి (1949-2005), బాలీవుడ్ నటి, జునాగడ్ లో జన్మించింది.
వృక్షజాలం , జంతుజాలం
జునాగడ్ జిల్లాలో " గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ "లో మాత్రమే ఆసియన్ సింహాలు ఉన్నాయి. గిర్నర్ పర్వతం " వెదురు అరణ్య సరక్షణాలయంగా " ప్రకటించబడింది. ఈ పర్వతావళిలో గిర్నార్ గిద్ధ్ (లాంగ్ బిల్డ్ వల్చర్) (రాబందులు) ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని రాబందులలో 10% ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రామందులలో 25% జాతులు ఇక్కడ కనిపిస్తున్నాయి.
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Jamaica 2,868,380 July 2011 est
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Utah 2,763,885
- ↑ http://journals.lww.com/plasreconsurg/Citation/1970/02000/Commentary_By_Dr__Charles_Pinto.12.aspx