తవాకెల్ కర్మన్

Tawakkol Karman
توكل كرمان
Tawakel Karman
జననం (1979-02-07) 1979 ఫిబ్రవరి 7 (వయసు 45)
Taiz, Taiz Governorate, Yemen Arab Republic
జాతీయతYemeni
పౌరసత్వంYemeni/Turkish[1][2]
విద్యాసంస్థSanaa University
University of Science and Technology Yemen
వృత్తిJournalist, politician. human rights activist
రాజకీయ పార్టీAl-Islah
ఉద్యమంJasmine Revolution
జీవిత భాగస్వామిMohammed Al-Nehmi
పిల్లలుThree
తల్లిదండ్రులుAbdulsalam Khaled Karman (Father)
Anisah Housain Al Asoadi (Mother)
బంధువులుEshraq Karman (sister)
Entesar Karman (sister)
Mohameed Karman (brother)
Khaled Karman (brother)
Hakimah Karman (sister)
Tariq Karman (brother)
Khadejah Karman (sister)
Huda Karman (sister)
Safa Karman (sister)
పురస్కారాలుNobel Peace Prize (2011)
Karman in Stockholm 2014.

తవాకెల్ కర్మన్ దిద్దుబాటు (అరబ్బీ: توكل عبد السلام خالد كرمان‎ తవాకెల్ ఉస్ - సలం కర్మన్ రోమన్‌లో " తవాకుల్ " [3] తవాకెల్ అని కూడా అంటారు.[4][5][6]) (1979 ఫిబ్రవరి 7న జన్మించింది.[6]) తవాకెల్ యేమన్ పత్రికావిలేఖరి, రాజకీయవాది, " అల్- ఇస్లాహ్ (యేమన్)" అనే రాజకీయ పార్టీ, యేమన్ మానవహక్కుల సభ్యురాలు. " వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైంస్ " (2005లో స్థాపించబడిన ఈ సంస్థ స్థాపనసభ్యులలో ఆమె ఒకరు) కు ఆమె నాయకత్వం వహించింది. [3] అరబ్ విప్లవంలో భాగంగా మొదలైన యేమన్ విప్లవంలో ఆమె పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడింది.[7][8] 2011 నోబెల్ బహుమతి శాంతి పురస్కారం అందుకున్నవారిలో ఆమె ఒకరుగా ఉంది.[9] ఈ బహుమతి అందుకుని ఆమె యేమని మొదటి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా, మొదటి అరబ్ స్త్రీగా,[10] నోబెల్ బహుమతి అందుకున్న రెండవ ముస్లిం స్త్రీ, చిన్నవయసులో నోబెల్ బహుమతి అందుకున్న వారిలో ద్వీతీయస్థానం పొందిన వ్యక్తిగా గుర్తించబడింది.[11] 2005 నుండి కర్మన్ పత్రికావిలేఖరిగా ప్రాముఖ్యత సంతరించుకుంది.[3][12]

వ్యక్తిగత జీవితం

నోబెల్ పురస్కార గ్రహీత తవాకెల్ కర్మన్ 1979 ఫిబ్రవరి 7న యెమన్ లోని తైజ్ గవర్నరేట్ లోని మెఖ్లఫ్‌లో జన్మించింది. అమే తైజ్ (యెమన్‌లో మూడవ పెద్ద నగరం) సమీపంలో పెరిగింది. తైజ్ యెమన్‌లోని సంప్రదాయ నగరంగా గుర్తించబడింది.[13] ఆమె తైజ్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసింది. ఆమె తండ్రి అబ్దెల్ సలాం కర్మన్ లాయర్, రాజకీయవాది. ఆయన అబ్దుల్లా సలేహ్స్ ప్రభుత్వంలో " లీగల్ అఫెయిర్ మినిస్టర్ "గా పనిచేసి రాజీనామా చేసాడు. [12] ఆమె సోదరుడు తారిక్ కర్మన్ కవిగా ప్రఖ్యాతి చెందాడు.[14] మరొక సోదరుడు సఫా కర్మన్ " అల్- జజీరా " పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. [15] ఆమె మొహమ్మద్ అల్- నహ్మీని వివాహం చేసుకుంది. [8][16] ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు.[17] కర్మన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాజ్యుయేట్ డిగ్రీని, సనాల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ నుండి పొలిటికల్ సైన్సు డిగ్రీని అందుకున్నది. [13][15] 2012 లో అంతర్జాతీయ లాలో " యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా (కెనడా) నుండి ఆమె గౌరవ డాక్టరేట్ అందుకుంది. [18][19] 2010 లో ఒక నిరసన ప్రదర్శనలో ఒకస్త్రీ కర్మన్‌ను పిడిబాకుతో పొడవడానికి ప్రయత్నించినప్పుడు కర్మన్ మద్దతుదార్లు ఆమెను రక్షించారు. [16][20] ఆమె బహిరంగ నిరసనను కొనసాగిస్తే ఆమెను చంపుతామని 2011 జనవరి 26న ఫోన్ కాల్ చేసారని తారిక్ కర్మన్ ప్రకటించాడు.[21] కర్మన్ తల్లితండ్రులు టర్కీలోని కర్మన్ ప్రాంతానికి చెందినవారని ఆమె మాటల ఆధారంగా భావిస్తున్నారు. టర్కీ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వం ఇవ్వడానికి ముందుకువచ్చింది. ఆమె 2012 అక్టోబరు 11న టర్కీ విదేశాంగ మంత్రి నుండి పౌరసత్వ దస్తావేజులను స్వీకరించింది.[1][22][23]

