ముజఫర్‌పూర్
ముజఫర్‌పూర్ | |
---|---|
నగరం | |
Coordinates: 26°7′21″N 85°23′26″E / 26.12250°N 85.39056°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | తిర్హుత్ |
జిల్లా | ముజఫర్‌పూర్ |
మునిసిపల్ కార్పొరేషను | ముజఫర్‌పూర్ మునిసిపల్ కార్పొరేషను |
విస్తీర్ణం | |
• Total | 93 కి.మీ2 (36 చ. మై) |
Elevation | 60 మీ (200 అ.) |
జనాభా | |
• Total | 3,93,724[1] |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 842001-05 |
టెలిఫోన్ కోడ్ | 0621 |
లింగ నిష్పత్తి | 890 (females per thousand males)[3]♂/♀ |
ముజఫర్‌పూర్ బీహార్ రాష్ట్రం,తిర్హట్ ప్రాంతంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక నగరం.[1][3] ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణమే కాక, తిర్హత్ డివిజనుకు, ముజఫర్‌పూర్ రైల్వే జిల్లాకు కూడా ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది బీహార్‌లో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో నాల్గవ స్థానంలో ఉంది.
ముజఫర్‌పూర్, షాహి లీచీలకు ప్రసిద్ది చెందింది. దీనిని లిచీ కింగ్డమ్ అని పిలుస్తారు.[4][5] భౌగోళిక సూచిక (జిఐ) పొందిన బీహారు ఉత్పత్తుల్లో జర్దాలూ మామిడి, కతర్ని బియ్యం, మగాహి తమలపాకుల తరువాత షాహి లిచ్చీ నాలుగవది. హిమాలయాల్లోని సోమేశ్వర్ కొండల [6] నుండి ప్రవహించే జీవనది బుర్హి గండక్ నది ఒడ్డున ఉంది.
భౌగోళికం
ముజఫర్‌పూర్ 26°07′N 85°24′E / 26.12°N 85.4°E నిర్దేశాంకాల వద్ద, సముద్ర మట్టం నుండి 47 మీటర్ల ఎత్తున ఉంది.[7] ఈ నగరం భారతదేశంలోకెల్లా అత్యంత చురుగ్గా ఉండే భూకంప మండలంలో ఉంది. 1934 జనవరి 15 న సంభవించిన ఘోరమైన భూకంపంలో పట్టణంలో చాలా భాగం తీవ్రంగా దెబ్బతింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.[8] ఈ పళ్ళెం ఆకారంలో, మధ్యలో పల్లంగా ఉండే ఈ పట్టణం బీహార్ లోని ఇండో-గంగా మైదానంలో, హిమాలయాల నుండి జీవ నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండ్రు, ఇసుకల మీద ఉంది.
జనాభా
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[9] ముజఫర్‌పూర్ జనాభా 3,93,724.[1] జనాభాలో పురుషులు 52.96% (2,08,509), మహిళలు 47.04% (1,85,215) ఉన్నారు. ముజఫర్‌పూర్ అక్షరాస్యత 74.74%. పురుషులలో అక్షరాస్యత 77.99% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 71.08%.
2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2,75,233 మంది హిందువులు ఉండగా 74,680 మంది ముస్లింలు, 1,352 మంది క్రైస్తవులు, ఇతర చిన్న మైనారిటీ మతాలకు చెందినవారు ఉన్నారు.[10]
రవాణా
రైల్వేలు
ముజఫర్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషను ఒక ప్రధాన రైల్వే జంక్షను. నగరంలో రామ్ దయాలు నగర్, నారాయణపూర్ అనంత్ (షేర్పూర్) అనే రెండు సబర్బన్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడి నుండి బీహార్ లోని పాట్నా, భాగల్పూర్, గయ, చకియా, మోతీహారి, దర్భాంగా వంటి ప్రధాన నగరాలకు రైలు సౌకర్యాలున్నాయి. ఇది ముజఫర్‌పూర్‌ను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాలతో కూడా కలుపుతుంది.
రోడ్లు
జాతీయ రహదారి 57, ముజఫర్‌పూర్ నగరాన్ని గోరఖ్పూర్, మోతిహరి, చకియా, దర్భాంగా, పూర్ణియా లతో కలుపుతుంది. తూర్పు-పడమర కారిడార్ ముజఫర్‌పూర్‌ను భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు అనుసంధానిస్తుంది. హాజీపూర్ నుండి ప్రారంభమయ్యే జాతీయ రహదారి 77 ముజఫర్‌పూర్ ను సీతామఢీకి కలుపుతుంది. జాతీయ రహదారి 28 ముజఫర్‌పూర్‌ను బరౌనితో కలుపుతుంది. మొత్తం 6 జాతీయ రహదారులకు ఈ నగరం కూడలి.
