తూళ్ల దేవేందర్ గౌడ్
తూళ్ల దేవేందర్ గౌడ్ | |||
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2012 – 2 ఏప్రిల్ 2018 | |||
ముందు | కే. కేశవరావు | ||
---|---|---|---|
తరువాత | సీ.ఎం.రమేష్ | ||
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
గవర్నరు | సి.రంగరాజన్ సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
ముందు | ఎలిమినేటి మాధవ రెడ్డి | ||
తరువాత | కుందూరు జానారెడ్డి (హోం వ్యవహారాలు) | ||
బీసీ సంక్షేమ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, సహకారం, రెవెన్యూ & పునరావాసం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1994 – 1999 | |||
గవర్నరు | కృష్ణకాంత్ సి.రంగరాజన్ | ||
ముందు | నారా చంద్రబాబునాయుడు (రెవెన్యూ & పునరావాసం) | ||
తరువాత | తమ్మినేని సీతారాం (రెవెన్యూ & పునరావాసం) | ||
పదవీ కాలం 1994 – 2008 | |||
ముందు | సింగిరెడ్డి ఉమా వెంకటరామ రెడ్డి | ||
తరువాత | కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి | ||
నియోజకవర్గం | మేడ్చల్ | ||
పదవీ కాలం 1988 – 1993 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తుక్కుగూడ, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణ , భారతదేశం ) | 1953 మార్చి 18||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (1988-2008) (2009-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యం పార్టీ (2008-2009) | ||
తల్లిదండ్రులు | సాయన్న గౌడ్ , సత్తెమ్మ | ||
జీవిత భాగస్వామి | టి. వినోద | ||
సంతానం | విజయేందర్ గౌడ్, వినయేందర్ గౌడ్, తూళ్ల వీరేందర్ గౌడ్ | ||
నివాసం | తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా | ||
వెబ్‌సైటు | www.tulladevendergoud.com |
తూళ్ల దేవేందర్ గౌడ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మేడ్చల్ శాసనసభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మంత్రిగా పని చేశాడు.[1]
బాల్యం, విద్యాభ్యాసం
తూళ్ల దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.[2] కళాశాల దశలోనే విద్యార్థినాయకుడిగా పనిచేసిన అనుభవంతో, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ముఖ్య వ్యక్తిగా ఎదిగాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దేవేందర్ గౌడ్ పాఠశాల విద్య తరువాత ఇంటర్మీడియట్ ధర్మవంత్ కళాశాలలోను, వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ బద్రుకా కళాశాలలో పూర్తిచేశాడు. కళాశాలలో ఉన్నప్పుడే అతడు విద్యార్థి నాయకుడిగా వ్యవహరించాడు.
రాజకీయ జీవితం
దేవేందర్ గౌడ్ చదువు పూర్తయ్యాక, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో నేతగా పేరుతెచ్చుకున్నాడు. 1988లో జిల్లా పరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు ఛైర్మన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత 1994 డిసెంబర్లో తొలిసారిగా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. 1999 అక్టోబర్లో రెండో సారి కూడా 77,883 ఓట్ల మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు రాష్ట్ర గృహమంత్రిగా పనిచేసాడు. 2004 ఏప్రిల్లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.[3]
తెలుగుదేశం పార్టీకి రాజీనామా
తెలుగుదేశం పార్టీలో తన తెలంగాణా వాదానికి సరైన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.[4] 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణాలో పుంజుకొనేందుకు పార్టీ యత్నాలు ఫలిస్తున్న తరుణంలో దేవేందర్ నిష్క్రమణతో పార్టీకి దెబ్బ తగిలింది. దేవేందర్ గౌడ్ "నవ తెలంగాణా పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.
ప్రజారాజ్యంలో విలీనం
ఫిబ్రవరి 2009లో తాను స్థాపించిన నవతెలంగాణ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభతో[5] పాటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ[6] పోటీ చేసి, రెండింటిలోనూ ఓడిపోయాడు.
తెలుగుదేశంలో చేరిక
2009, ఆగస్టు3న దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీని వీడి ఆగస్టు 6న మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం వదలివెళ్ళడం చారిత్రక తప్పిదం అని పేర్కొన్నాడు. తెలుగు దేశంలో చేరిన తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7] ఆయన 2012 ఏప్రిల్ నుండి 2018 మే వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[8][9]
రాజకీయ జీవితం
- రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ 1988 - 1993
- మేడ్చల్ శాసనసభ్యుడు 1994 - 1999, 1999 - 2003 & 2003 – 2008 [10]
- బీసీ సంక్షేమ, ఎక్సైజ్, సహకార శాఖ మంత్రి 1994 - 1995
- రెవెన్యూ శాఖ మంత్రి 1995 - 1999
- హోం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి 1999 – 2004
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలుగుదేశం పార్టీ ఉపనాయకుడు 2004 – 2008
- రాజ్యసభ సభ్యుడు 2012 ఏప్రిల్ నుండి 2018 మే వరకు
ఎన్నికల చరిత్ర
సంవత్సరం | కార్యాలయం | నియోజక వర్గం | పార్టీ | ఓట్లు | % | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | % | ఫలితం | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1994 | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | మేడ్చల్ | తెలుగుదేశం పార్టీ | ఎస్.ఉమాదేవి | భారత జాతీయ కాంగ్రెస్ | గెలుపు | ||||||
1999 | ఎస్.హరివర్థన్ రెడ్డి | గెలుపు | ||||||||||
2004 | 172,916 | కె.ఆర్.సురేందర్ రెడ్డి | తెలంగాణా రాష్ట్ర సమితి | 147,209 | గెలుపు |
మూలాలు
- ↑ BBC News తెలుగు (29 March 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-12. Retrieved 2008-06-26.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Sakshi (23 November 2018). "మెజారిటీల్లో రికార్డు." Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
- ↑ Rediff (23 June 2008). "TDP leader quits for Telengana cause". Archived from the original on 7 జూలై 2008. Retrieved 30 July 2021.
- ↑ భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు
- ↑ భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు
- ↑ Sakshi (30 May 2014). "దేవేందర్ ఎంపీ @ ఏపీ". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
- ↑ The Times of India (3 February 2011). "NTP and PRP come together | Page 9". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
- ↑ https://archive.india.gov.in/govt/rajyasabhampbiodata.php?mpcode=2200. Retrieved 11 September 2019.
- ↑ Sakshi (3 November 2018). "హ్యాట్రిక్ వీరులు!". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.