సంకెళ్ళు లేని మహిళా విలేఖరులు

" సంకెళ్ళు లేని మహిళా విలేఖరులు" అనే మానవహక్కుల రక్షణ వ్యవస్థాపకులలో తవాకెల్ కర్మన్ ఒకరు. 2005లో 7 గురు ఇతర మహిళా వలేఖరులతో కలిసి కర్మన్ ఈ సంస్థను స్థాపించింది.[24]

రాజకీయ పదవి

Tawakkol Karman protests outside the UN building, 18 October 2011.

తవాకెల్ కర్మన్ ప్రతిపక్షపార్టీ " అల్- ఇస్లాహ్ (యెమన్) " సభ్యురాలు. అంతేకాక ఆమె షురా కౌంసిల్‌లో పదవిలో ఉండేది. [13] అల్- ఇస్లాహ్ 2005 లో అధ్యక్షుడు సాలేహ్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించించిన తరువాత దానికి ప్రజాదరణ అధికం అయింది. ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన అల్- ఇస్లాం పార్టీని ముస్లిం సోదరులు, సాలాఫిస్టులు ఆదరించారు.[25] అదే పార్టీలో " అబ్దుల్ మజీద్ అల్- జిందాని " సభ్యుడుగా ఉన్నందున కర్మన్ పార్టీ సభ్యత్వం వివాదాద్పదం అయింది. యెమని ముస్లిం బ్రదర్‌హుడ్‌కు జిందాని నాయకత్వం వహించాడు. తరువాత సలాఫీ వింగ్‌కు నాయకత్వం వహించాడు. ఆయన యునైటెడ్ స్టేట్స్ " ఆఫీస్ " ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ " ఎస్.డి.ఎన్. జాబితాలో ఉన్నాడు.[26][27] తరువాత కర్మన్ పార్టీ నుండి స్వతంత్రం పిందింది.[15] తన దేశంలో పత్రికాస్వతంత్రం కొరకు కర్మన్ నిరసన ప్రదర్శనలు ఆరంవ్హించింది.[28][29] ఆమె సంప్రదాయ " నిక్వాబ్ " ధరించడం ఆపింవేసింది. 2004 లో కాంఫరెంస్ సందర్భంలో ఆమె నిక్వాబ్ ధరించకుండా కనిపించింది. తరువాత ఆమె ముఖం కనిపించే హిజాబీలను ధరించడం ప్రారంభించింది. [12] కర్మన్ నిక్వాబ్ బదులుగా స్కార్ఫ్ ధరించింది. పూర్తిగా ముఖాన్ని మూయడం సంప్రదాయమేకాని అది ఇస్లాం నిబంధనలలో ఒకటి కాదన్నది ఆమె భావన. [30][31] ఆమె మహిళలో అనేకమంది పోషాకాహార లోపంతో బాధపడుతున్నారని పురుషులకు పౌష్టికాహారం అందుతుందని అభిప్రాయం వెలిబుచ్చింది. అంతేకాదు మహిళలలో మూడింట రెండు వంతులు నిరక్ష్యరాశ్యులుగా ఉన్నారని ఆమె అభిప్రాయపడింది.[32] ఆమె వివాహ చట్టాలపట్ల వైవిధ్యమైన అభిప్రాయాలు కలిగి ఉంది. వివాహ చట్టం నిబంధనల విషయంలో అల్- ఇలాష్ పార్టీ ఇతరసభ్యుల కంటే ఆమె అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. 17 సంవత్సరాలకు ముందే ఆడపిల్లలకు వివాహం చేయాలన్న నిబంధనను ఆమె వ్యతిరేకించింది. హ్యూమన్ రైట్స్ వాచ్, అడ్వకేట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంటులో ఆమె " యెమన్ విప్లవం అంటే రాజకీయ సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు సాంఘిక సమస్యలను, బాల్యవివాహాలను నిరోధించడం కూడా అందులో భాగమే " అని అభిప్రాయం వెలిబుచ్చింది.[33] ఆమె ప్రభుత్వంలోని చంచగొండితనం పట్ల వ్యతిరేకతగా నిరసన ప్రదర్శించింది.[16][20] ఆమె విదేశీప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా ఉంటానని చెప్పింది. ఆమె మానవహక్కులను రక్షించడానికి యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంటు, అమెరికన్ ఆర్గనైజేషన్లతో వ్యూహాత్మకమైన సంబంధాలను కలిగిఉంటానని ప్రకటించింది. అంతేకాక తాను ఐరోపా, అరబ్ ఉద్యమకారులతో సమానహోదాలో సంబంధాలు కలిగి ఉంటానని చెప్పింది.[15] యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆడియంస్‌తో ప్రసంగిస్తూ ఆమె తానది ప్రపంచ పౌరసత్వమని, ఈ భూమి తన దేశమని, మానవత్వమే తన జాతి అని ప్రసంగించింది.[34]

