మధుబని

మధుబని
పట్టణం
మధుబని రైల్వేస్టేషన్నుండి పట్తణ దృశ్యం
మధుబని is located in Bihar
మధుబని
మధుబని
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°22′N 86°05′E / 26.37°N 86.08°E / 26.37; 86.08
దేశం India
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల
జిల్లామధుబని
Elevation
56 మీ (184 అ.)
జనాభా
 (2011)
 • Total75,736
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
టెలిఫోన్ కోడ్06276
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-32
లింగనిష్పత్తి1000/926 /

మధుబని బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ పరిధిలోకి వస్తుంది. పట్టణ పరిపాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది. ఇది దర్భంగా పట్టణానికి ఈశాన్యంగా 26 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం ఇది ' బేతియా సంస్థానం'లో భాగంగా ఉండేది. ఆ సంస్థాన పాలక వారసుల్లో వచ్చిన విభేదాల కారణంగా సంస్థానంలో కొంత భాగం వేరుపడి మధుబని సంస్థానం ఏర్పడింది.[1] "మధుబని" అనే పదానికి " తేనె అడవి " అని అర్ధం. దీని నుండి మధుబని ఉద్భవించింది, అయితే కొన్నిసార్లు దీనికి "మధు" + "వాణి" అనే అర్థం కూడా చెబుతారు. దీని అర్థం "తీపి" "శబ్దం/భాష".[2]

భౌగోళికం

మధుబని 26°22′N 86°05′E / 26.37°N 86.08°E / 26.37; 86.08 నిర్దేశాంకాల వద్ద,[3] సముద్ర మట్టానికి 56 మీటర్ల ఎత్తున ఉంది. (183) అడుగులు ).

జనాభా వివరాలు

2011 జనగణన నాటికి [4] మధుబని జనాభా 1,66,285. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 71.06%. ఇది జాతీయ సగటు 62.39% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 78.81%, మహిళా అక్షరాస్యత 53%. మధుబని జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

పట్టణ ప్రముఖులు

విద్యాపతి

మూలాలు

  1. Ram, Bindeshwar (1998). Land and society in India: agrarian relations in colonial North Bihar. Orient Blackswan. ISBN 978-81-250-0643-5.
  2. "Madhubani | India | Britannica.com". britannica.com. Retrieved 12 November 2016.
  3. "Maps, Weather, and Airports for Madhubani, India". fallingrain.com. Retrieved 12 November 2016.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.