డేనియల్ నొబోవా

ఈక్విడర్ దేశ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త డేనియెల్‌ నొబోవా ఎన్నికయ్యారు[1]. మద్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గొంజా లెజ్ విజయం సాధించారు. 2023 అక్టోబరు 16వ తేదీన వెల్లడించిన ఫలితాల్లో డేనియెల్‌ నొబోవాకు 52 శాతం, గోంజాలేజ్ కు 42 శాతం ఓట్లు లభించాయి. 35 సంవత్సరాల డేనియల్ నొబోవా ... ఈక్విడర్ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. అవినీతి ఆరోపణతో ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు గిలెర్ము లాస్సో పార్లమెంటును పార్లమెంటును అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఈ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

మూలాలు