ఈజిప్షియన్ సంఘర్షణ

2012-13 ఈజిప్షియన్ నిరసనలు, 2013 ఈజిప్షియన్ తిరుగుబాటు ఈజిప్షియన్ తిరుగుబాటుకు స్పందనగా కర్మన్ ఈజిప్షియన్ అధ్యక్షుడు మొహ్మద్ మొర్సి రాజీనామాకోరేవారికి బాసటగా నిలిచింది. మొర్సీని పదవీచ్యుతుని చేసి రాజ్యాంగం రద్దుచేసి ముస్లిం బ్రదర్‌హుడ్ కార్యకలాపాలను ఈజిప్ట్‌ రాజకీయాల నుండి నిషేధించింది.[35][36] కర్మన్ తురుగుబాటుకు వ్యరేకంగా నిరసనలో పాల్గొనడానికి ఈజిప్ట్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఈజిప్షియన్ సైన్యం రక్షణసమస్యలను కారణంగా చూపి కర్మన్ ఈజిప్ట్ ప్రవేశాన్ని నిరాకరించింది.[37] కర్మన్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఉన్నతస్థాయి అధికారులను ఖైదుచేయడానిని, మొర్సీ మద్దతుదారుల మీద హింసలను ఖండించింది.[38]

యెమని సంఘర్షణ

కర్మన్ తరచుగా యెమన్లో షియా విప్లవం, అరేబియన్ ద్వీపకల్పంలో అల్- కౌయిదాలకు వ్యతిరేకంగా స్పందించింది. యెమన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిన బృందాలను ఆమె ఖండించింది.[39] అన్‌మాండ్ ఏరియల్ వెహికల్ యెమన్‌లో ప్రవేశించడాన్ని కర్మన్ వ్యతిరేకించింది. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలాంటి వాహనాలు ప్రవేశించడం అంతర్జాతీయ చట్టాలకు, మానవహక్కులరక్షణకు ఇది వ్యతిరేకమని కర్మన్ అభిప్రాయపడింది. [40]

2011 నిరసనలు

Protest on the "Day of Rage" that Karman had called for in Sana'a, Yemen, from 3 February 2011.

