తుక్కుగూడ
తుక్కుగూడ
పట్టణం | |
---|---|
తెలుగు | |
Coordinates: 17°12′33″N 78°28′35″E / 17.20917°N 78.47639°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | మహేశ్వరం |
పురపాలక సంఘం | తుక్కుగూడ పురపాలకసంఘం |
Time zone | UTC+5:30 |
తుక్కుగూడ, భారతదేశంలోని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని పురపాలక సంఘం. ఇది మహేశ్వరం మండల పరిధిలో ఉంది.ఇది హైదరాబాద్ నుండి 27 కిలోమీటర్లు దూరంలో ఉంది. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ప్రధాన కూడలి ఈ గ్రామం ద్వారా వెళుతుంది. ఈ పట్టణంకు 7 కి.మీ. దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.పట్టణంలో అయ్యప్ప ఆలయం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా సుమారు 5000 నుండి 8000 మంది లోపు ఇక్కడ నివసిస్తున్నారు.పిన్‌కోడ్ 501359
సాధారణ సమాచారం
తుక్కుగూడ పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.పట్టణ జనాభా మొత్తం 19182.[1] ఇది చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గం, మహేశ్వరం శాసనసభ నియోజక వర్గం పరిధికి చెందింది.[2] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న తుక్కుగూడ పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]
మూలాలు
- ↑ "Thukkuguda Municipality". thukkugudamunicipality.telangana.gov.in. Archived from the original on 2021-01-27. Retrieved 2020-10-02.
- ↑ "Thukkuguda Village". www.onefivenine.com. Retrieved 2020-10-02.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 22 March 2021.