మర
![](http://upload.wikimedia.org/wikipedia/commons/4/4c/Screws.jpg)
మర (ఆంగ్లం Screw) ఒక పరికరం, సామాన్యమైన యంత్రం. ఇది చూడడానికి మేకు లాగా కనిపిస్తుంది. దీనికి సర్పిలాకారంగా ఉండే గాడి చేయబడి ఉంటుంది. ఒక చివరి తలంలో మర తిప్పడానికి సౌకర్యంగా ఏర్పాటు కలిగిఉంటుంది. రెండవ చివర మొనదేలి కొన్ని ఘనపదార్థాలలోనికి సుళువుగా పోతుంది. ఇవి వివిధ పరిమాణాలలో తయారుచేస్తారు. వీటిని వివిధ వస్తువులకు కలిపి ఉంచడానికి ఉపయోగిస్తారు.
మరకు బోల్టుకు తేడా
సామాన్యంగా మరలు చిన్నవిగా (1/4 అంగుళం కన్నా తక్కువ) ఉండి, ఒకవైపు మొనదేలి ఉంటాయి. బోల్టులు పెద్దవిగా, స్థూపాకారంగా ఉండి నట్టుతో కలిపి ఉపయోగించడానికి అనువుగా చేయబడి ఉంటాయి. ఒకవైపు మొండిగా నట్టు ఎక్కించడానికి అవకాశం కల్పిస్తాయి. ఇవి కన్నాలు చేయబడిన వాటిని బిగించడానికి అధిక శక్తివంతమైన బంధాలకోసం వాడతారు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/Bolt_%28PSF%29.png/220px-Bolt_%28PSF%29.png)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/DIN6914_UNI5587.jpg/220px-DIN6914_UNI5587.jpg)