దీర్ఘకాల సలేహ్‌కు వ్యతిరేకంగా 2011లో తవాకెల్ కర్మన్ సనాలో విద్యార్థుల నిరసన ప్రదర్శనను నిర్వహించింది. తరువాత జవవరి 22 న ఆమె తనభర్తతో కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీస్ గుర్తింపు లేని సాధారణ దుస్తులలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి ఖైదు చేసి జైలులో ఉంచారు.[14][21] అక్కడ ఆమె 36 గంటల సమయం గడిపిన తరువాత జనవరి 9న ఆమెను పెరోల్‌లో విడుదల చేసారు.[41] తరువాత ఆమె జనవరి 29న మరొక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసింది.[42] ఈజిప్షియన్ తిరుగుబాటు తరువాత ఒక అర్ధరాత్రి సమయంలో తవాకెల్ తిరిగి ఖైదుచేయబడింది.[43] ఆమె తన భర్తతో కలిసి కొన్ని మాసాల కాలం నిరసన మకాం ఏర్పాటు చేసింది.[8]

అంతర్జాతీయ ప్రభుత్వసంస్థల జోక్యం

నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తరువాత కర్మన్‌కు అంతర్జాతీయ వేదికలు, ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాలు వెలువరించడానికి అవకాశం లభించింది.

2011 నోబెల్ శాంతి పురస్కారం

From left to right: Tawakkul Karman, Leymah Gbowee, and Ellen Johnson Sirleaf display their awards during the presentation of the Nobel Peace Prize, 10 December 2011 (Photo: Harry Wad).

కర్మన్ అతి చిన్నవయసులో నోబెల్ శాతిపురస్కారం అందుకున్న అరబ్ మహిళగా, అంతర్జాతీతంగా నోబెల్ పురస్కారం అందుకున్న రెండవ మహిళగా గుర్తించబడుతుంది. [44] ఆమె తన 32 సంవత్సరాలవయసులో నోబెల్ పురస్కారం అందుకున్నది.[45] 2014 లో మలాలా యూసఫ్జై తన 17 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది. 2003 లో షిరిన్ ఎబాద్ మొదటి పర్షియన్ మహిళగా, మొదటి ముస్లిం మహిళగా నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది. నోబెల్ పురస్కారం అందుకున్న పత్రికావిలేఖరులలో కర్మన్ మూడవ వ్యక్తి. 1905లో బెర్తా వన్ సున్నర్, 1946లో ఎమిలీ గ్రీన్ బాల్చ్ నోబెల్ పురస్కారం అందుకున్నారు. 2011 లో కర్మన్ నోబెల్ పురస్కారం అందుకునే ముందు 12 మంది మహిళలు నోబెల్ పురస్కారం అందుకున్నారు. తరువాత ఈ సంఖ్య 15కు చేరుకుంది. 2011 లో ఎలెన్ జాంసన్ సిర్లీఫ్, లేమత్ జిబోవీ కర్మన్‌తో కలిసి నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. [46]

నోబెల్ పురస్కారం తరువాత

కర్మన్‌కు నోబెల్ పురస్కారం ప్రకటించబడిన తరువాత కతర్కు వెళ్ళి షేక్ తమిన్ బిన్ హమాద్ అల్ థానీని కలుసుకుని చర్చించిన తరువాత మహిళా పత్రికావిలేఖరులకు అవగాహన కలిగించడానికి, మహిళా పత్రికాకారులకు మద్దతుగా నిలవడానికి రేడియో కేంద్రం ఏర్పాటుకు సహకరించమని " దోహా సెంటర్ ఫర్ మీడియా ఫ్రీడం " సంస్థను కోరింది. [47] 2011లో " ఫారెన్ పాలసీ " 100 ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో కర్మన్ ప్రథమస్థానంలో నిలిచింది.న్ [48] " ఎం.బి.ఐ. అల్ జాబర్ ఫౌండేషన్ " తరఫున ఇస్తాంబుల్ అయ్దిన్ యూనివర్శిటీలో డిగ్రీ, పోస్ట్ గ్రాజ్యుయేషన్ చదవడానికి ఉపకారవేతనం మంజూరు చేసింది. [49] కర్మన్ ప్రంపంచవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్శిటీలు ఆమె ప్రసంగించడం, మహిళలు, మానవహక్కులు, అరబ్ తిరుగుబాటు గురించి చర్చలు సాగించింది. [50][51][52]

