ప్రజాతి

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

ప్రజాతి జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను కుటుంబములో ఉంచుతారు.

ప్రజాతి పేరు

ఒక మొక్క ప్రజాతి పేరు లాటినీకరణం చేయబడిన నామవాచక రూపం. ఇది పెద్ద అక్షరాలతో (Capital latter) తో ప్రారంభమవుతుంది.

కొన్ని ప్రజాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :

  • సిసాల్పినో - సిసాల్పీనియా (Caesalpinia)
  • బాహిన్ - బాహీనియా (Bauhinia)
  • హుకర్ - హుకేరియా (Hookerea)
  • టర్నిఫోర్ట్ - టర్నిఫోర్టియా (Tournefortia)

కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి. ఉదాహరణ:

కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు గ్రీకు లేదా లాటిన్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి. ఉదాహరణ :

  • పాలిగాల = Poly + Gala
  • హైగ్రోఫిలా = Hygro + Phila
  • ఆస్టర్ కాంత = Aster + Cantha
  • ల్యూకాడెండ్రాన్ = Leuca + Dendron

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.