తిరుకూడలూరు

తిరుకూడలూరు
Thirukkodaloor
తిరుకూడలూరు Thirukkodaloor is located in Tamil Nadu
తిరుకూడలూరు Thirukkodaloor
తిరుకూడలూరు
Thirukkodaloor
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
పేరు
ఇతర పేర్లు:ఆడుదురై పెరుమాళ్ కోయిల్
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తంజావూరు
ప్రదేశం:Vadakurangaduthurai,
కుంభకోణం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:జగద్రక్షక పెరుమాళ్
(విష్ణువు)
ప్రధాన దేవత:పద్మాసనవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:చక్ర తీర్థము
విమానం:శుద్ధ సత్వ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:నందక మహర్షి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

తిరుకూడలూరు లేదా కూడలూర్ ఒక దివ్యమైన పుణ్యక్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

మార్గము

తంజావూరు నుండి తిరువయ్యార్ చేరి అక్కడ నుండి కుంభకోణం పోవు బస్ లో 10 కి.మీ. దూరములో ఈ సన్నిధి చేరవచ్చును. ఆడుదురై పెరుమాళ్ కోయిల్ సూచన: తంజావూరు నుండి గణపతి అగ్రహారం పోవు టౌన్ బస్ లో ఈ క్షేత్రమును చేరవచ్చును. ఇచట వసతులేమియు లేవు. అయ్యంపేటలోగాని, తిరువయ్యారులో గాని బస చేయాలి. అయ్యంపేటకు 7 కి.మీ. దూరములో ఈ క్షేత్రము ఉంది. అర్చక స్వాములు ఉండు సమయమును తెలిసికొని ఆరాధించాలి.

సాహిత్యంలో కూడలూర్

శ్లోకము||
చక్ర తీర్థాంచితే రమ్యే కూడలూర్ నగరీవరే
పద్మాసన లతానాధో వైయ్యంకాత్త విభుస్సదా

శ్లోకము||
శుద్ధ సత్త్వ విమానస్థః ప్రాజ్ముఖో నన్దకర్షిణా
ప్రత్యక్షితః కలిధ్వంసి స్తుతి ప్రీతో విరాజతే

పాశురము||
తాన్దం పెరుమై యఱియార్; తూదు | వేన్దర్కాయవేన్దరూర్ పోల్;
కాన్దళ్ విరల్ మెన్ కలై నన్మడవార్ | కూన్దల్ కమ్ఱం కూడలూరే.

పాశురము||
తక్కన్‌వేళ్వి త్తకర్త తలైవన్ | తుక్కన్దుడైత్త తుణైవరూర్ పోల్
ఎక్కలిడు నుణ్ మణల్ మేల్, ఎజ్గుమ్‌ | కొక్కిన్ పళమ్‌ వీళ్ కూడలూరే.
            తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 5-2-1.6

ముముక్షువు

కంటికి కనుపింపనిధానిని (అనగా భగవత్స్వరూపమును) కంటికి కనుపించునట్లు అనుసంధించుకొనుచు, కంటికి కనుపించు (శబ్దాదిభోగములను) వానిని కంటికి-కనబడునట్లు భావించువాడే ముముక్షువు. "శ్రీపరాశర భట్టర్"

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వైయంకాత్త పెరుమాళ్ (జగద్రక్షకన్) పద్మాసనవల్లి తాయార్ చక్ర తీర్థము తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ శుద్ధ సత్వ విమానము నన్దక మహర్షికి

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

వెలుపలి లింకులు