రచనలు

మూలాలు

  1. 1.0 1.1 "Turkish fm receives winner of Nobel peace prize". Anadolu Agency. 2012-10-11. Retrieved 2012-10-11.
  2. "Barış Nobeli sahibi Yemenli, TC vatandaşı oldu". Posta. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 11 October 2012.
  3. 3.0 3.1 3.2 Al-Sakkaf, Nadia (17 June 2010). "Renowned activist and press freedom advocate Tawakul Karman to the Yemen Times: "A day will come when all human rights violators pay for what they did to Yemen"". Women Journalists Without Chains. Archived from the original on 30 జనవరి 2011. Retrieved 30 January 2011.
  4. Evening Times (Glasgow). Arrest Sparks Protest. 24 January 2011. Retrieved 8 October 2011 from the Lexis-Nexis Database.
  5. Emad Mekay. Arab Women Lead the Charge. Inter Press Service (Johannesburg), 11 February 2011. Retrieved 8 October 2011 from the Lexis-Nexis Database.
  6. 6.0 6.1 "Yemen laureate figure of hope and controversy". Oman Observer. Archived from the original on 12 జనవరి 2013. Retrieved 15 November 2011.
  7. Macdonald, Alastair (7 October 2011). "Nobel honours African, Arab women for peace". Reuters. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 16 November 2011.
  8. 8.0 8.1 8.2 Al-Haj, Ahmed; Sarah El-Deeb (7 October 2011). "Nobel peace winner Tawakkul Karman dubbed 'the mother of Yemen's revolution'". Sun Sentinel. Associated Press. Retrieved 8 October 2011.
  9. "Nobel Peace Prize awarded jointly to three women". BBC Online. 7 October 2011. Retrieved 16 November 2011.
  10. "Profile: Nobel peace laureate Tawakul Karman". BBC Online. 7 October 2011. Retrieved 16 November 2011.
  11. "Yemeni Activist Tawakkul Karman, First Female Arab Nobel Peace Laureate: A Nod for Arab Spring". Democracynow.org. Retrieved 10 December 2011.
  12. 12.0 12.1 12.2 "Renowned activist and press freedom advocate Tawakul Karman to the Yemen Times:"A day will come when all human rights violators pay for what they did to Yemen."". Yemen Times. 3 November 2011. Archived from the original on 1 జనవరి 2012. Retrieved 15 November 2011.
  13. 13.0 13.1 13.2 "Tawakkol Karman, figure emblématique du soulèvement au Yémen – L'événement : LaDépêche.fr". Ladepeche.fr. Retrieved 16 November 2011.
  14. 14.0 14.1 Filkins, Dexter (1 August 2011). "Yemen's Protests and the Hope for Reform". The New Yorker. Retrieved 16 November 2011.
  15. 15.0 15.1 15.2 15.3 www.memri.org. "Nobel Peace Prize Laureate Tawakkul Karman – A Profile". Memri.org. Archived from the original on 27 నవంబరు 2011. Retrieved 16 November 2011.
  16. 16.0 16.1 16.2 Finn, T. (25 March 2011). "Tawakul Karman, Yemeni activist, and thorn in the side of Saleh". The Guardian. Retrieved 13 August 2013.
  17. Karman, Tawakkol (18 June 2011). "Yemen's Unfinished Revolution". New York Times. Retrieved 15 November 2011.
  18. Shephard, Michelle (2012-11-25). "Nobel Peace Prize winner Tawakkol Karman tours Canada". Toronto Star. Archived from the original on 2012-12-29. Retrieved 2012-12-16.
  19. Townsend, Sean (2012-10-19). "Honorary degrees recognize inspirational leaders" (public relations). University of Alberta. Archived from the original on 2012-10-23. Retrieved 2012-12-16.
  20. 20.0 20.1 Blomfield, Adrian (7 October 2011). "Nobel peace prize: profile of Tawakul Karman". London: Telegraph. Retrieved 16 November 2011.
  21. 21.0 21.1 http://www.fidh.org/IMG/pdf/obs_2011_uk-mmo.pdf
  22. "Turkey hopes to grant citizenship to Karman". Hurriyet Daily News. 2012-03-19. Retrieved 2012-10-11.
  23. "Turkish ID more important than Nobel, Karman says". Hurriyet Daily News. 2012-10-12. Retrieved 2012-10-16.
  24. "Female Journalists without Borders". Yobserver.com. Archived from the original on 1 ఫిబ్రవరి 2016. Retrieved 16 November 2011.
  25. "Yemen Islamists ready to share power". Oman Tribune. 14 December 2011. Archived from the original on 13 మే 2013. Retrieved 14 December 2011.