వాతావరణం
ముజఫర్‌పూర్‌లో కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం (Cfa) ఉంది. ఏప్రిల్ - జూన్ ల మధ్య ఉండే వేసవి కాలం చాలా వేడిగా, తేమగా ఉంటుంది (28/40 °C, 90% గరిష్టంగా). శీతాకాలం 06 - 20 °C ఉష్ణోగ్రతలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముజఫర్‌పూర్ పట్టణంలో వర్షపాతం బీహార్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ.
శీతోష్ణస్థితి డేటా - Muzaffarpur (1981–2010, extremes 1901–2009) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30.8 (87.4) |
34.6 (94.3) |
39.4 (102.9) |
42.2 (108.0) |
44.5 (112.1) |
43.4 (110.1) |
43.5 (110.3) |
40.6 (105.1) |
38.2 (100.8) |
35.9 (96.6) |
33.2 (91.8) |
29.6 (85.3) |
44.5 (112.1) |
సగటు అధిక °C (°F) | 21.9 (71.4) |
25.7 (78.3) |
31.0 (87.8) |
35.3 (95.5) |
35.2 (95.4) |
34.9 (94.8) |
32.6 (90.7) |
33.0 (91.4) |
32.3 (90.1) |
31.6 (88.9) |
28.7 (83.7) |
24.3 (75.7) |
30.5 (86.9) |
సగటు అల్ప °C (°F) | 10.2 (50.4) |
13.1 (55.6) |
17.2 (63.0) |
22.0 (71.6) |
24.7 (76.5) |
26.5 (79.7) |
26.6 (79.9) |
26.8 (80.2) |
25.8 (78.4) |
22.4 (72.3) |
16.3 (61.3) |
11.8 (53.2) |
20.3 (68.5) |
అత్యల్ప రికార్డు °C (°F) | 2.7 (36.9) |
2.2 (36.0) |
7.2 (45.0) |
12.6 (54.7) |
18.3 (64.9) |
19.4 (66.9) |
20.9 (69.6) |
20.6 (69.1) |
19.6 (67.3) |
14.4 (57.9) |
7.7 (45.9) |
4.0 (39.2) |
2.2 (36.0) |
సగటు వర్షపాతం mm (inches) | 10.4 (0.41) |
11.5 (0.45) |
8.4 (0.33) |
20.2 (0.80) |
71.5 (2.81) |
160.1 (6.30) |
294.5 (11.59) |
287.6 (11.32) |
208.5 (8.21) |
65.4 (2.57) |
4.3 (0.17) |
4.6 (0.18) |
1,147.1 (45.16) |
సగటు వర్షపాతపు రోజులు | 0.8 | 0.9 | 0.8 | 1.4 | 4.3 | 6.8 | 12.7 | 11.5 | 8.8 | 2.2 | 0.3 | 0.5 | 51.0 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 77 | 66 | 54 | 49 | 60 | 72 | 82 | 82 | 82 | 77 | 74 | 78 | 71 |
Source: India Meteorological Department[11][12] |
ప్రముఖ వ్యక్తులు
- బాబూ రాజేంద్ర ప్రసాద్, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
- అనామిక, హిందీ నవలా రచయిత్రి, కవయిత్రి.
- వీణా దేవి, భారతీయ రాజకీయవేత్త. పార్లమెంట్ సభ్యురాలు.
- శ్రేయా నారాయణ్, భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, రచయిత్రి.
- ఐశ్వర్య నిగమ్, భారతీయ నేపథ్యగాయకుడు.
- జానకీ వల్లభ్ శాస్త్రి, భారతీయ హిందీ కవి, రచయిత, విమర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- యోగేంద్ర శుక్లా, స్వాతంత్ర్య సమరయోధుడు.
- బసావన్ సింగ్, స్వాతంత్ర్య సమరయోధుడు.
- కిషోరి సిన్హా, రాజకీయవేత్త. మాజీ పార్లమెంట్ సభ్యురాలు.
- మృదుల సిన్హా, భారతీయ రచయిత్రి. రాజకీయవేత్త, గోవా మొదటి మహిళా గవర్నర్.
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Government of India. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 16 April 2012.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 21 December 2018.
- ↑ 3.0 3.1 "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Government of India. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 16 April 2012.
- ↑ "Bihar's famous Shahi litchi to get GI tag soon".
- ↑ Destinations :: Vaishali ::Bihar State Tourism Development Corporation Archived 22 జూలై 2015 at the Wayback Machine. Bstdc.bih.nic.in. Retrieved on 9 January 2011.
- ↑ "bihar". Scribd.com. Archived from the original on 8 November 2012. Retrieved 2 August 2014.
- ↑ Falling Rain Genomics, Inc – Muzaffarpur Archived 21 మార్చి 2008 at the Wayback Machine
- ↑ Bihar India Earthquake Movie, 15 January 1934 Archived 6 జనవరి 2009 at the Wayback Machine. Harappa.com (15 January 1934). Retrieved on 9 January 2011.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ "Muzaffarpur District Population, Bihar, List of Taluks in Muzaffarpur".
- ↑ "Station: Muzaffarpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 513–514. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M36. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.