నర్సింగ్‌పూర్ జిల్లా

Narsinghpur జిల్లా
नरसिंहपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో Narsinghpur జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Narsinghpur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుJabalpur
ముఖ్య పట్టణంNarsinghpur
Government
 • లోకసభ నియోజకవర్గాలుHoshangabad
విస్తీర్ణం
 • మొత్తం5,125.55 కి.మీ2 (1,978.99 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం10,92,141
 • జనసాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత76.79%
 • లింగ నిష్పత్తి917
Websiteఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51జిల్లాలలో నర్సింగ్‌పూర్ జిల్లా ఒకటి. నర్సింగ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

దమ్రు ఘాటి

భౌగోళికం

జిల్లా వైశాల్యం 5,125.55 చ.కి.మీ. జిల్లా జబల్‌పూర్ డివిజన్లో భాగం. జిల్లా ఉత్తర సరిహద్దులో దిమోహ్, సాగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జబల్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సెరోని జిల్లా, దక్షిణ సరిహద్దులో చింధ్వారా జిల్లా, పశ్చిమ సరిహద్దులో హోషంగాబాద్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాయ్‌సేన్ జిల్లా ఉన్నాయి. జిల్లాకేంద్రంగా నర్సింగ్‌పూర్ పట్టణం ఉంది.[1] జిల్లా నర్మదానదీ ముఖద్వారం వద్ద ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో విద్యపర్వత శ్రేణి ఉంది. సాత్పురా పర్వతావళి జిల్లా దక్షిణ సరిహద్దుగా ఉంది. జిల్లా 20-0-55, 23- -0- 15 ఉత్తర అక్షాంశం, 78-0-38, 79-0-38 తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 359.8 మీటర్ల ఎత్తున ఉంది. .[2]

చరిత్ర

19వ శతాబ్దం ఆరంభంలో నర్సింగ్‌పూర్ జిల్లా నాగపూర్కు చెందిన మరాఠీ బోంస్లే ఆధీనంలో ఉంది. ఇది గడారియా ఖేడాగా గుర్తించబడింది.

పేరువెనుక చరిత్ర

ఈ ప్రాంతాన్ని ఒక జాట్ నాయకుడు ఆక్రమించుకుని ఇక్కడ ఒక నర్సింహాలయం నిర్మించాడు. తరువాత ఈ ప్రాంతం మధ్య భూభాగాలలో ఒకటైన నర్సింగ్‌పూర్‌గా పిలువబడింది.

బ్రిటిష్ పాలన

1818లో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ కాలంలో ఇది ఇది నెర్బుడా డివిజన్‌లో భాగంగా ఉండేది. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఇది మధ్యభారతంలో ఒక జిల్లాగా తరువత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాగా మారింది.

ప్రముఖులు

  • ఓషో (రజనీష్)
  • మహర్షి మహేష్
  • అసుతోష్ (రాణా)

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,092,141,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 418వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 212 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.04%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 917:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.79%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

ఎడ్యుకేషన్

  • ప్రభుత్వ మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్
  • ప్రభుత్వ స్కూల్ యొక్క ఎక్సెలెంస్

ప్రయాణ సౌకర్యాలు

  • ముంబై - కొలకత్తా రైలు మార్గం జిల్లాలో తూర్పు పడమరలుగా పయనిస్తుంది.
  • రైలు స్టేషను సమీపంలో బస్ స్టాండ్ ఉంది. ఇది ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. ముందు ఇది నగరానికి కేంద్రంగా ఉండేది.
  • జాతీయరహదారి -26 జిల్లా మధ్యగా పయనిస్తుంది.

.

మూలాలు

  1. "Narsinghpur". mponline. Archived from the original on 2010-07-14. Retrieved 2010-08-19.
  2. "Narsinghpur". District administration. Archived from the original on 2019-08-10. Retrieved 2010-08-19.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567

వెలుపలి లింకులు

  • [1] List of places in Narsinghpur

వెలుపలి లింకులు