రాధ (నటి)

రాధ
60వ ఫిల్ం ఫేర్ పెస్టివల్ 2013 లో రాధానాయర్
జననం
ఉదయచంద్రిక

(1966-06-03) 1966 జూన్ 3 (వయసు 58)
క్రియాశీల సంవత్సరాలు1981 - 1991
జీవిత భాగస్వామిరాజశేఖరన్ నాయర్
పిల్లలుకార్తికా నాయర్, విఘ్నేష్, తులసి నాయర్
బంధువులుఅంబిక (అక్క)
పురస్కారాలుకళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్

రాధగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక (మళయాళం"രാധ); జ. జూన్ 3, 1966) భారతీయ సినీనటి[1] తెలుగు, తమిళ చలనచిత్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే.

రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది. ఈమె రజినీకాంత్తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్తో ఒరు ఖైదీయిన్ డైరీలో నటించింది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.

ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో చిదంబరము నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది. ఈమె కూతురు కార్తీక తెలుగులో మొదటి సారిగా హీరోయిన్ గా నటించినది ఆ చిత్రం పేరు జోష్ (2009)

చిత్ర సమాహారం

ఈమె నటించిన తెలుగు సినిమాల జాబితా:

తమిళ సినిమాలు

బయటి లింకులు

మూలాలు