  26. Nasir Arrabayee. "Can Yemen Crisis Be Internationalized More?" Yemen Observer, 8 October 2011. Retrieved 11 October 2011 from BBC Worldwide Monitoring in the Lexis-Nexis Database.
  27. Nasir Arrabayee. "Can Yemen Crisis Be Internationalized More?" Archived 2016-03-16 at the Wayback Machine Nasir Arrabayee (Blog), 6 October 2011. Retrieved 11 October 2011
  28. ఉల్లేఖన హెచ్చరిక: JAWA పేరుతో ఉన్న <ref> ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి.
  29. Karman, T. (19 February 2006). "Burning Embassys is Not the Way". Yemen Times. Archived from the original on 9 మే 2015. Retrieved 26 October 2011.
  30. Tom Finn in Sana'a (26 March 2011). "Tawakul Karman, Yemeni activist, and thorn in the side of Saleh | World news". The Guardian. London. Retrieved 16 November 2011.
  31. "Yemen releases jailed activists in the face of Tunisia-inspired protesters". CSMonitor.com. 24 January 2011. Retrieved 16 November 2011.
  32. "Tawakul Karman gets 2011 Nobel Peace Prize, leads Yemeni women's Arab spring". 7 October 2011. Archived from the original on 12 అక్టోబరు 2011. Retrieved 8 October 2011.
  33. "Yemen: End Child Marriage". Human Rights Watch. 11 September 2013. Retrieved 24 September 2013.
  34. Lerner, Charlene (15 November 2011). "Nobel Prize winner highlights women's role in Arab Spring". The Michigan Daily. Archived from the original on 29 జూలై 2013. Retrieved 15 November 2011.
  35. Karman, T. (8 August 2013). "Egypt's coup has crushed all the freedoms won in the revolution". The Guardian. Retrieved 13 August 2013.
  36. Karman, T. (9 August 2013). "Morsy Is the Arab World's Mandela". Foreign Policy. Archived from the original on 13 ఆగస్టు 2013. Retrieved 13 August 2013.
  37. Ashraf, F. (4 August 2013). "Tawakkol Karman banned from entering Egypt". Daily News Egypt. Retrieved 13 August 2013.
  38. Yemen Post Staff (20 August 2013). "Tawakkol Karman denounces arrest of Mohammed Badie in Egypt". Yemen Post. Archived from the original on 20 ఆగస్టు 2013. Retrieved 21 August 2013.
  39. Al-Karimi, Khalid (25 November 2014). "Defense Minister calls for Houthi integration into security forces". Yemen Times. Archived from the original on 19 మార్చి 2018. Retrieved 19 January 2015.
  40. Yemen Post Staff (13 August 2013). "Tawakkol Karman objects to US drone policy in Yemen". Yemen Post. Retrieved 29 August 2013.
  41. Tawakkol, Karman (9 April 2011). "Our revolution's doing what Saleh can't – uniting Yemen". The Guardian. Retrieved 8 October 2011.
  42. "New protests erupt in Yemen". Al Jazeera English. 29 January 2011. Archived from the original on 31 జనవరి 2011. Retrieved 30 January 2011.
  43. Finn, Tom (23 January 2011). "Yemen arrests anti-government activist". The Guardian. London.
  44. "Yemeni Activist Tawakkul Karman, First Female Arab Nobel Peace Laureate: A Nod for Arab Spring". Democracynow.org. Retrieved 16 November 2011.
  45. "Nobel Laureates – FAQ". nobelprize.org. Archived from the original on 23 సెప్టెంబరు 2011. Retrieved 7 October 2011.
  46. "The Nobel Peace Prize 2011 – Press Release" (Press release). Nobelprize.org. 7 October 2011. Retrieved 15 November 2011.
  47. "الموقع الرسمي لجريدة الشرق القطرية". Al-sharq.com. Archived from the original on 9 మార్చి 2012. Retrieved 16 November 2011.
  48. "The FP Top 100 Global Thinkers". Foreign Policy. December 2011. Archived from the original on 30 నవంబరు 2011. Retrieved 2 December 2011.
  49. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2016-03-20.
  50. http://www.etownian.com/campus-life/female-journalist-activist-tawakkol-karman-speak-campus/
  51. http://www.pennlive.com/entertainment/index.ssf/2014/04/tawakkol_karman_nobel.html
  52. http://lancasteronline.com/donegal/announcements/nobel-peace-prize-winner-to-speak-april-at-elizabethtown-college/article_8be356dc-b45a-11e3-99a3-0017a43b2370.html